BigTV English

AP Politics: జగన్‌కి కౌంటర్, తారకరత్న భార్య పోస్టు.. సాయిరెడ్డికి మద్దతుగా

AP Politics: జగన్‌కి కౌంటర్, తారకరత్న భార్య పోస్టు..  సాయిరెడ్డికి మద్దతుగా

AP Politics: ఇంటి గుట్టు లంకకు చేటు అన్న సామెత మాజీ సీఎం జగన్‌కు అతికినట్టు సరిపోతుంది. కోర్ టీమ్ ప్లాన్‌తో నమ్మినబంటు విజయసాయిరెడ్డిని జగన్ దూరం చేసుకున్నారు. దాని పర్యవసానాలు ఇప్పుడిప్పుడే జగన్ అర్థమైనట్టు కనిపిస్తోంది. దాన్ని నుంచి బయటపడేందుకు తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. మీడియా ముందుకొచ్చిన ప్రతీసారి విజయసాయిరెడ్డిని టార్గెట్‌గా చేస్తూ విమర్శలు గుప్పిస్తున్నారు. తాజాగా నందమూరి తారకరత్న భార్య అలేఖ్య తన బాబాయి విజయసాయిరెడ్డికి మద్దతుగా ఆసక్తికరమైన పోస్టుపై చర్చ జరుగుతోంది.


ఇదీ అలేఖ్య పోస్టు సారాంశం..‘‘ప్రజలు ఏమి చెప్పాలనుకుంటున్నారో చెప్పడానికి స్వేచ్ఛగా ఉంటారు. కానీ నిజం లోపల నిశ్శబ్దంగా, బలంగా ఉంటుంది. కొన్ని తప్పుడు కథనాలు ఉన్నప్పటికీ అది అర్హులు కాని వారి పట్ల గౌరవం. నమ్మకం, విధేయత, నీతి అనేవి బోధించినవి మాత్రమే కాదని ఇప్పిటికీ జీవించబడ్డాయి.

చాలా మంది ఊహాగానాలు ప్రచారం చేస్తున్నప్పటికీ, వాటిని తాను చూసినప్పుడు ఆశ్చర్యపోతున్నాను. మీరు కూడా మాట్లాడాలని ఎంచుకుంటే ఏమి జరుగుతుంది? మేం కూడా మాట్లాడటం మొదలు పెడితే ఏం జరుగుతుందని.. ఇది నిజం’’ అంటూ ఫేస్ బుక్ వేదికగా రాసుకొచ్చారు అలేఖ్య. బాబాయి విజయసాయిరెడ్డితో అలేఖ్య కలిసి ఉన్న ఫోటోను జత చేశారు.


అలేఖ్య పోస్టుపై పెద్దగా చర్చ అవసరం లేదు.  జగన్ మీడియా సమావేశం తర్వాత పోస్టు పెట్టడమే దీనికి కారణం. దీనివెనుక ఏదో జరుగుతోందని సంకేతాలు ఇచ్చినట్టు చెబుతున్నారు సాయిరెడ్డి మద్దతుదారులు. విజయసాయిరెడ్డిపై జగన్ తీవ్రమైన కామెంట్స్ చేసి చాలా గంటలు గడుస్తోంది.

ALSO READ: ఏపీలో కొవిడ్ కలకలం.. ఇలా చేస్తే మీరు సేఫ్

ఆయన నుంచి గానీ, తన ఎక్స్ ఖాతా నుంచి ఎలాంటి రియాక్స్ కనిపించలేదు. బహుశా జగన్ ఫ్యూచర్ ముందుగానే తెలిసి సాయిరెడ్డి సైలెంట్ అయ్యారని అంటున్నారు. ఎందుకంటే జగన్ మీడియా ముందుకొచ్చి మాటలు అన్నీ అబద్దాలేనని చాలామందికి తెలుసు. ఇదే ఆయన మౌనానికి కారణమని అంటున్నారు. లేకుంటే ఈపాటికే విజయసాయి రియాక్ట్ అయ్యేవారని అంటున్నారు.

విజయసాయిరెడ్డిపై జగన్ గురువారం మీడియాతో ఈ విధంగా మాట్లాడారు. ‘‘ చంద్రబాబుకు లొంగిపోయిన వ్యక్తి విజయసాయిరెడ్డి. ఎంపీగా మూడున్నరేళ్ల పదవీ కాలం ఉన్నా తన రాజీనామాతో చంద్రబాబు-కూటమికి మేలు జరుగుతుందని భావించారని చెప్పారు. ప్రలోభాలకు లోనై తన ఎంపీ పదవిని అమ్మేసిన అలాంటి వ్యక్తి ఇచ్చే ప్రకటనకు ఏం విలువ ఉంటుంది?’’ అని మాట్లాడారు. వైఎస్ హయాం నుంచి సాయిరెడ్డి ఆ ఫ్యామిలీకి నమ్మినబంటు. ఎవరు ఔనన్నా కాదన్నా ముమ్మాటికీ నిజం. మరి అప్పుడు ఆయనకు ఎంత ఇచ్చారంటూ సోషల్‌మీడియా వేదికగా కామెంట్స్ షురూ అయ్యాయి.

తారకరత్న భార్య అలేఖ్యకు విజయసాయిరెడ్డికి వరసకు బాబాయి అవుతారు. లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో తారకరత్న తీవ్ర అస్వస్థతకు గురయి బెంగళూరులో ట్రీట్‌మెంట్ తీసుకుంటూ మరణించాడు. అలాంటి కష్ట సమయంలో అలేఖ్యకు విజయసాయిరెడ్డి కుటుంబం అండగా నిలిచింది. అలేఖ్యతోపాటు వారి పిల్లలను విజయసాయిరెడ్డి కలుస్తారు కూడా.

కొన్ని నెలల కిందట రాజకీయాలకు గుడ్ బై చెప్పేశారు విజయసాయిరెడ్డి. తాను వ్యవసాయం చేసుకుంటున్నారని ఓపెన్ గా చెప్పారు. ఇటీవల లిక్కర్ కేసులో ఆయనకు సిట్ నోటీసులు జారీ చేసింది. విచారణకు సందర్భంగా మీడియా ముందుకొచ్చారు. ఈ సందర్భంగా వైసీపీ, ఆ పార్టీలో జరుగుతున్న సీక్రెట్ వ్యవహారాలను బయటపెట్టారు. అసలు గుట్టు బయటపడడంతో నేతలు తలోదిక్కు చెదిరిపోతున్న విషయం తెల్సిందే.

Related News

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Visakhapatnam Crime: భార్య పేకాటపై భర్త కంప్లైంట్.. పెద్ద సంఖ్యలో చిక్కిన పేకాట రాణులు..!

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

Big Stories

×