E-Paper
Advertisement

GHMC: జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్

GHMC: జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం.. పారిశుద్ధ్య కార్మికులకు ఉచిత క్యాన్సర్ స్క్రీనింగ్
Advertisement

GHMC:  క్యాన్సర్ వ్యాధి చాపకింద నీరులా వ్యాపిస్తున్న నేటి తరుణంలో తమ ప్రాణాలను ఫణంగా పెట్టి విధులు నిర్వహిస్తున్న పారిశుద్ధ్య కార్మికులకు జీహెచ్ఎంసీ అండగా నిలిచింది. అందుబాటులో సరైన సదుపాయాలు లేక ఆరోగ్య పరీక్షలు నిర్లక్ష్యం చేస్తూ కొందరు క్యాన్సర్ వ్యాధి బారిన పడుతున్నట్లు గుర్తించిన జీహెచ్ఎంసీ ముందస్తుగా క్యాన్సర్ ను గుర్తించేందుకు నడుం బిగించింది. ఈ కార్యక్రమంలోనే పారిశుద్ధ్య కార్మికులు, ఉద్యోగులకు కార్కినోస్ హెల్త్ కేర్ భాగస్వామ్యంతో జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీస్ లో మొబైల్ ఉచిత క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ శిబిరాన్ని ఏర్పాటు చేసింది.

Also Read:Telangana Municipal Elections: గులాబీ మాజీ మంత్రులకు ఎదురీత.. ఉమ్మడి నల్గొండలో గెలిచింది ఒకే మున్సిపాలిటీ! 

ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు

Advertisement

మహిళలకు ఓరల్, ,బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు, పురుషులకు ఓరల్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించారు. క్యాన్సర్ భయాలు తొలగించడం, అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం. వ్యాధి రాకుండా ముందు జాగ్రత్త చర్యలు చేపట్టడం. ప్రమాదస్థాయిలో ఉన్నవారిని గుర్తించేందుకు స్క్రీనింగ్ పరీక్షలు చెయ్యడం ద్వారా వ్యాధిని ప్రాథమిక దశలో గుర్తించడం, వైద్య సేవలు అందించడం వంటి కార్యక్రమాలు చేపట్టేందుకు జీహెచ్ఎంసీ సిద్దమైంది.

కర్ణన్ ప్రత్యేక చొరవ

ఇండియన్ క్యాన్సర్ సొసైటి దీనికి ఫండింగ్ చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇప్పటికే 20 సర్కిళ్లకు చెందిన కార్మికులను ఈ స్క్రీనింగ్ కింద కవర్ చేసినట్లు అధికారులు వెల్లడించారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్ వి కర్ణన్ ప్రత్యేక చొరవతో నిర్వహిస్తున్న ఈ శిబిరాన్ని కమిషనర్ కూడా నేరుగా పరిశీలించారు. మొబైల్ ఉచిత క్యాన్సర్ అవగాహన, స్క్రీనింగ్ శిబిరాల నిర్వహణను కమిషనర్ ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ కార్మికులకు చాలా ఎఫెక్టుగా పరీక్షలు నిర్వహించాలని అధికారులకు సూచించారు.

Advertisement

Also Read:Telangana Municipal Elections: కరీంనగర్ కార్పొరేషన్ కాషాయమయం.. ఫలించిన కేంద్ర మంత్రి బండి సంజయ్ కృషి 

Related News

రేవంత్ సర్కార్ కొత్త పథకం.. క్యూర్ పరిధిలో ఎల్ఐజి ఇళ్లకు శ్రీకారం, 10 అంతస్తుల టవర్ల నిర్మాణం

తెలంగాణలో బీజేపీ నెక్స్ట్ టార్గెట్ అదే.. కేడర్‌కు రాంచందర్ రావు రూట్ మ్యాప్!

Bandi Sanjay: తెలంగాణ పాలిటిక్స్‌లో సంచలనం.. కేంద్ర మంత్రి లలన్ సింగ్‌కు బండి సంజయ్ లేఖ!

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

Big Stories

Advertisement
×