Suspect Released in CM Jagan Stone Attack Case: ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పై జరిగిన రాయిదాడి కేసులో.. పోలీసులు అనుమానితుడిగా భావిస్తూ అదుపుపలోకి తీసుకున్న దుర్గారావును విడిచిపెట్టారు. ఈ కేసుకు, దుర్గారావుకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్న పోలీసులు గల అర్థరాత్రి దుర్గారావును అతని ఇంటివద్ద విడిచి వెళ్లారు. దుర్గారావు నాలుగు రోజులుగా కనిపించకపోవడంతో.. ఆయన ఎక్కడున్నాడో చెప్పాలని అతని భార్య పోలీస్ ఉన్నతాధికారులను వేడుకున్నా ఫలితం కనిపించలేదు. దాంతో లాయర్ సలీం.. హై కోర్టులో సోమవారం హెబియస్ కార్పస్ పిటిషన్ దాఖలు చేయాలని భావించారు.
ఇంతలో.. శనివారం ఉదయం దుర్గారావు కుటుంబ సభ్యులు.. విజయవాడ పోలీస్ కమిషనర్ ఆఫీస్ ఎదుట ఆందోళనకు దిగారు. ఆయన ఆచూకీ చెప్పాలంటూ.. భార్య శాంతి కంటతడి పెట్టుకోగా.. వారందరినీ ఆ ప్రాంతం నుంచి పంపించేశారు. శనివారం రాత్రికి 160 CRPC నోటీసులు ఇచ్చి.. అవసరమైతే మళ్లీ విచారణకు పిలుస్తామని చెప్పి సంతకాలు తీసుకుని దుర్గారావును వదిలిపెట్టారు.
Also Read: సీఎం జగన్ పైకి రాయి.. ఎడమ కంటికి గాయం
ఈ కేసులో అజిత్ సింగ్ నగర్ కు చెందిన సతీశ్ ను ఏ1 గా చేర్చిన విషయం తెలిసిందే. మైనరైన సతీశ్ కు ఈ కేసుతో సంబంధం లేదని అతని తల్లిదండ్రులు వాపోయారు. సతీశ్ రిమాండ్ రిపోర్టులో మరో వ్యక్తి చెప్పినందునే చేశానని చెప్పినట్లు ఉండటంతో.. ఏ2 గా దుర్గారావును అనుమానించారు. అందులో భాగంగానే దుర్గారావును నాలుగురోజుల క్రితం అదుపులోకి తీసుకున్నారు. సతీశ్ ఎవరో తనకు తెలీయదని దుర్గారావు ఒకే సమాధానం చెప్పడంతో.. అతడిని నిర్దోషిగా భావించి వదిలిపెట్టారని కుటుంబ సభ్యులు తెలిపారు.