Ayyanna patrudu latest news(AP political news): వైసీపీ అధినేత జగన్ విషయంలో స్పీకర్ అయ్యన్నపాత్రుడు మనసు మార్చు కున్నారా? ఉన్నట్లుండి స్పీకర్ వాయిస్ ఎందుకు ఛేంజ్ అయ్యింది? ఎందుకు ఆ వ్యాఖ్యలు చేశారు? మరి జగన్ మనసులో ఏముంది? ఇంతకీ స్పీకర్ మాటలకు జగన్ గ్రీన్‌సిగ్నల్ ఇస్తారా? ఇవే ప్రశ్నలు ఏపీ ప్రజల ను వెంటాడుతోంది.
శుక్రవారం తూర్పుగోదావరి జిల్లాకు వెళ్లారు ఏపీ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు. పిఠాపురం వచ్చిన అయ్యన్నపాత్రుడు, టీడీపీ మాజీ ఎమ్మెల్యే వర్మ అతిథి గృహంలో మీడియాతో మాట్లాడారు. ప్రజా సమస్యలను మాట్లాడిన స్పీకర్, పనిలో పనిగా మీడియా మిత్రులు జగన్ గురించి పలు ప్రశ్నలు లేవనెత్తారు.
స్పీకర్‌గా మాజీ సీఎం జగన్‌కు సభలో అవకాశమిస్తానని అన్నారు అయ్యన్నపాత్రుడు. వైసీపీకి వచ్చిన సీట్లకు అనుగుణంగా సమయం కేటాయిస్తాన్నారు. పులివెందుల ఎమ్మెల్యేగా అసెంబ్లీకి వచ్చిన సమస్యలను స్వేచ్ఛగా చెప్పవచ్చని అన్నారు. ఈ విషయంలో తాను ఛాన్స్ ఇస్తాననని, ప్రజా సమస్యల విషయంలో సభ్యులంతా తనకు ఒక్కటేనని అన్నారు.
ALSO READ: మిడ్‌నైట్ హంగామా.. భార్యపై దాడికి దువ్వాడ శ్రీను యత్నం.. పోలీసుల జోక్యంతో?
స్పీకర్ అయ్యన్నపాత్రుడు ఇచ్చిన గోల్డెన్ ఛాన్స్‌ని వైసీపీ అధినేత జగన్ అందిపుచ్చుకుంటారా? లేక రిజెక్ట్ చేస్తారా? అన్నది ప్రస్తుత సమస్య. ప్రస్తుతానికి అసెంబ్లీ సమావేశాలు లేవు. మూడు లేదా నాలుగు నెలలలో వింటర్ అసెంబ్లీ సమావేశాలు మొదలుకానున్నాయి. ఈలోగా జగన్ మనసు మార్చుకోవచ్చని ఆ పార్టీ నేతల మాట.
జగన్ వ్యవహారశైలిని గమనించిన ఆ పార్టీకి చెందిన కీలక నేతలు ఒకొక్కరుగా దూరమవుతున్నారు. ఇప్పటి కే ముగ్గురు నేతలు గుడ్ బై చెప్పేశారు. ఒకవేళ జగన్ మనసు మార్చుకుంటే పార్టీలో ఉండాలని, లేకుంటే మరో పార్టీకి వెళ్లిపోయాలనే ఆలోచనలో అరడజను మాజీ మంత్రులు, కీలక నేతలు ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. నాలుగైదు నెలల్లో జగన్ తీసుకోబోయే నిర్ణయంపై ఆ నేతలంతా వెయిట్ చేస్తున్నట్లు తెలుస్తోంది.