Duvvada Srinu’s family issue(Andhra pradesh today news): నాలుగు గోడల మధ్య జరగాల్సిన వ్యవహారం.. నలుగురు మధ్యకు చేరింది. రచ్చకు దారి తీసింది. ఇన్నాళ్లు గుట్టుగా సాగిన వ్యవహారం ఒక్కసారిగా బయటకురావడంతో తట్టుకోలేక పోయారు. కోపాలు పెరిగిపోయాయి. నియంత్రించుకోలేని స్థాయికి చేరింది. చివరకు రాత్రి వేళ భార్య వాణి, కూతురుపై దాడికి ప్రయత్నించాడు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. పోలీసులు అడ్డుకోవడంతో వాణి, ఆమె కూతరు సేఫ్. ఇంతకీ అసలు మిడ్‌నైట్ ఏం జరిగింది?
దువ్వాడ శ్రీనివాస్ గురించి చెప్పనక్కర్లేదు. వైసీపీలో పాపులర్ పర్సన్. ప్రత్యర్థిపై మండిపడుతూ మీడియా ముందు కంటతడి పెట్టి అధినేత జగన్‌ను ఆకట్టుకున్ననేత. అన్నట్లు.. కాలం ఎప్పుడూ ఒకేలా ఉంటుందా? దువ్వాడ విషయంలోనూ అదే జరిగింది. దీంతో దువ్వాడ శ్రీను ఫ్యామిలీలో అంతర్గత కలహాలు క్రమ క్రమంగా పెరిగి ముదిరిపాకాన పడ్డాయి. ఏ రోజూ బయటపడిన సందర్భాలు రాలేదు. మరి ఏం జరిగిందో తెలీదుగానీ దువ్వాడ శ్రీను ‘నారీ నారీ నడుమ మురారి’ ఇంటిగుట్టు బయటకువచ్చింది.
శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో దువ్వాడ శ్రీను ‘ప్రత్యేకం’గా ఉన్న ఇంటికి వెళ్లారు భార్య వాణి, కూతురు హైందవి. తల్లీ కూతురు అక్కడకు వచ్చిన విషయం దువ్వాడ శ్రీను, ఆయన సోదరుడుకి తెలిసింది. అనుచరులు, పోలీసులు అక్కడికి చేరుకున్నారు. దువ్వాడ శ్రీనివాస్ వస్తూ.. పరుష పదజాలంతో విరుచుకుపడ్డారు. తిట్ల దండకంతో బూతు పురాణం మొదలుపెట్టారు.
ALSO READ: నాకు ఏ దిక్కూ లేక దువ్వాడకు దగ్గరయ్యా: మాధురి
ఇంటి నిర్మాణానికి వినియోగించే వస్తువు సామాగ్రితో భార్య వాణి, కూతురుపై దాడికి చేయబోయాడు దువ్వాడ శ్రీను. అయితే పోలీసులు ఆమెకు వలయంగా మారారు. దువ్వాడ శ్రీనును సైతం పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఒకరిపై మరొకరు తీవ్రమైన ఆరోపణలు చేసుకున్నారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. చివరకు భార్య వాణి, కూతురు హైందవి బైఠాయంచారు. పోలీసులు కన్వీన్స్ చేయడంతో పరిస్థితి కాస్త కూల్ అయ్యింది.
వైసీపీ అధినేత జగన్ ఎమ్మెల్సీ పదవి ఇచ్చిన నుంచి దువ్వాడ శ్రీనుకు ఇంటి రగడ మొదలైంది. కాకపోతే తన టాలెంట్‌తో ఆ విషయాన్ని సెలైంట్ చేసే ప్రయత్నం చేశాడు. ఈలోగా ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నిక ల్లో దువ్వాడ శ్రీను భార్య వాణి పోటీ చేశారు.. జెడ్పీటీసీగా గెలుపొందారు. ఆ తర్వాత నుంచి భార్య భర్తలు మధ్య ఎడబాటు మరింత పెరిగింది.
ఈ టార్చర్ తట్టుకోలేక జగన్ వద్దకు వెళ్లిన దువ్వాడ, నియోజకవర్గానికి తన భార్య వాణిని ఇన్‌ఛార్జ్ చేయా లని రిక్వెస్ట్ చేశారు. పరిస్థితి గమనించిన జగన్, అలాగే అని చెప్పి వారిని పంపించారు. అయితే అభ్యర్థుల పేర్లు ప్రకటించినప్పుడు టెక్కలి నుంచి దువ్వాడశ్రీను ప్రకటించింది ఆ పార్టీ. దీంతో భార్యభర్తల మధ్య వివాదం మరింత ముదిరింది. తారాస్థాయికి చేరి చివరకు బయటకు వచ్చింది. మరి ఈ వ్యవహారానికి ఫుల్‌స్టాప్ ఎప్పుడు పడుతుందో చూడాలి.
దువ్వాడ శ్రీను ఇంటి వద్ద ఉద్రిక్తత
దువ్వాడ శ్రీను ఇంట్లోకి వెళ్లిన ఆయన భార్య వాణి, కుమార్తెలు
వాణి, శ్రీనుల మధ్య వాగ్వాదం.. అడ్డుకున్న పోలీసులు#duvvadasrinivas #DuvvadaFamily #tekkali #AndhraPradesh #bigtvlive https://t.co/woAcIMZx0Z pic.twitter.com/YY9qDr2lLu
— BIG TV Breaking News (@bigtvtelugu) August 10, 2024