Yash Toxic:రాకింగ్ స్టార్ యష్ హీరోగా గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో వచ్చిన టాక్సిక్ బాక్సాఫీస్ వద్ద డివైడ్ టాక్ ని మూట గట్టుకున్న సంగతి తెల్సిందే. అయితే ఏ సినిమా కైనా పడే కష్టం మాత్రం ఒకేలానే ఉంటుందని స్పెషల్ గా చెప్పక్కర్లేదు.ఇదిగో తాజగా నెట్టింట చక్కర్లు కొడుతున్న ఈ వీడియో చూస్తుంటే ఆ విషయం మరోసారి ప్రూవ్ అవుతుంది.
ఈ సినిమాకోసం యష్ నాలుగేళ్ళపాటు కష్టపడ్డాడని తరచూ మనకి వినిపిస్తున్న మాటే.ఇదిగో ఇపుడు టాక్సిక్ సినిమా తెరపై పడగానే కథాకథనాలు ఎలా ఉన్నా యష్ ఇందులో పోషించిన రాయ పాత్రం యష్ ట్రాన్స్ ఫామ్ అయిన విధానం చూసి మెస్మరైజ్ అయిపోయారు ఆడియన్స్. ఇదిగో ఇపుడు ఇదే విషయాన్ని సినిమాకి పని చేసిన హాలీవుడ్ స్టంట్ మాస్టర్ వివరిస్తూ “ది హార్డ్‌వర్క్ అండ్ డెడికేషన్ లుక్స్ క్లియర్ ఆన్ స్క్రీన్”అంటూ చెప్పిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
నిజానికి సినిమా బాక్సాఫీస్ వద్ద అనుకున్నంత రిజల్ట్ రాబట్టలేకపోయిందనే చెప్పాలి. కాని సినిమా కోసం యష్ పడ్డ కష్టాన్ని మాత్రం మెచ్చుకోకుండా ఉండలేము.ముఖ్యంగా సినిమాలో ఈ యాక్షన్ సీక్వెన్స్ లో యష్ స్వాగ్ టాప్ నాచ్.ఇక ఇదే వీడియోలో సినిమా కోసం kvn బడ్జెట్ కి ఎక్కడా వెనకడుగు వేయకుండా ఖర్చు పెట్టడం మనం చూస్తాం కూడా.
మొత్తానికి kgf 2 సక్సెస్ తర్వాత ఈజీగా రెండు సినిమాలు చేసేసి వందల కోట్లు వెనకేసుకునే అవకాశం ఉన్నప్పటికీ యష్ ఆడియన్స్ కి ఒక సరికొత్త అనుభూతి ఇవ్వాలని ఇలా డిఫరెంట్ అటెంప్ట్ ని చేయడం మెచ్చుకోతగ్గ విషయమే కాని కంటెంట్ పై ఇంకాస్త ఫోకస్ గా ఉంది ఉంటే kgfలా ఈ సినిమా కూడా మరో రేంజ్ కి వెళ్ళిపోయేది.
ఇక సినిమా కథ విషయానికి వస్తే రాయ, గంగ ఇద్దరు అక్కా తమ్ముళ్ళు అనాథలు,రాయ ఆకలి తీర్చడం కోసం తన ఒళ్ళు అమ్ముకునేందుకు కూడా సిద్దమవుతుంది.ఇక రాయకి కూడా అక్క అంటే ప్రాణం. ఇదే సమయంలో గోవాని సాల్వడర్ (డారెల్ డి సిల్వా)తన కన్ను సన్నల్లో శాసిస్తుంటాడు.రాయ ,,గంగ ల ధైర్యాన్ని చూసిన సాల్వడర్ వాళ్ళని చేతులు కలుపుతాడు. ఇక అదే సమయంలో సాల్వడర్ కూతురు రెబెకా రాయపై మనసు పారేసుకుంటుంది.
ఇక గంగ కూడా ఎంకరేజ్ చేయడంతో రాయ రేబెకాని పెళ్లి చేసుకునేందుకు అంగీకరిస్తాడు. అదే అనుకోకుండా రాయ రాయల్ సర్కస్ ని నిర్వహించే నదియాని చూసి ఇష్టపడతాడు.అయితే ఆ తర్వాత ఊహించని రీతిలో నదియా సూసైడ్ చేసుకుంటుంది.ఇంతకీ నదియా ఎందుకు చనిపోయింది. రాయ తన కన్న కొడుకుని ఎందుకు మట్టు బెట్టాలని అనుకుంటాడు?రాయ అక్క గంగకి ఏం జరుగుతుంది.రాయ లైఫ్ లోకి మెలిసా వచ్చాక ఏం జరుగుతుంది.జీవితంలో ఎన్నో తప్పులు చేసిన రాయ చివరికి ఎలాంటి పరిస్థితులని ఫేస్ చేశాడు అన్నదే సినిమా కథ.
also read :‘టాక్సిక్’కు టైమ్ బాగోలేదా..OTT రైట్స్‌పై కొత్త లెక్కలు?
మొత్తానికి కథ చూస్తుంటే బానే అనిపించినప్పటికీ గీతూ మోహన్ దాస్ గందరగోళమైన స్క్రీన్ ప్లే తో ఆడియన్స్ ని మరింత గందరగోళం లోకి నెట్టేసింది.అయినప్పటికీ సినిమా కోసం యష్ తన బ్లడ్ అండ్ స్వెట్ ఎలా పెట్టాడో వీడియో చూస్తే అర్థమయిపోతుంది !
The Hardwork and dedication Looks Clear On Screen 🙏🔥@TheNameIsYash
Gave his prime, blood, sweat & 4 years to bring this On Screen 😭😭💥He's Swagger & He have that magic not everybody can has that
– Hollywood Stunt director about #YashBOSS 🔥#Yash | #ToxicTheMovie pic.twitter.com/GH1YdFo6p0— Abhiᵀᵒˣᶦᶜ (@Rocking_Tweetss) August 29, 2026