శ్రీకాకుళం జిల్లా వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ కుటుంబ వివాదం రచ్చకెక్కింది. తాజాగా అతని ఇంటి ముందు కుమార్తెలు నిరసనకు దిగారు. తమ తండ్రి బయటకు రావాలంటూ మౌనపోరాటానికి దిగారు. ఎన్నికలకు ఏడాది ముందే దువ్వాడ శ్రీను కుటుంబ వివాదాలు బయటపడ్డాయి. కొన్నాళ్ల కిందట దువ్వాడ శ్రీను అక్కవరం వద్ద ఇంటిని నిర్మించుకుని మరో మహిళతో కలసి ఉంటున్నట్లు ప్రచారం జరుగుతోంది.
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీడీపీ, జనసేన నాయకులపై మితిమీరిన నోటిదురుసుతో విమర్శలు చేసిన దువ్వాడ శ్రీనుకు 2021లో జగన్ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టారు. కాంగ్రెస్‌తో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన అతను 2001లో శ్రీకాకుళం జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా 2006లో జడ్పీటీసీగా గెలిచి శ్రీకాకుళం జిల్లా పరిషత్ వైస్ చైర్మన్‌గా పనిచేశాడు. తర్వాత కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి చిరంజీవి ఏర్పాటు చేసిన ప్రజారాజ్యం పార్టీలో చేరి 2009లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టెక్కలి నియోజకవర్గం నుండి పోటీ చేసి మూడో స్థానానికి పరిమితమయ్యాడు. తర్వాత వైసీపీలో చేరి 2014లో టెక్కలి ఎమ్మెల్యేగా, 2019లో శ్రీకాకుళం ఎంపీగా పోటీ చేసి ఓటమి మూటగట్టుకున్నాడు.
జడ్పీటీసీగా తప్ప ఇంకెప్పుడూ ప్రత్యక్షరాజకీయాల్లో గెలవని దువ్వాడను అధికారంలోకి వచ్చిన రెండేళ్లకు జగన్ ఎమ్మెల్సీని చేశారు. మొన్నటి ఎన్నికల్లో మళ్లీ టెక్కలి అసెంబ్లీ సీటు ఇచ్చి తానే వచ్చి ప్రచారం కూడా నిర్వహించారు. అయినా దువ్వాడ 34.5 వేల ఓట్ల తేడాతో వరుసగా నాలుగో సారి కూడా ఓటమిపాలయ్యాడు. ఎన్నికలకు ఏడాది ముందే దువ్వాడ శ్రీను కుటుంబ వివాదాలు బయటపడ్డాయి. అప్పట్లో జిల్లాకు వచ్చిన జగన్ టెక్కలి అసెంబ్లీ సీటును దువ్వాడ శ్రీనుకే ఇస్తున్నట్లు ప్రకటించారు. ఆతర్వాత కొద్దిరోజుల్లోనే దువ్వాడ శ్రీను సతీమణి దువ్వాడ వాణి కొంతమందిని వెంటబెట్టుకుని జగన్‌ను కలిసి భర్తపై ఫిర్యాదు చేశారు.
ఆ తర్వాత పరిణామాలతో టెక్కలి నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జిగా దువ్వాడ వాణిని నియమించారు. అయితే టెక్కలి సీటును శ్రీనుకు కేటాయించడంతో తాను ఇండిపెండెంట్‌గా నామినేషన్ వేస్తున్నట్లు వాణి ప్రకటించారు. దీంతో కంగుతిన్న వైసీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డితోపాటు మరికొంతమంది నచ్చజెప్పి కుటుంబ వ్యవహారాలను కొంతమేర సెటిల్ చేశారంటారు. అయితే మరో ఇళ్లు నిర్మించుకున్న దువ్వాడ. అక్కడ సెకండ్ ఫ్యామిలీ పెట్టారంటారు. దువ్వాడ శ్రీనుమరో మహిళతో ఉంటుండటంతో తమ సంగతేమిటో తేల్చాలంటూ కుమార్తెలు తాజాగా ఆందోళన నిర్వహించారు.
