Gundeninda GudiGantalu Today episode May 23rd: నిన్నటి ఎపిసోడ్ లో.. ప్రభావతి పై మీనా సెటైర్లు వేస్తుంది. దాని గురించి ఇంట్లో పెద్ద చర్చ జరుగుతూ ఉంటుంది అప్పుడే బాలు ఎంట్రీ ఇస్తాడు. పూల కొట్టుకి అద్ది బాల అంటూ ప్రభావతిని ఓ ఆట ఆడుకుంటాడు. ఇక తర్వాత ఇదిగోండి నాన్న మీ డబ్బులు అని శివ ఇచ్చిన డబ్బులను సత్యంకిస్తాడు బాలు. నా డబ్బులు ఏంట్రా ఎవరిచ్చారు ఏం డబ్బులు ఇవి అని సత్యం అడుగుతాడు.. ఒకరోజు ఈ అద్యావతికి మీ పెన్షన్ డబ్బులు ఇచ్చి వడ్డీ కట్టమని ఇచ్చారు కదా అవి ఎవరో దొంగలు తీసుకెళ్లారని చెప్పింది కదా అదే ఇవి అని అంటాడు. అవి పోయాయి కదా నీకు ఎలా వచ్చాయి అని సత్యం అడుగుతాడు.
ఆ దొంగని పోలీసులు పట్టుకున్నారు ఆ డబ్బుల్ని తెచ్చి నాకు ఇచ్చారు నేను మీకు ఇచ్చాను అంతే. ఇప్పటికైనా ఈ డబ్బులు జాగ్రత్తగా పెట్టుకోండి. చాలామంది కళ్ళు ఈ డబ్బులు మీద పడ్డాయి తీసుకున్న తీసుకుంటారు జాగ్రత్త నానో అని బాలు అంటారు. ప్రభావతి మాత్రం ఆ దొంగ దొరికాడా ఎవడోడు ఎక్కడున్నాడు వాడు అని అడుగుతుంది. వాన్ని పోలీసులు పట్టుకొని జైలుకు పంపించారు ఒకవేళ నువ్వు కలవాలనుకుంటే జైలుకెళ్ళి కలువు అని ప్రభావతిని అంటాడు. రోహిణికి మాత్రం అనుమానం ఉంటుంది. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికొస్తే.. మనసు ఇంటర్వ్యూ కి వెళ్లడానికి డబ్బులు కోసమని ప్రభావతిని వెతుక్కుంటూ వస్తాడు. ప్రభాస్ దగ్గరికి వచ్చి అమ్మ నాకు డబ్బులు కావాలి అని అడుగుతాడు. డబ్బుల అదేంట్రా అని ప్రభావతి అంటుంది. లేదమ్మా ఇంటర్వ్యూ ఉంది వెళ్ళాలి.. అంటే నువ్వు ఆల్రెడీ జాబ్ చేస్తున్నావ్ కదరా మల్లి ఇంటర్వ్యూ కి ఎందుకు అని అడుగుతుంది. పాత జాబ్ ఏమైందిరా ఎప్పుడు వదిలేశావు దాన్ని.. అస్సలు నువ్వు మనిషివేనారా నిన్ను మానసిక వైద్యుడు దగ్గరికి తీసుకెళ్లాల్సింది అని ప్రభావతి చిందులేస్తుంది.. ఏ జాబ్ కూడా చేయలేవా నువ్వు ఎందుకు వదిలేసి వస్తున్నావని ప్రభావతి మనోజ్ పై అరుస్తుంది.
