E-Paper
Advertisement

అరుదైన ఘనత సాధించిన కాంతార హీరో..ఏకంగా మూడు విభాగాల్లో ఎంపిక!

అరుదైన ఘనత సాధించిన కాంతార హీరో..ఏకంగా మూడు విభాగాల్లో ఎంపిక!
Advertisement

Rishab Shetty: కన్నడ చిత్ర పరిశ్రమలో రచయితగా, దర్శకుడిగా, నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో రిషబ్ శెట్టి(Rishab Shetty) ఒకరు. దర్శకుడిగా కొనసాగుతూ ఉన్న ఈయన తన స్వీయ దర్శకత్వంలో కాంతార అనే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇటీవల ఈ సినిమాకు ప్రీక్వెల్ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చి పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని అందుతుంది. ఈ సినిమా అనంతరం రిషబ్ శెట్టి తన తదిపరి సినిమా పనులలో ఎంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే పాన్ ఇండియా స్థాయిలో నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న రిషబ్ తాజాగా మరో అరుదైన ఘనత సాధించారు.

ఫోర్బ్స్ ఇండియా జాబితాలో చోటు..

ప్రతిష్టాత్మక “ఫోర్బ్స్ ఇండియా” (Forbes India) ప్రచురించిన దేశంలోని టాప్ 100 ప్రముఖుల జాబితాలో నటుడు రిషబ్ శెట్టి కూడా చోటు తగ్గించుకున్నారు. ఈ ఏడాది ఫోర్బ్స్ జాబితాలో ఈయన ఒకేసారి ఏకంగా మూడు విభాగాలలో ఎంపిక కావటం విశేషం. నటుడిగా, రచయితగా, దర్శకుడిగా ఇలా మూడు విభాగాలలో ఎంపిక అయినటువంటి ఏకైక నటుడిగా రిషబ్ నిలవడం విశేషం. ఇలా ఒకేసారి మూడు విభాగాలలో చోటు దక్కించుకోవడంతో అభిమానులు సెలబ్రిటీలు సోషల్ మీడియా వేదికగా రిషబ్ శెట్టికి అభినందనలు తెలియజేస్తున్నారు. ఇక రిషబ్ సినిమాల విషయానికి వస్తే..

1000 కోట్ల కలెక్షన్లు..

Advertisement

గత ఏడాది కాంతారా 1 (Kantara 1)సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుని ఇండియన్ బాక్స్ ఆఫీస్ వద్ద ఏకంగా 1000 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి సరికొత్త రికార్డులను సృష్టించింది. ఈ సినిమా మంచి సక్సెస్ కావడంతో ఈయనకు తదుపరి ఇతర భాషలలో సినిమా అవకాశాలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం పలు పాన్ ఇండియా ప్రాజెక్టులతో రిషబ్ శెట్టి ఎంతో బిజీగా గడుపుతున్నారు.

హనుమంతుడిగా రిషబ్..

ప్రస్తుతం ఈయన డైరెక్టర్ ప్రశాంత్ వర్మతో కలిసి జై హనుమాన్(Jai Hanuman) అనే సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన హనుమాన్ సినిమా ఎంతో అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఈ సినిమాకు సీక్వెల్ చిత్రంగా జై హనుమాన్ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పనులను జరుపుకుంటుంది. ఈ సినిమాలో రిషబ్ శెట్టి హనుమంతుడి పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమాతో పాటు ఈయన మరో బాలీవుడ్ సినిమాకి కూడా కమిట్ అయిన సంగతి తెలిసిందే. చత్రపతి శివాజీ మహారాజ్ బయోపిక్ సినిమాలో రిషబ్ శెట్టి నటిస్తున్నారు. ఈ సినిమా అనంతరం కాంతార సీక్వెల్ సినిమా పనులలో బిజీగా కానున్నారు.

Advertisement

Also Read: పవన్ బర్త్ డే స్పెషల్… సతీసమేతంగా కళ్యాణం జరిపించిన నాగబాబు దంపతులు!

Related News

బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన కృతి శెట్టి… ఇంట గెలవలేనమ్మ రచ్చ గెలిచేనా?

ఒకప్పుడు గరివిడి లక్ష్మి అంటే పూనకాలే.. ఇప్పుడు ఆమె ఎక్కడున్నారో తెలుసా?

పెద్ద ఫ్యామిలీ నుంచి వస్తేనే అవార్డులు వస్తాయి.. బిగ్ బాస్ త్రిగుణ్ కామెంట్స్ వైరల్!

బుచ్చిబాబుపై పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఫైర్.. ఆ ఒక్క మాటతో నిప్పు పెట్టేశాడుగా!

సైలెంట్ గా RC 17 మూవీ పనులు.. అసలు నిజం ఎంతంటే?

మాతృత్వం పై శోభిత కామెంట్స్ వైరల్..గుడ్ న్యూస్ చెప్పబోతుందా?

ఓజీ విలన్ కి త్రుటిలో తప్పిన ప్రమాదం!

కల్కి2 లో దీపికా స్థానంలో సాయి పల్లవి.. నాగ్ అశ్విన్ అలా అన్నాడేంటి?

Big Stories

Advertisement
×