BigTV English

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Sonusood: ఏపీ 100 రోజులపాలనపై సోనూసూద్ కామెంట్స్.. ఏమన్నారంటే..?

Sonusood Comments on AP Govt: ఏపీలో కూటమి ప్రభుత్వ 100 రోజుల పాలనపై ప్రముఖ సినీ నటుడు సోనూసూద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏపీ అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు సీఎం చంద్రబాబు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారని ఆయన అన్నారు. తొలి 100 రోజుల్లో సీఎం చంద్రబాబు విశిష్ట పాలన అందించారన్నారు.


ఈ మేరకు ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టారు. ‘చంద్రబాబుకు సుదీర్ఘ అనుభవం ఉంది. తన ముందుచూపుతో ఏపీ భవిష్యత్తు కోసం తీవ్రంగా కృషి చేస్తున్నారు. ఇందుకో ఆయనను ఏపీ ప్రజలు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వ పాలనను కొనియాడుతున్నాను. ఇంతలా కష్టపడుతున్న సీఎం చంద్రబాబును చూస్తుంటే నిజంగా నాకు గర్వంగా ఉంది. ఆయనకు ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నాను. త్వరలోనే సీఎం చంద్రబాబును కలుస్తాను. ఏపీని మరింతగా అభివృద్ధి చేసేందుకు నా వంతు సాయం నేను చేస్తాను’ అంటూ సోనూసూద్ ఏపీ 100 రోజుల పాలనపై ప్రశంసల వర్షం కురిపించారు.

Also Read: సీఎం చంద్రబాబుకు భూమన ప్రశ్నల వర్షం.. పార్థసారథి కౌంటర్


Related News

Tidco Houses: వ‌చ్చే జూన్ నాటికి టిడ్కో ఇళ్లు పూర్తి.. ప్రతి శనివారం లబ్దిదారులకు అందజేత- మంత్రి నారాయణ

Aadhaar Camps: ఆధార్ నమోదు, అప్డేట్ చేసుకోవాలా?.. ఇప్పుడు మీ గ్రామంలోనే.. ఎప్పుడంటే?

Jagan – Modi: మోదీ భజనలో తగ్గేదేలేదు.. కారణం అదేనా?

Pawan – Lokesh: పవన్ తో లోకేష్ భేటీ.. అసలు విషయం ఏంటంటే?

CM Progress Report: విదేశీ ప్రతినిధులతో సీఎం భారీ పెట్టుబడులే లక్ష్యం!

AP Rains: రాగల 24 గంటల్లో అల్పపీడనం ఏర్పడే ఛాన్స్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు

AP Elections: నాలుగు దశల్లో స్థానిక సంస్థల ఎన్నికలు.. జనవరిలో నోటిఫికేషన్.. నీలం సాహ్ని ప్రకటన!

Toll Plaza Crowd: అమ‌లులోకి కొత్త రూల్స్‌.. టోల్ ప్లాజాల వద్ద భారీగా రద్దీ!

Big Stories

×