Pak Fan Challenge On IND VS NZ: టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ మధ్య జరిగిన వన్డే సిరీస్ నిన్నటితో విజయ వంతంగా ముగిసింది. ఆదివారం జరిగిన ఐదో వన్డేలో న్యూజిలాండ్ జట్టును 22 పరుగులతో ఓడించిన టీమిండియా, 3-1 తేడాతో సిరీస్ కైవసం చేసుకుంది. ఈ తరుణంలోనే పాకిస్తాన్ స్పోర్ట్స్ అనలిస్ట్, అభిమాని వకార్ ఆజం సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టీమిండియా వన్డే సిరీస్ గెలిచిన తరుణంలో గుండు గీయించుకున్నాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో వీడియో కూడా పెట్టాడు.
టీమిండియా వన్డే సిరీస్ ఓడిపోతుందని మొదటి మ్యాచ్ సందర్భంగా వకార్ ఆజం ఛాలెంజ్ చేశాడు. ఒకవేళ టీమిండియా సిరీస్ గెలిస్తే, గుండు గీయించుకుంటానని వకార్ ఆజం సవాల్ చేశాడు. అతని అంచనాలు తారుమారు చేసిన టీమిండియా సిరీస్ గెలిచింది. దీంతో ముందుగా చెప్పినట్టుగానే గుండు గీయించుకున్న పాక్ అభిమాని వకార్ ఆజం..సోషల్ మీడియాలో వీడియో కూడా పెట్టి అందరికీ షాక్ ఇచ్చాడు. దీంతో ఈ వీడియో వైరల్ గా మారింది. ఇది చూసిన క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. వీడు అన్నంత పని చేసేశాడేంటి ? అంటూ వాపోతున్నారు.
టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్ వన్డే సిరీస్ నేపథ్యంలో తాను ఛాలెంజ్ ఓడిపోయానని పేర్కొన్న వకార్ ఆజం… కీలక వ్యాఖ్యలు చేశాడు. కివీస్ గడ్డపై టీమిండియా రాణించడం కష్టమేనని తాను భావించినట్టు పేర్కొన్నాడు. ఫ్లాట్ పిచ్ లపైనే రెచ్చిపోయే టీమిండియా ప్లేయర్లు… కివీస్ గడ్డపై ఇరగదీశారని మెచ్చుకున్నాడు. కోహ్లీ, రోహిత్ శర్మ లాంటి సీనియర్లు విఫలమైనప్పటికీ… టీమిండియా బౌలర్లు ఐదో వన్డేను గెలిపించినట్టు చెప్పుకొచ్చాడు. ఈ సిరీస్ లో బ్యాటర్ల కంటే, భారత బౌలర్లే అదరగొట్టినట్టు పేర్కొన్నాడు.
ఇక ఛాలెంజ్ ప్రకారం, తాను గుండు గీయించుకున్నానని తెలిపాడు. వకార్ ఆజం చేసిన ఈ పనిపై ఇండియన్ ఫ్యాన్స్ మెచ్చుకుంటున్నారు. ఛాలెంజ్ ప్రకారం మాట మీద నిలబడి గుండు గీయించుకోవడం గొప్ప విషయమని తెలిపాడు. ఇలాంటి వ్యక్తులు దొరకబోరని వెల్లడించాడు. కానీ తన్వీర్ అహ్మద్ లాంటి వాళ్లు ఇలాంటి ఛాలెంజ్ లు చాలా విసిరారని, ఓడిపోయినా మాట మీద నిలబడలేదంటూ కౌంటర్లు ఇస్తున్నారు.