ఇలా జాబు వదిలేసి పోతుంటే ఏ భార్య అయినా ఎలా కాపురం చేస్తుంది. రోహిణి మళ్ళీ వెళ్ళిపోయిందా అని అడుగుతుంది ప్రభావతి. జాబ్ పోయిన విషయం రోహిణి నీకు తెలుసమ్మా.. అవునా అయితే రోహిణి వెళ్ళిపోయిందా సరే మళ్లీ చెప్పు వెళ్ళిపోయిందా అని టెన్షన్ పడుతుంది. లేదమ్మా నాకు ఇప్పుడు డబ్బులు కావాలి నేను ఇంటర్వ్యూ కి వెళ్తున్నాను గొప్ప కంపెనీనే ఇది అని అంటాడు. నా దగ్గర డబ్బులు లేవు అని ప్రభావతి అంటుంది. నిన్న బాలు నాన్నకు ఇచ్చారు కదా అంటే ఆ డబ్బులు మీ నాన్న దగ్గరే ఉన్నాయి నా దగ్గర అసలు డబ్బులు నీ చావు.. ఇక మనోజ్ ప్రభావతి ఇవాళ గదిలోకి వెళ్లి వాళ్ళ నాన్న జేబులో ఉన్న డబ్బులను కొట్టేస్తాడు.
సత్యం జేబులో పెట్టిన డబ్బులు నువ్వు వెతుకుతాడు కానీ అక్కడ డబ్బులు కనిపించవు.. ప్రభాత దగ్గరకొచ్చి ప్రభ జేబులో డబ్బులు పెట్టాను 300 తీసావా నువ్వు అని అడుగుతాడు. అయితే ప్రభావతి మనోజ్ మీద అనుమానంతో మనోజ్ ని ఒక 300 ఉన్నాయా ఇస్తావా అని అడుగుతుంది.. నా దగ్గర ఎక్కడమ్మా ఆన్లైన్ లో ఉన్నాయని చెప్పేసి అంటాడు. ఇక సత్యం బాలుని డబ్బులు అడుగుతాడు. నా దగ్గర లేవు నాన్న అనగానే మీనా తెచ్చి ఇస్తుంది. బాలు బయటికి వెళ్తుంటే నీకు ఇష్టమైన టిఫిన్ చేసి వెళ్ళు అని సత్యం అంటాడు.
అక్కడ టిఫిన్ చేయాలని చూస్తే పూరి చేసి ఉంటుంది. బాలు నేను పూరి చేయకపోతే బాధపడుతుంది బయటికెళ్తే ఇలాంటి పూరిని మిస్ అయిపోతాను అంటూ ఆలోచిస్తాడు. ఎవరేమైనా అనుకోని పర్లేదు పూరీని ఒక పట్టు పట్టాలని పూరీలను తింటాడు. లాస్ట్ లో రెండే ఉన్నాయి కదా నీవి కూడా నేను తినేస్తే మీనా ఏం తింటుంది అని లేచి వెళ్లిపోతాడు. ఇక మీనా అక్కడికి వెళ్లి నాకోసమే ఈ ముళ్ళకంప వదిలేసి వెళ్ళాడు అని పూరీలను తింటుంది..
మనోజ్ మనసు ఇంటర్వ్యూ కి వెళ్తాడు ఇంటర్వ్యూ కి వెళ్తాడు. అక్కడ ఇంటర్వ్యూకి ఎక్కువ మంది వస్తే వాళ్ళందరితో మాటలు చెప్పి అందరిని బురిడీ కొట్టించి పంపించేస్తాడు. ఇక మనోజ్ ని ఇంటర్వ్యూ పిలుస్తారు. మనోజ్ క్వాలిఫికేషన్ చూసి అక్కడ ఉన్న ఇంటర్వ్యూ చేసే వ్యక్తి ఇంప్రెస్ అయిపోతాడు. అయితే కెనడాల ఉద్యోగం వచ్చిందని అతను చెప్తాడు. జీతము లక్షల్లో ఉంటుంది ఈ జాబ్ రావాలంటే ముందుగా మీరు మా కంపెనీకి 14 లక్షలు డిపాజిట్ చేయాలని చెప్తారు. అది విన్న మనోజ్ షాక్ అవుతాడు. అయితే ప్రభావతి సత్యం అందరూ హాల్లో కూర్చుని ఉంటారు. అయితే మనోజు ఇంటర్వ్యూ కి వెళ్లి అడుగు తొందరగా వస్తాడని మీనాను అన్నం చేయమని చెప్తుంది. ఏంటి ఈ రోజు బాక్స్ తీసుకెళ్లలేదమ్మా రోహిణి అని సత్యం అడుగుతాడు. అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది.. ఇప్పుడు ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో చూడాలి..