Sankranti Celebrations : టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. నారా, నందమూరి ఫ్యామిలీ సందడితో సంక్రాంతి సంబరాలు మరింత అట్టహాసంగా సాగుతున్నాయి. ప్రతి ఏటా నారా చంద్రబాబు కుటుంబ సభ్యులతోపాటు నందమూరి ఫ్యామిలీ కూడా అక్కడకు చేరుకుని పండుగ జరుపుకోవడం ఆనవాయితీ వస్తుండటంతో.. ఇరు కుటుంబ సభ్యులంతా శనివారమే నారావారిపల్లెకు చేరుకున్నారు.
Sankranti Celebrations : టీడీపీ అధినేత చంద్రబాబు స్వగ్రామమైన నారావారిపల్లెలో సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటుతున్నాయి. నారా, నందమూరి ఫ్యామిలీ సందడితో సంక్రాంతి సంబరాలు మరింత అట్టహాసంగా సాగుతున్నాయి. ప్రతి ఏటా నారా చంద్రబాబు కుటుంబ సభ్యులతోపాటు నందమూరి ఫ్యామిలీ కూడా అక్కడకు చేరుకుని పండుగ జరుపుకోవడం ఆనవాయితీ వస్తుండటంతో.. ఇరు కుటుంబ సభ్యులంతా నారావారిపల్లెకు చేరుకున్నారు.
సంక్రాంతి పండుగను పురష్కరించుకొని నారా, నందమూరి ఫ్యామిలీ సభ్యులు నారావారిపల్లెలో సందడి చేశారు. చిన్నా పెద్ద అంతా చేరి ఆనందంగా పండగను జరుపుకున్నారు. సోమవారం గ్రామ దేవత సత్యమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాగాలమ్మ గుడికి వెళ్లి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం తన తల్లిదండ్రుల సమాధి వద్దకు వెళ్లి చంద్రబాబు ఘనంగా నివాళ్లు అర్పించారు.