AP Students: ఏపీలో విద్యార్థులకు తీపి కబురు. విద్యా సంస్థలకు శుక్రవారం నుంచి వరుసగా మూడు రోజులు సెలవులు వచ్చాయి. దీంతో విద్యార్థుల పేరెంట్స్ టూర్లకు ప్లాన్ చేస్తున్నారు. దీంతో విద్యార్థుల్లో అంతా ఇంతా ఆనందం కాదు.
ఆగష్టు 8న శుక్రవారం నుంచి ఆదివారం వరకు వరసగా పాఠశాలలకు సెలవులు వచ్చేశాయి. ఆగస్టు 8న శ్రావణ శుక్రవారం (ఈనెలలో అందరూ ఈ వారంలో పూజలు చేస్తున్నారు), 9న రాఖీ పౌర్ణమి కావడంతో ఆ రోజు సెలవు ఇవ్వరు. కాకపోతే రెండో శనివారం కూడా కలిసొచ్చింది. 10న ఆదివారం నార్మల్‌గా సెలవు ఉంటుంది.
ఈ సెలవుతో చూసుకుంటే ఆగష్టులో ఏకంగా 10 రోజుల పాటు సెలవులు వచ్చాయి. ఈ మూడు రోజులు పాఠశాలలు, కాలేజీలు, ఇతర విద్యాసంస్థలు మూతపడనున్నాయి. వరుసగా విద్యార్థులకు సెలవులు రావడంతో రైళ్లు, బస్సు ప్రయాణాల్లో రద్దీ కనిపించడం ఖాయం. ఆగష్టు సెకండ్ వీక్ వరసగా మూడు సెలవులు.
ఆగష్టు 15న శుక్రవారం స్వాతంత్ర దినోత్సవం కావడంతో ఆ రోజు సెలవు ఉంటుంది. 16న శ్రీకృష్ణాష్టమి రోజు ఉంటే సెలవు లేకుంటే పాఠశాల ఓపెన్ ఉంటుంది. 17న ఆదివారం కావడంతో సెలవు ఇచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఈ లెక్కన మూడో వారంలోనూ వరుసగా సెలవులు రానున్నాయి.
ALSO READ: బిగ్ అలర్ట్.. రెండురోజులపాటు భారీ వర్ష సూచన
ఏపీ ప్రభుత్వం విడుదల చేసిన ఇయర్ క్యాలెండర్‌లో మొత్తం 44 రోజులు సెలవులు ఉంటాయని పేర్కొంది. ఇందులో సాధారణ సెలవులు 23 ఉన్నాయి. ఇక ఆప్షనల్ సెలవులు 21 రోజులు ఉన్నాయి. సెప్టెంబర్ నుండి డిసెంబర్ వరకు సెలవులు బాగానే ఉన్నాయి. సెప్టెంబర్ 5న శుక్రవారం ఈద్ మిలాదున్ నబీ పండుగ కారణంగా సెలవు.
సెప్టెంబర్ 30న మంగళవారం దుర్గాష్టమి రానుంది. అక్టోబర్ 2న గురువారం నాడు మహాత్మా గాంధీ జయంతి-విజయ దశమి ఒకే రోజు రావడంతో సెలవు కచ్చితంగా ఉంటుంది. అక్టోబర్ 20న అనగా సోమవారం దీపావళి ఫెస్టివల్ వచ్చింది. డిసెంబర్ 25న గురువారం క్రిస్మస్ కావడంతో ఆరోజు సెలవు ఉంది.
ఈ విధంగా చూస్తుంటే కొన్ని ఆప్షనల్ సెలవులు వచ్చాయి. ఇవికాకుండా సెప్టెంబర్ 21న మహాలయ అమావాస్య, నవంబర్ 11న కార్తీక పౌర్ణమి, డిసెంబర్ 26న బాక్సింగ్ డే సెలవులు లేకపోలేదు. ప్రభుత్వం ఇయర్ క్యాలెండర్ విడుదల చేయడంతో వరుసగా మూడురోజులు సెలవులు ఉంటే టూర్లకు ప్లాన్ చేస్తున్నారు పేరెంట్స్.