BigTV English

Dunki | డంకీ కోసం ఒక్కొక్కరు రూ.80 లక్షలు చెల్లించడానికి రెడీ.. జాక్ పాట్ కొడుతున్న ఏజెంట్లు!

Dunki | డంకీ అంటే అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా లాంటి దేశాల్లో దొంగచాటుగా ప్రవేశించడం. ఈ దేశాలన్నీ ధనిక దేశాలు. అక్కడ ఏ చిన్న ఉద్యోగం చేసినా లక్షలు సంపాదించుకోవచ్చు. డంకీ అనే పదం గుజరాత్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యంలో ఉంది. దీనిపైనే తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ డంకీ అనే సినిమా తీశాడు.

Dunki | డంకీ కోసం ఒక్కొక్కరు రూ.80 లక్షలు చెల్లించడానికి రెడీ.. జాక్ పాట్ కొడుతున్న ఏజెంట్లు!

Dunki | డంకీ అంటే అమెరికా, ఇంగ్లాండ్, జర్మనీ, ఫ్రాన్స్, కెనడా లాంటి దేశాల్లో దొంగచాటుగా ప్రవేశించడం. ఈ దేశాలన్నీ ధనిక దేశాలు. అక్కడ ఏ చిన్న ఉద్యోగం చేసినా లక్షలు సంపాదించుకోవచ్చు. డంకీ అనే పదం గుజరాత్, పంజాబ్, హర్యానా, ఢిల్లీ లాంటి రాష్ట్రాల్లో బాగా ప్రాచుర్యంలో ఉంది. దేశాలు దాటించే ఈ అక్రమ రవాణాపైనే తాజాగా బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ డంకీ అనే సినిమా తీశాడు.


చాలా మంది భారతీయులు ధనిక ఫారిన్ దేశాలకు వెళ్లి ఉద్యోగం చేసుకొని బాగా డబ్బు సంపాదించాలనుకుంటారు. కానీ అక్కడికి వెళ్లాలంటే వీసా, ఇంగ్లీషు పరీక్షలు, ఇతర ప్రక్రియలు తప్పనిసరిగా పూర్తి చేయాలి. కానీ కొందరు ఈ ప్రక్రియ పూర్తిచేయలేక.. దొడ్డిదారిన ఈ ఫారిన్ దేశాలలో ప్రవేశిస్తారు. అయితే ఇది కూడా అనుకున్నంత సులువు కాదు. ఒక్క ఇంగ్లండ్ చేరుకోవడానికే భారత్ నుంచి పాకిస్తాన్, ఆ తరువాత ఆఫ్ఘనిస్తాన్, ఇరాన్, టర్కీ మీదుగా లండన్ చేరుస్తారు. వెళ్లే దారిలో అడవులు, నదులు కాలినడకన కూడా దాటాల్సి వస్తుంది. ఈ కఠిన ప్రయాణంలో ప్రతి ఏడాది ఎంతో మంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు.

దేశాల సరిహద్దులు దాటించడానికి ముందుగా అక్రమ మానవ రవాణా ఏజెంట్లుంటారు. వారు ఒక మనిషిని అక్రమ మార్గంలో అమెరికా పంపించడానికి లక్షల్లో డబ్బు తీసుకుంటారు. ఈ ఏజెంట్లకు పలు దేశాలలో నెట్‌వర్క్ ఉంటుంది.
డంకీ ద్వారా విదేశాలు వెళ్లడానికి గుజరాత్, పంజాబ్ లాంటి రాష్ట్రాలనుంచి అత్యధికంగా ప్రయత్నిస్తున్నారు. దీని కోసం ఉన్న ఇళ్లు, ఆస్తులు అమ్మేసి.. భారీగా అప్పు చేసి మరీ ఏజెంట్లకు డబ్బులిస్తున్నారు.


తాజాగా డంకీ మార్గంలో అమెరికా వెళ్లడానికి ఏజెంట్లు ఒక్కో మనిషికి రూ.60 లక్షల నుంచి రూ.80 లక్షల వరకు తీసుకుంటున్నారు. గుజరాత్‌లో ఈ దందా జోరుగా సాగుతోంది. ఇటీవల ఇండియా నుంచి దుబాయ్, నికరాగువా బయలుదేరిన ఒక విమానం వారం రోజుల పాటు ఫ్రాన్స్ దేశంలో నిలిచిపోయింది. ఈ విమానంలో 260 మంది భారతీయలున్నారు. వీరిలో గుజరాత్‌కు చెందిన వారే 60 మంది ఉన్నారు. ఈ విమానం డిసెంబర్ 26న భారత్‌కు తిరిగివచ్చింది.

విమానంలోని గుజరాతీలను విచారణ చేయగా.. వారు చెప్పింది విని పోలీసులు షాకయ్యారు. నికరాగువా మీదుగా అమెరికాలో అక్రమంగా చేయవేయడానికి స్థానిక ఏజెంట్లకు ఒక్కో గుజరాతీ రూ.60 నుంచి 80 లక్షల వరకు ఈ గుజరాతీలు చెల్లించినట్లు తేలింది. ఈ గుజరాతీలంతా 8 వ తరగతి నుంచి 12 తరగతి వరకు మాత్రమే చదువుకున్నారు.

ఒక అమెరికా నివేదిక ప్రకారం.. 2023లో నికరాగువా నుంచి అక్రమంగా అమెరికాల ప్రవేశించడానికి 96,917 మంది భారతీయులు ప్రయత్నించారు.

Dunki, Gujarathi, illegal migration, America, ShahRukh Khan, USA, Punjab, Canada, London,

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×