Shabari Producer Mahendra About Varalaxmi Sarathkumar: మలయాళ స్టార్ హీరో శరత్ కుమార్ కూతురిగా ఇండస్ట్రీలో అడుగుపెట్టిన వరలక్ష్మి శరత్‌కుమార్ నటిగా తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకుంది. ముఖ్యంగా టాలీవుడ్‌లో నెగిటివ్ రోల్‌లో నటిస్తూ ప్రేక్షకాభిమానుల్ని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అందం, నటనతో అందరి మనస్సులు దోచుకుంది.
ప్రస్తుతం మార్కెట్‌లో మంచి డిమాండ్ ఉన్న నటీమణులలో వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. అయితే ఆమె నెగిటివ్ రోల్స్‌తో పాటు లేడీ ఓరియంటెడ్ మూవీలను కూడా చేస్తూ తన అభిమానుల్ని అలరిస్తుంది. ఇందులో భాగంగానే ఇప్పుడు మరో లేడీ ఓరియెంటెడ్ సినిమా చేస్తుంది. అనిల్ కాట్జ్ దర్శకతంలో ‘శబరి’ మూవీలో లీడ్ రోల్‌లో నటిస్తోంది.
మహేంద్రనాథ్ కూండ్ల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక అన్ని పనులు పూర్తి చేసుకున్న ఈ సినిమా ఇప్పుడు రిలీజ్‌కు సిద్ధమైంది. తెలుగు, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఈ మూవీ మే 3న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో నిర్మాత మీడియాతో కాసేపు ముచ్చటించారు.
ఈ సినిమా గురించి ఆయన మాట్లాడుతూ.. నటి వరలక్ష్మీ శరత్ కుమార్‌పై ప్రశంసలు కురిపించాడు. ‘శబరి’ సినిమా చేయడానికి ముఖ్య కారణం వరలక్ష్మి శరత్ కుమార్ అని అన్నారు. ఈ మూవీ స్టోరీని ముందుగా ఆమె విన్నారని.. ఆమె విన్నాక ఓకే చేశారని.. ఇక ఆమె ఓకే చేశారంటే సినిమా బాగానే ఉంటుందనే నమ్మకంతో ఈ సినిమా చేశానని నిర్మాత చెప్పుకొచ్చాడు.
Also Read: రజినీకాంత్ – లోకేష్ మూవీలో టాలీవుడ్ బడా హీరో..!
వరలక్ష్మి చాలా మంచి ఆర్టిస్ట్ అని తెలిపాడు. ముఖ్యంగా నిర్మాతలకు ఆమె చేసే మేలు ఎవ్వరికీ తెలియదని చెప్పాడు. ఎందుకంటే ఆవిడ దీనికి ఇంత మొత్తంలో ఖర్చు చేయండని ఎప్పుడూ అనలేదని.. బడ్జెట్ కూడా పెంచమని చెప్పలేదని అన్నాడు. అంతేకాకుండా సినిమాకి ఎక్కువ ఖర్చు అవుతుంటే.. ఎందుకు ఇంత మొత్తంలో ఖర్చు చేస్తున్నారు.. వద్దని చెప్పారని తెలిపాడు.
అంతేకాకుండా ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా మనం చేద్దామని ఆమె చెప్పారట. దీంతో వారిద్దరి మధ్య మరింత స్నేహబంధం ఏర్పడిందని అతడు చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈ మూవీలో తల్లి కూతుళ్ల సెంటెమెంట్ చాలా బాగుంటుందని తెలిపాడు. ఇందులో ఎమోషన్స్ ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతాయని చెప్పుకొచ్చాడు.