దువ్వాడ శ్రీను ఇంటిముందే కుమార్తెలు కారులో కూర్చుని తండ్రిని కలవడానికి చాలాసేపు వెయిట్ చేశారుబయటి నుంచి పిలిచినప్పటికీ సిబ్బంది గేటు తీయలేదు. దాంతో అతని కుమార్తె హైందని మీడియా ముందు కొచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. అర్ధరాత్రి వరకు నిరీక్షించినా తమ తండ్రి పట్టించుకోకపోవడం బాధ కలిగించిందని కన్నీరు పెట్టారు.. అతన్ని తమతో కలవకుండా చేస్తున్నది మానాన్న తో ఇంట్లో ఉంటున్న మహిళేనని.. తమ తల్లిదండ్రులకు చట్టపరంగా విడాకులు కాలేదని ఆమె అంటున్నారు.
Also Read: మిడ్‌నైట్ హంగామా.. భార్యపై దాడికి దువ్వాడ శ్రీను యత్నం.. పోలీసుల జోక్యంతో?
ఎమ్మెల్సీ వ్యవహారంపై భార్య వాణి కూడా తీవ్రంగా స్పదించారు. దువ్వాడ శ్రీను ఎవరి ట్రావ్ లో పడ్డారో తెలియదని… తమ కుటుంభం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుటుంబ సమస్యను పరిష్కరించాలని పార్టీ అధిష్టానం దృష్టిలో కూడా పెట్టానని.. తన భర్త శ్రీనుతో ఉన్న మహిళ మోసగత్తె అని విమర్శించారు.. తన భర్త దువ్వాడ శ్రీను వద్ద ఆ మహిళను బయటకి పంపించే వరకు పిల్లలతో కలిసి పోరాటం చేస్తానంటున్నారు
పవన్ కల్యాణ్ వ్యక్తిగత జీవితంపై తీవ్ర విమర్శలు చేసిన వారిలో దువ్వాడ శ్రీనివాస్ ఒకరు. అప్పట్లో ఆయన ఆ వ్యవహారంపై అతను మాట్లాడుతూ.. తెలుగువాడు ఏకపత్నీ వ్రతుడిగా ఉండాలని.. ఒకే స్త్రీతో సంసారం మన సాంప్రదాయం.. వంటి డైలాగులు బలంగానే పేల్చారు. కట్ చేస్తే ఇప్పుడు సదరు దువ్వాడ శ్రీనివాస్ సెకండ్ ఫ్యామిలీ వ్యవహారం ఇప్పుడు రచ్చ రచ్చగా మారింది. భార్యబిడ్డలను వదిలిపెట్టి పెళ్లి అయిందో లేదో తెలియని రెండో మహిళతో ఆయన ఉంటుండటం వివాదాస్పదమైంది. తమకు అన్యాయం చేస్తున్నాడంటూ ఆతని భార్య, కుమార్తె రోడ్డుపైకి వచ్చి నిరసన తెలుపుతున్న పరిస్థితి. దాంతో ఇప్పుడతను సోషల్ మీడియా జనసైనికులకు గట్టిగానే ట్రోల్ అవుతున్నారు.
ఇక ఇప్పుడు దువ్వాడ కొత్త డ్రామాకి తెరలేపాడు. అప్పట్లో కూటమి నేతలపై చేసిన అనుచిత వ్యాఖ్యలకు సంబంధించి భయపడుతున్నాడో లేకపోతే ఫ్యామిలీ రచ్చతో కంగారు పడుతున్నాడో కాని తన దగ్గర తుపాకీ ఉందని.. దానికి లైసెన్స్ ఇవ్వాలని కోరుతూ ఎస్పీ దరఖాస్తు చేసుకున్నారు. ఆయనకు కొంత మంది వ్యక్తుల నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయంట.. అలాగే కొంత మంది ఆయన ఇంటి వద్ద అనుమానంగా రెక్కీ నిర్వహిస్తున్నారంట. ఇదే విషయమై జులైలో కూడా టెక్కలి పోలీసులకు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ ఫిర్యాదు చేశాడు. నిందితులెవరో తెలియదంటూనే వారి నుంచి తనకు ప్రాణహాని ఉందని తనకు ఫోర్ ప్లస్ ఫోర్ గన్‌మెన్‌ను కేటాయించాలని ప్రభుత్వానికి కూడా లెటర్ రాశాడు. మొత్తానికి అలా సాగిపోతోంది వైసీపీ ఎమ్మెల్సీ దువ్వాడ లైఫ్ స్టైల్.