karbonn ZenZ Pro: ఒకప్పుడు భారత స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లో తనకంటూ గుర్తింపు తెచ్చుకున్న కార్బన్ మళ్లీ ఫోన్ల రంగంలోకి అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. కంపెనీ నుంచి అధికారిక ప్రకటన ఇంకా రాలేదు. అయితే Karbonn ZenZ Pro పేరుతో ఓ కొత్త స్మార్ట్‌ఫోన్ గీక్‌బెంచ్‌లో కనిపించడం ఆసక్తిని పెంచుతోంది.
గీక్‌బెంచ్‌లో కనిపించిన వివరాల ప్రకారం Karbonn ZenZ Pro సింగిల్ కోర్ టెస్ట్‌లో 422 వరకు, మల్టీకోర్ టెస్ట్‌లో 1,525 వరకు స్కోర్ చేసింది. ఈ ఫోన్ కనీసం 6GB RAMతో రానున్నట్లు లిస్టింగ్ వెల్లడించింది. ఇతర RAM వేరియంట్లు కూడా ఉండే అవకాశం ఉంది.
Also Read: బడ్జెట్‌లో చూడగానే నచ్చేసే టెక్నో కొత్త ఫోన్.. 120Hz డిస్‌ప్లే, AI ఫీచర్లతో లాంచ్!
ఫోన్‌లో మీడియాటెక్ MT6769V/CB పేరుతో ఆక్టాకోర్ చిప్‌సెట్‌ను ఉపయోగించినట్లు గీక్‌బెంచ్ చూపిస్తోంది. దీనిలో రెండు కోర్లు 2.00GHz, ఆరు కోర్లు 1.70GHz వేగంతో పనిచేస్తాయి. ఈ వివరాలను బట్టి ఇందులో మీడియాటెక్ హీలియో G70 SoC ఉండే అవకాశం ఉంది. గ్రాఫిక్స్ కోసం మలి-G52 MC2 GPU ఉండనుంది.
ఈ కార్బన్ ZenZ ప్రో ఫోను.. ఆండ్రాయిడ్ 16 ఆపరేటింగ్ సిస్టమ్‌తో రానున్నట్లు గీక్‌బెంచ్ లిస్టింగ్ సూచిస్తోంది. అయితే ఫోన్‌కు సంబంధించిన పూర్తి స్పెసిఫికేషన్లు, ధర, లాంచ్ తేదీపై ప్రస్తుతానికి ఎలాంటి అధికారిక సమాచారం లేదు. కాబట్టి ఈ వివరాలను ప్రస్తుతానికి అంచనాలుగానే చూడాలి.
కార్బన్ 2009లో జైనా గ్రూప్, యూటీఎల్ గ్రూప్ భాగస్వామ్యంతో ప్రారంభమైంది. ప్రస్తుతం ఫీచర్ ఫోన్లు, స్మార్ట్‌ఫోన్లు, ట్యాబ్లెట్లు, స్మార్ట్ టీవీలను అందిస్తోంది. బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ విభాగంలో కంపెనీ తిరిగి వస్తే పోటీ మరింత పెరిగే అవకాశం ఉంది. ఇప్పటికే ఫైర్‌బోల్ట్ తమ Boltt బ్రాండ్‌తో ఈ విభాగంలోకి అడుగుపెట్టగా.. Mivi కూడా స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి రావడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం.
Also Read: ప్యాకేజ్డ్ ఫుడ్స్‌పై ఇక హెచ్చరిక లేబుల్స్.. కీలక ప్రతిపాదన చేసిన FSSAI!