Supreme Court : ఏపీ రాజధాని అమరావతికి సంబంధించిన కేసుల విచారణను సుప్రీంకోర్టు ఏప్రిల్‌కు వాయిదా వేసింది. ఆ నెలలోని నాన్ మిస్‌లేనియస్ డేలో వాదనలు వింటామని న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం స్పష్టం చేసింది. ఏపీ రాజధానిగా అమరావతినే కొనసాగించాలంటూ రాష్ట్ర హైకోర్టు 2022 మార్చిలో తీర్పు వెలువరించింది. మాస్టర్ ప్లాన్ ప్రకారం చేయాల్సిన పనులపై కాలపరిమితి విధిస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఉన్నత న్యాయస్థానం తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

దీనిపై పలుమార్లు వాదనలు జరిగాయి. ఈ క్రమంలోనే ఏపీ హైకోర్టు విధించిన కొన్ని గడువులపై జస్టిస్ కేఎల్ జోసెఫ్ నేతృత్వంలోని ధర్మాసనం స్టే విధించింది. అయితే అమరావతే రాజధాని అనే విషయంపై స్టే ఇవ్వలేదు. తాజాగా బుధవారం జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ దీపాంకర్ దత్తా ధర్మాసనం ముందు కేసు విచారణకు వచ్చింది.
సీనియర్ లాయర్ ముకుల్ రోహత్గీ ఏపీ సర్కార్ తరఫున వాదనలు వినిపించారు. మూడు రాజధానుల చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఉపసంహరించుకుందన్నారు. దానిపై తీర్పు నిరర్ధకమని ఆయన వాదించారు. ఆ వాదనలను రాజధాని ప్రాంత రైతుల తరఫున సీనియర్ న్యాయవాది దేవదత్ కామత్ తోసిపుచ్చారు. హైకోర్టు ఇచ్చిన తీర్పు నిరర్ధకమేమీ కాదన్నారు. ఒరిజినల్ మాస్టర్ ప్లాన్ ప్రకారం ఎలా అభివృద్ధి చేయాలో చెబుతూ ఉన్నత న్యాయస్థానం కాలపరిమితి విధించిందని ధర్మాసనం దృష్టికి దేవదత్ కామత్ తీసుకొచ్చారు.
ఇరుపక్షాల వాదనలు విన్న జస్టిస్ సంజీవ్ ఖన్నా.. తదుపరి విచారణను ఏప్రిల్‌లో చేపడతామన్నారు. అంతకంటే ముందే విచారించాలని.. లేదంటే ఏప్రిల్‌లో విచారించే వారాన్ని అయినా చెప్పాలని ఏపీ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోరారు. సుప్రీంకోర్టు న్యాయమూర్తి తోసిపుచ్చారు.