E-Paper
Advertisement

AP Inter: విద్యార్థులకు టార్గెట్ ఫిక్స్.. ఇంటర్ కాలేజీల్లో సంకల్ప్ ప్లాన్.. కేవలం 50 రోజుల మాత్రమే

AP Inter: విద్యార్థులకు టార్గెట్ ఫిక్స్.. ఇంటర్ కాలేజీల్లో సంకల్ప్ ప్లాన్..  కేవలం  50 రోజుల మాత్రమే
Advertisement

AP Inter: ఏపీ విద్యాశాఖ ఇంటర్ విద్యార్థులపై ఫోకస్ చేసింది. ఇంటర్ విద్యార్థుల ఉత్తీర్ణత పెంచేందుకు ప్రణాళికలు ఇవాళ నుంచి అమలు చేస్తోంది. ఈ రోజు నుంచి కరెక్టుగా చూస్తే ఇంటర్ పరీక్షలకు కేవలం 90 రోజులు మాత్రమే మిగిలివుంది. ఈ నేపథ్యంలో విద్యాశాఖ 50 రోజుల సంకల్ప్ పేరిట ప్రణాళికలు అమలు చేస్తోంది.

ఇంటర్ కాలేజీల్లో సంకల్ప్ ప్లాన్, అదనపు క్లాసులు

Advertisement

ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు ఏపీ విద్యాశాఖ దృష్టి సారించింది. దీనికి సంబంధించి అధికారులు ప్రణాళికలను సిద్ధం చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరం 2025–26లో ఇంటర్‌ పరీక్షలు ఫిబ్రవరి 23 నుంచి మొదలుకానున్నాయి. ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లోనూ సోమవారం నుంచి ఫిబ్రవరి 20 వరకు రోజు వారీ ప్లాన్ అమలుకానుంది.

విద్యార్థుల సామర్థ్యాలను ఉపాధ్యాయులు ఎప్పటికప్పుడు అంచనా వేయనున్నారు. సామర్థ్యాల ఆధారంగా కేటగిరీలుగా విభజించి విద్యా బోధన చేయనున్నారు. ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు అంటే ప్రతి 50 నిమిషాలకు ఒక సబ్జెక్టు చొప్పున ట్రైనింగ్ ఇవ్వనున్నారు.  ఆ లెక్కన అదనపు తరగతులు నిర్వహించనుంది. విద్యాశాఖ జారీ చేసిన టైమ్‌ టేబుల్‌ను తప్పనిసరిగా అమలు చేయాలని డైరెక్టర్‌ రంజిత్‌ బాషా అధికారులను ఆదేశించారు.

Advertisement

విద్యార్థులకు టార్గెట్ ఫిక్స్..  కేవలం 50 రోజులు మాత్రమే

ఈ ఏడాది ఇంటర్ ఫస్టియర్ దాదాపు 5 లక్షల పైచిలుకు విద్యార్థులు పరీక్షలు రానున్నారు. అలాగే సెకండియర్‌లో దాదాపు నాలుగున్నర లక్షల పైమాటే. ఇంటర్ ఫస్ట్-సెకండ్ ఇయర్ కలిసి 10 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో ‘విజయపథం’ పేరుతో అమలు చేస్తున్నారు.

అంతేకాదు బాలికల కోసం ఫిబ్రవరి 20 వరకు ప్రత్యేక తరగతులు అమలు చేస్తున్నారు. ఇందులోభాగంగా ప్రతిరోజు రెండు సబ్జెక్టుల్లో పరీక్షలు పెట్టనున్నారు. అలాగే రెండు వారాలకు ఓసారి గ్రాండ్‌ టెస్టు నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ప్రణాళికను కేజీబీవీలకు అందజేసింది.

గతేడాది ఏపీ నుంచి  ఇంటర్ ఫస్టియర్‌లో 70 శాతం, సెకండ్ ఇయర్‌లో 83 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. అదే ప్రభుత్వ జూనియర్ కళాశాలల విషయానికి వచ్చేసరికి సెకండ్ ఇయర్ ఉత్తీర్ణత శాతం 69 శాతంగా ఉంది. దశాబ్ద కాలంలో ఇదే అత్యధికం. మొదటి సంవత్సరం ఉత్తీర్ణత శాతం 47 శాతంగా ఉంది. పదేళ్లలో రెండో అత్యధికం.ఈ నేపథ్యంలో ఉత్తీర్ణత పెంచేందుకు విద్యాశాఖ ప్రణాళికలు రెడీ చేసింది.

ALSO READ: పల్నాటి వీరుల తిరునాళ్లలో చివరిరోజు అపశృతి

వచ్చేనెల నుంచి పదో తరగతి ఈ తరహా ప్రణాళిక అమలు చేయనుంది. ఈ విద్యా సంవత్సరంలో పదో తరగతిలో దాదాపు 6 లక్షల పైచిలుకు విద్యార్థులు ఉన్నారు. వారిలో సగానికి పైగానే ప్రభుత్వ పాఠశాలలకు చెందిన విద్యార్థులు ఉన్నారు. డిసెంబర్‌ మొదటి వారం నుంచి ఎన్‌సీఈఆర్టీ 100 రోజుల ప్రత్యేక ప్రణాళిక అమలు చేయనుంది. వచ్చే ఏడాది మార్చి 16 నుంచి పదో తరగతి పరీక్షలను ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో 100 రోజుల షెడ్యూల్‌ను రూపొందిస్తోంది విద్యాశాఖ.

 

Related News

ఏపీలో అక్షరాస్యత శాతం మరీ అంత ఉందా? 100 శాతం సాధ్యమేనా?

వికటించిన మాత్రలు.. ఒకరు మృతి-53 మంది విద్యార్థులకు అస్వస్థత, పోలవరం జిల్లాలో ఘటన

బంగాళాఖాతంలో అల్పపీడనం, తెలుగు రాష్ట్రాలకు వాన కబురు, హైదరాబాద్‌లో తెల్లవారుజామున..

కృష్ణా జిల్లాలో షాకింగ్ న్యూస్.. నిందితుడి కాళ్లల్లోకి కాల్పులు జరిపిన పోలీసులు!

అన్నమయ్య జిల్లాలో ఫేక్ స్వామీజీ ఘరానా మోసం.. సాఫ్ట్‌వేర్ దంపతులకు రూ. 2 కోట్ల టోకరా!

ఓడిపోతామనే భయం.. కుట్రలకు తెరలేపారు, వైసీపీపై సీఎం చంద్రబాబు ఫైర్

ప్రయాణికుల ఇంటికి ఆర్టీసీ సేవలు.. ఏపీఎస్ఆర్టీసీ వినూత్నంగా

వెలిగొండ ప్రాజెక్టు వాగులో కొట్టుకుపోయిన బొలెరో, అందులో నలుగురు వ్యక్తులు, రంగంలోకి రెస్క్యూ టీమ్

Big Stories

Advertisement
×