BigTV English

Srikalahasti Crime: ఎంత కష్టం వచ్చిందో.. త్రాడు తెచ్చుకొని.. ఆర్టీసీ బస్సెక్కి మరీ.. యువకుడు ఆత్మహత్య

Srikalahasti Crime: ఎంత కష్టం వచ్చిందో.. త్రాడు తెచ్చుకొని.. ఆర్టీసీ బస్సెక్కి మరీ.. యువకుడు ఆత్మహత్య

Srikalahasti Crime: ఏ కష్టం వచ్చిందో కానీ ఆ యువకుడు ఏ విధంగా ఆర్టీసీ బస్సు ఎక్కి మరి ఆత్మహత్యకు పాల్పడ్డాడు ఈ విషాదకర ఘటన శ్రీకాంత్ శ్రీకాళహస్తి పరిధిలో చోటుచేసుకోగా, ఆర్టీసీ ప్రయాణికులు సైతం షాక్కు గురయ్యారు. అసలేం జరిగిందంటే


శ్రీకాళహస్తి కి వెళ్లే ఆర్టీసీ బస్సులోకి మేరపాక స్టేజి వద్ద ఓ యువకుడు ఎక్కాడు. అనంతరం కండక్టర్ వద్ద టికెట్ కొనుగోలు చేసి బస్సులో కొద్దిసేపు నిలబడి ఉన్నాడు. ప్రయాణికులు ముందు కూర్చుని ఉండగా వెనుక వైపుకు వెళ్లి ఒక్కడే కూర్చున్నారని స్థానికులు తెలుపుతున్నారు. మరి కొద్ది క్షణాల్లోనే తనతోపాటు తెచ్చుకున్న త్రాడును కట్టుకొని అక్కడే ఆత్మహత్యకు యువకుడు యత్నించి మృతి చెందినట్లు బస్సులోని ప్రయాణికులు తెలిపారు.

సాధారణంగా ఆత్మహత్యలకు పాల్పడేవారు రైలు పట్టాలు, వాహనాల కిందికి దూసుకు వెళ్లడం, పురుగుల మందు త్రాగడం వంటి చర్యలకు పాల్పడుతుంటారు. కానీ ఈ యువకుడు ఏకంగా ఆర్టీసీ బస్సు ఎక్కి ఆత్మహత్యకు పాల్పడడం సంచలనంగా మారింది. ఆర్టీసీ బస్సులో యువకుడు మృతి చెందడంతో బస్సు డ్రైవర్, కండక్టర్ బస్సును అక్కడికక్కడే నిలిపివేశారు. చివరికి అతడు ఆత్మహత్యకు పాల్పడ్డ ఉరితాడు కనిపించగా, ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లు భావిస్తున్నారు.


ఆర్టీసీ డ్రైవర్ ఇచ్చిన సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. అసలు ఆర్టీసీ బస్సులోకి ఎక్కి ఆత్మహత్యకు పాల్పడేందుకు గల కారణాలను సైతం పోలీసులు విశ్లేషిస్తున్నారు. అసలు ఆత్మహత్య చేసుకున్నాడా.. కారణాలు ఏమిటి.. ఈ యువకుడు ఎవడు అనే కోణంలో పోలీసుల దర్యాప్తు సాగుతోంది. ఏది ఏమైనా ఆర్టీసీ బస్సులో యువకుడు ఆత్మహత్య యత్నించి కన్నుమూయడంతో శ్రీకాళహస్తి లో ఈ విషయం వైరల్ గా మారింది. అలాగే బస్సు నిలిపి ఉన్న క్రమంలో ఎవరూ లేని సమయంలో యువకుడు ఆత్మహత్యకు యత్నించినట్లు కూడా ప్రచారం సాగుతోంది.

Also Read: Sharmila vs Jagan: ఆ ఒక్కటి అడక్కు అంటున్న వైసీపీ నేతలు.. మీడియా కనిపిస్తే దూరం దూరం అనేస్తున్నారట..

ఇటీవల ఆత్మహత్యలు రోజుకు ఎక్కడో ఒక చోట వినిపిస్తున్నాయి. కొందరు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటే, మరికొందరు లవ్ ఫెయిల్యూర్, కుటుంబ సమస్యలు అంటూ ఆత్మహత్యలకు యత్నిస్తుండగా, ఇటువంటి వారిని ముందే గుర్తించి తమకు సమాచారం అందిస్తే, మానసిక వైద్య నిపుణుల ద్వారా వారిలో మార్పుకు ప్రయత్నిస్తామని పోలీసులు తెలుపుతున్నారు.

Related News

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Big Stories

×