BigTV English

India Population: 2060 నాటికి 170 కోట్ల భారత జనాభా: ఐరాస

India Population: 2060 నాటికి 170 కోట్ల భారత జనాభా: ఐరాస

India Population(Today’s international news): భారత జనాభా 2060 నాటికి సుమారు 170 కోట్లు దాటుతుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. ఆ తర్వాత క్రమంగా తగ్గుతుందని వెల్లడించింది. 2100 వరకు ప్రపంచంలో అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ కొనసాగుతుందని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే వరల్డ్ పాపులేషన్ ప్రాస్పెక్ట్స్ 2024 పేరిట ఓ నివేదిక విడుదల చేసింది. 2100 నాటికి చైనా జనాభా 78.6 కోట్లు తగ్గి.. 63 కోట్లకు పరిమితం అవుతుందని ఐక్యరాజ్య సమితి తెలిపింది.


గతేడాది చైనాను అధిగమించి ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా ఎదిగిన భారత్ ఈ శతాబ్ధం మొత్తం అదే హోదాను కలిగి ఉంటుందని ఐక్యరాజ్య సమితి అంచనా వేసింది. 2024లో భారత్ జనాభా 145 కోట్లని తెలిపింది. 2054 నాటికి అది 169 కోట్లకు చేరుతుందని వెల్లడించింది. ఈ తర్వాత క్రమంగా 150 కోట్లకు తగ్గుతుందని పేర్కొంది. భారత జనాభా 2060 నాటికి క్రమంగా 170 కోట్ల గరిష్ట స్థాయికి పెరుగుతుందని వెల్లడించింది. తర్వాత 12 శాతం తగ్గుదల రేటుతో దిగివస్తుందని తెలిపింది.

2100 నాటికి భారత్ జనాభా: ప్రస్తుతం చైనా జనాభా 142 కోట్లు అని.. 2054 నాటికి అది 121 కోట్లు తగ్గుతుందని ఐక్యరాజ్యసమితి తెలిపింది. 2100 నాటికి 63.3 కోట్లకు పడిపోతుందని అంచనా వేసింది. 2100 నాటకి చైనా జనాభా రెండున్నర రెట్లు ఎక్కువ ఉంటుందని వెల్లడించింది. 2024-54 మధ్య చైనా జనాభాతో భారీ తగ్గుదల నమోదవుతుందని తెలిపింది. అంతే కాకుండా జపాన్, రష్యాలోనూ జనాభా భారీగా పెరుగుతోందని తెలిపింది. 2024-54 మధ్య చైనా జనాభా 20 కోట్లు, రాష్యా జనాభా కోటి తగ్గనుంది, కానీ 2100 నాటికి చైనా జనాభా78.6 కోట్లు తగ్గి 63 కోట్లకే పరిమితం కానుందని వెల్లడించింది.


సంతాన సాఫల్యత రేటు పడిపోవడమే కారణం:
2024లో 820 కోట్లు ఉన్న ప్రపంచ జనాభా 2080లో గరిష్టానికి చేరుకుంటుందని ఐక్యరాజ్య సమితి తెలిపింది. వచ్చే 50 నుంచి 60 ఏళ్ళలో ప్రపంచ జనాభా 1030 కోట్ల వద్ద గరిష్టానికి చేరుకుంటుందని వెల్లడించింది. అనంతరం తగ్గుతూ 1020 కోట్లకు చేరుకుంటుందని తెలిపింది. సంతాన సాఫల్యత రేటు గణనీయంగా పడిపోవడమే జనాభా తగ్గడానికి కారణం ఐక్యరాజ్యసమితి వివరించింది. చైనాలో సగటున ఒక్కో మహిళ తమ జీవిత కాలంలో ఒకరికి మాత్రమే జన్మిస్తున్నట్లు వెల్లడించింది.

Also Read: మళ్లీ తడబడిన జోబైడెన్.. ఈసారి ఏమన్నారంటే..?

సంతాన సాఫల్యత రేటు 2.1 ఉండాలని, అప్పుడే ప్రస్తుత జనాభా అలాగే కొనసాగుతుందని ఐరాస తెలిపింది 1.8 లేదా 1.5 కంటే తక్కువకు చేరితే జనాభా గణనీయంగా పడిపోతుందని పేర్కొన్నారు. చైనా సహా మరికొన్ని దేశాల్లో ప్రస్తుతం ఇదే పరిస్థితి కొనసాగుతుందని వివరించింది.

Related News

Nobel Prize 2025 Medicine: రోగ నిరోధక వ్యవస్థపై ఆవిష్కరణలు.. వైద్యశాస్త్రంలో ముగ్గురికి నోబెల్

Nobel Prize Winners: వైద్య రంగంలో ముగ్గురికి నోబెల్ బహుమతి.. వారి పేర్లు ఇవే

Mount Everest: ఎవరెస్ట్‌పై మంచు తుపాను ప్రతాపం.. మూసుకుపోయిన దారులు, చిక్కుకుపోయిన 1000 మంది

Grokipedia: రెండు వారాల్లో గ్రోకీపీడియా.. ఎలాన్ మస్క్ సంచలన ప్రకటన

Singapore News: ఇద్దరు భారతీయ టూరిస్టులకు సింగపూర్ కోర్టు షాక్.. హోటల్ గదుల్లో వారిని పిలిచి

Theaters Attack: కెనడాలో ఘోరం.. భారతీయ చిత్రాల థియేటర్లపై దాడులు, పవన్ సినిమాకు

Putin Vs Trump: ట్రంప్‌పై పుతిన్ ఆగ్రహం.. భారత్‌ తలొగ్గదు, అమెరికాకు పెద్ద దెబ్బ

Pakistan: ఆయనో సేల్స్ మెన్, ఈయనో మేనేజర్.. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్, ప్రధానిపై సెటైర్లు

Big Stories

×