RC 17 – Sai Pallavi :మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ (Ram Charan)ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నారు. చివరిగా రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో వచ్చిన ఆర్ఆర్ఆర్(RRR)సినిమాతో భారీ పాపులారిటీ అందుకున్నారు రామ్ చరణ్. అంతేకాదు ఈ సినిమాతో ఏకంగా గ్లోబల్ స్టార్ అయిపోయారు. ఈ సినిమా తీసుకొచ్చిన పాపులారిటీతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఈయనకు.. టుస్సాడ్స్ మ్యూజియంలో మైనపు విగ్రహాన్ని తన పెట్ డాగ్ రైమ్ తో సహా ప్రతిష్టించనున్నారు. ఇదిలా ఉండగా ప్రస్తుతం శంకర్ (Shankar) దర్శకత్వంలో గేమ్ ఛేంజర్( Game changer)సినిమాను విడుదలకు సిద్ధంగా ఉంచారు.
గేమ్ ఛేంజర్ పూర్తయిన వెంటనే ఆర్ సీ 16 మొదలు..
డిసెంబర్ 21న అమెరికాలో ఘనంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించనుండగా.. వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 10వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదల చేయబోతున్నారు. ఈ క్రమంలోనే రామ్ చరణ్ తదుపరి చిత్రాలకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇదివరకే RC 16 అనే వర్కింగ్ టైటిల్ తో బుచ్చిబాబు సనా (Bucchibabu Sana) దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇకపోతే RC 16 సినిమాలో హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ అందాల తార జాన్వీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్ గా ఎంపిక అయింది. అంతేకాదు పూజా కార్యక్రమాలు కూడా ఘనంగా పూర్తయ్యాయి. ఇప్పటికే కేరళలోని కొన్ని ప్రాంతాలలో.. సినిమాలోని కీలక సన్నివేశాలను రామ్ చరణ్ లేకుండానే బుచ్చి బాబు చిత్రీకరించినట్లు సమాచారం
RC 17 మూవీ నుంచి ఇంట్రెస్టింగ్ అప్డేట్..
ఇదిలా ఉండగా మరోవైపు RC 17 కి సంబంధించిన పలు విషయాలు నెట్టింట వైరల్ గా మారుతున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో లేడీ పవర్ స్టార్ గా, క్వీన్ అఫ్ ది బాక్స్ ఆఫీస్ గా గుర్తింపు తెచ్చుకున్న సాయి పల్లవి (Sai Pallavi)నటిస్తున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు ఏంటో ఇప్పుడు చూద్దాం. ‘రంగస్థలం’ సినిమాతో సెన్సేషన్ క్రియేట్ చేశారు డైరెక్టర్ సుకుమార్(Sukumar ) హీరో రామ్ చరణ్. ఇప్పుడు ఈ కాంబినేషన్ పాన్ ఇండియా రేంజ్ లో బాక్స్ ఆఫీస్ ను షేక్ చేయడానికి సిద్ధం అయిపోతున్నారు.ప్రస్తుతం అల్లు అర్జున్ (Allu Arjun) హీరోగా పుష్ప -2 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు సుకుమార్. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన వెంటనే.. సుకుమార్ తన కుటుంబానికి సమయం కేటాయించబోతున్నారట. ఇక కొంత విశ్రాంతి తీసుకున్న వెంటనే రాంచరణ్ తో సినిమా పట్టాలెక్కించబోతున్నారు
RC 17 లో సాయి పల్లవి..
ఈలోపు రామ్ చరణ్ బుచ్చిబాబు సనా దర్శకత్వంలో వస్తున్న RC16 షూటింగ్ పూర్తి చేయనున్నారు. ఇప్పటికే అధికారికంగా RC 17 ను ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడప్పుడే ఈ సినిమా నుంచి అప్డేట్స్ వచ్చే అవకాశం కనిపించడం లేదు. కానీ సుకుమార్ పుష్ప -2 ప్రమోషన్స్ లో ఆర్ సి 17 గురించి అప్డేట్ ఇచ్చే అవకాశం కనిపిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోని ఈ సినిమా నుంచి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఆర్సి 17 హీరోయిన్ గా సాయి పల్లవిని పరిశీలిస్తున్నట్లు సమాచారం. మరోవైపు ‘అమరన్’ సక్సెస్ తో ఫుల్ జోష్లో ఉంది ఈ ముద్దుగుమ్మ.. అలాగే త్వరలో నాగచైతన్య (Naga Chaitanya)నటించిన ‘తండేల్’ సినిమాతో మళ్లీ ప్రేక్షకులను అలరించడానికి సిద్ధమయ్యింది.
సుకుమార్ ప్లాన్ వర్క్ అవుట్ అయ్యేనా..
ఇకపోతే ఏ పాత్ర పడితే ఆ పాత్ర చేయడానికి సిద్ధంగా లేదు ఈ ముద్దుగుమ్మ, కానీ RC 17 సినిమాలో హీరోయిన్ పాత్ర కీలకంగా ఉండబోతుందని , అందుకే ఈ సినిమాలో ఆ పాత్ర కోసం ఈమెను తీసుకోవాలని సుకుమార్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం. మరి సుకుమార్ ప్లాన్ వర్కౌట్ అయితే తెరపై ఫ్రెష్ కాంబో ప్రేక్షకులను అలరించనుంది అని చెప్పవచ్చు.