Game changer : గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ప్రస్తుతం గేమ్ చేంజర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నాడు. ఆ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 10 న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. విడుదల తేదీ దగ్గర పడుతుండటంతో సినిమాను జెట్ స్పీడులో జనాల్లోకి తీసుకొని వెళ్లేందుకు మూవీ మేకర్స్ ఒక్కో అప్డేట్ ను వదులుతున్నారు. మొన్నీమధ్య వచ్చిన సెకండ్ సింగిల్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. తాజాగా మూడో పాటను త్వరలో రిలీజ్ చేసేందుకు ముహూర్తం ఫిక్స్ చేశారు. తాజాగా ఈ మూవీ నుంచి ఒక పోస్టర్ ను రిలీజ్ చేశారు. ఆ పోస్టర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతుంది.
రామ్ చరణ్, కియారా అద్వానీలపై మూడో పాట తీశారు. పర్పుల్ కలర్ డ్రెస్ ధరించిన వీరిద్దరు అదిరిపోయే స్టిల్‌తో మెస్మరైజ్ చేస్తున్నారు. ప్రజెంట్ ఈ పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుండగా.. ఇక అది చూసిన మెగా ఫ్యాన్స్ ఫుల్ జోష్‌లో ఉన్నారు. ఈ పాట కోసం 15 కోట్ల రూపాయల ఖర్చు చేసినట్లు సమాచారం. న్యూజిలాండ్ దేశంలోనే అందమైన లొకేషన్లలో బాస్కో సీజర్ నృత్య దర్శకత్వంలో ఈ పాటను తీసినట్లు యూనిట్ వర్గాల ద్వారా తెలిసింది.. ఈ సాంగ్ సంబందించిన పోస్టర్ వైరల్ అవుతుండటంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ సాంగ్ కోసం వెయిట్ చేస్తున్నారు.
ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రెండు పాటలు విడుదలయ్యాయి. ‘జరగండి జరగండి…’ పాటను మొదట విడుదల చేశారు. నిజం చెప్పాలంటే… సాంగ్ రిలీజ్ కంటే ముందు సోషల్ మీడియాలో, నెట్టింట లీక్ అయ్యింది. ఆ తర్వాత ఒరిజినల్ వెర్షన్ విడుదల చేయక తప్పలేదు. మొదట నెగిటివ్ ఫీడ్ బ్యాక్ కొంత వచ్చినా… ఆ తర్వాత వైరల్ హిట్ అయ్యింది. ఆ తర్వాత హీరో ఇంట్రడక్షన్ సాంగ్ ‘రా మచ్చా…’ విడుదల చేశారు. నవంబర్ 28న మూడో పాటను విడుదల చేయనున్నట్లు తెలిపారు.. ఈ సాంగ్ రొమాంటిక్ సాంగ్ అని పోస్టర్ ను చూస్తే తెలుస్తుంది. శంకర్ దర్శకత్వం వహించిన ‘గేమ్ చేంజర్’ చిత్రాన్ని శ్రీమతి అనిత సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ జి స్టూడియోస్ దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించాయి. దిల్ రాజు ఆయన సోదరుడు శిరీష్ నిర్మాతలు. తమిళంలో ఈ చిత్రాన్ని దిల్ రాజుతో కలిసి ఆదిత్య రామ మూవీస్, హిందీలో ఏఏ ఫిలిమ్స్ అనిల్ తడానీ విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం సినిమాపై ఉన్న భారీ అంచనాలతో రాబోతుంది.
Third single from #GameChanger coming your way on Nov 28th 😊💜@shankarshanmugh @advani_kiara @MusicThaman @SVC_official @ZeeStudios_ @saregamaglobal pic.twitter.com/AfMJMXxRJe
— Ram Charan (@AlwaysRamCharan) November 24, 2024
ఈ సినిమా తర్వాత ఉప్పెన ఫేమ్ డైరెక్టర్ బుచ్చిబాబుతో ఒక సినిమా చెయ్యనున్నాడు. ఆ సినిమా త్వరలోనే సెట్స్ మీదకు వెళ్లనుంది. ఈ సినిమా వచ్చే ఏడాది విడుదల కాబోతుంది. ఇక దీని తర్వాత రంగస్థలం 2 సినిమా సుకుమార్ దర్శకత్వంలో రాబోతుంది. ఈ సినిమా తర్వాత హాలివుడ్ లో ఓ మూవీ చెయ్యనున్నాడని సమాచారం.