BigTV English

Kethireddy: జగన్ సీఎంవో తీరుపై కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Kethireddy: జగన్ సీఎంవో తీరుపై కేతిరెడ్డి సంచలన వ్యాఖ్యలు

Former Mla Kethireddy: జగన్ సీఎంవో తీరుపై ధర్మవరం మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ పాలనలోని సీఎంవో తీరుపై పలు ఆరోపణలు చేశారు. సీఎంవో కార్యాలయంలో పనిచేసే అధికారుల ప్రవర్తన తీరువల్ల నియోజకవర్గ సమస్యలను నేరుగా జగన్‌కు చెప్పుకోలేక పోయామని ఆవేదన వ్యక్తం చేశారు.


ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్ కార్యాలయ వ్యవహార తీరుపై వైసీపీ నేతలు ఒక్కొక్కరుగా పెదవి విప్పుతున్నారు. ఈ నేపథ్యంలో కేతిరెడ్డి కూడా పీఎంవో తీరుపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నియోజకవర్గ సమస్యలను జగన్ దృష్టికి తీసుకువెళ్లేందుకు.. వెళితే సీఎంవో తీరుతో సీఎంను కలిసేందుకు వీలు అయ్యేది కాదని ఆరోపించారు. వారి ప్రవర్తన వల్ల మంత్రులు, ఎమ్మెల్యేలు సైతం ఇబ్బంది పడ్డారని, గంటల తరబడి ఎదురు చూసే పరిస్థితి ఉండేదని పేర్కొన్నారు.

Also Read: వైసీపీ ఓటమికి కారణం.. తిలా పాపం తలా పిడికెడు


ధర్మవరం రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణం కోసం భూసేకరణకు అవసరమయ్యే డబ్బుల కోసం వందసార్లు సీఎం కార్యాలయం చుట్టూ తిరిగానని అన్నారు. రోడ్ల మరమ్మతులకు నిధులు విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రెటరీ చుట్టూ తిరిగినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. ఎన్నికల్లో కూటమి ఇచ్చిన హామీలను ప్రజలు నమ్మడం వల్లే అత్యధిక స్థానాల్లో గెలుపొందిందని వెల్లడించారు. వైసీపీ కూడా పెన్షన్ పెంచుకుంటూ పోతామని భరోసా ఇస్తే ఫలితాలు సానుకూలంగా ఉండేవని అన్నారు. ఎన్నికల ఫలితాలు నిరాశ పరిచాయని పేర్కొన్నారు.

Tags

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×