Manchu Vishnu : మంచు ఫ్యామిలీలో జరుగుతున్న గొడవలు రోజుకో ట్విస్ట్ తో వార్తల్లో నిలుస్తున్నాయి. ఈ మంచు బ్రదర్స్ మధ్య వివాదం ఇప్పట్లో ముగిసేలా కనిపించట్లేదు. రీసెంట్ గా వీరిద్దరూ ట్విట్టర్ వార్ కూడా మొదలుపెట్టారు. అన్నదమ్ములు ఇద్దరూ కలిసి తమ తండ్రి మోహన్ బాబు పాత సినిమాల్లోని వీడియోలను, డైలాగులను వాడుకుంటూ ఒకరిపై ఒకరు సెటైర్లు వేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే తాజాగా మంచు విష్ణు (Manchu Vishnu) ఇంటర్వ్యూలో “మంచు ఫ్యామిలీ రెండుగా విడిపోయిందట కదా?” అనే ప్రశ్నకి సీరియస్ అవుతూ వార్నింగ్ ఇచ్చారు.
మంచు విష్ణు వార్నింగ్…
గత కొన్నాళ్లుగా మోహన్ బాబు (Mohan Babu) ఫ్యామిలీలో వివాదాలు నడుస్తున్న సంగతి తెలిసిందే. మంచు బ్రదర్స్ మధ్య గొడవలు, తండ్రి అన్నపై మనోజ్ (Manchu Manoj) కామెంట్స్, మోహన్ బాబు – మనోజ్ ఒకరిపై ఒకరు కంప్లైంట్ చేసుకోవడం, మీడియా వ్యక్తిని మోహన్ బాబు దాడి చేయడంతో ఫ్యామిలీ వివాదం కాస్తా రచ్చకెక్కింది. కొన్ని రోజులు ఇద్దరూ సైలెంట్ గా ఉండడంతో గొడవ సద్దుమణిగిందని అందరూ భావించారు. కానీ ఉన్నట్టుండి మంచు మనోజ్ తనకు ప్రాణహాని ఉందంటూ పోలీస్ స్టేషన్ కి ఎక్కడం, రీసెంట్ గా విష్ణు – మనోజ్ మధ్య ట్విట్టర్ వార్ మొదలు కావడంతో ఈ వివాదం అసలు తెగుతుందా ? అనే అనుమానం నెలకొంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విష్ణుని వాళ్ళ ఫ్యామిలీ గొడవ గురించి ఇంట్రెస్టింగ్ ప్రశ్నలు అడిగారు.
అందులో భాగంగానే “మంచు ఫ్యామిలీ రెండు భాగాలుగా విడిపోయింది అంట కదా? మంచు లక్ష్మీ (Manhu Lakshmi), మనోజ్ ఒకవైపు… విష్ణు మోహన్ బాబు ఒకవైపు అని అంటున్నారు. అది నిజమేనా?” అని అడగ్గా… మంచు విష్ణు స్పందిస్తూ “ఇంటర్వ్యూ కంప్లీట్ గా కన్నప్ప (Kannappa) సినిమా గురించే ఉంటుందని చెప్పారు. ఇంకొక్క ప్రశ్న ఫ్యామిలీ గొడవల గురించి అడిగినా సరే ఈ ఇంటర్వ్యూ నుంచి లేచి వెళ్ళిపోతాను” అంటూ వార్నింగ్ ఇచ్చారు. దీంతో కాసేపు సినిమా గురించి డిస్కషన్ నడిచినప్పటికి, ఆ తర్వాత మళ్లీ ఫ్యామిలీ గొడవల గురించి ప్రశ్నలు మొదలయ్యాయి.
ఈ గొడవలో నలిగిపోయింది ఆమె మాత్రమే
మంచు విష్ణు (Manchu Vishnu) మాట్లాడుతూ “కుటుంబ విషయాల గురించి మాట్లాడినా, ఇంకా ఈ గొడవలు కంటిన్యూ అవుతున్నాయని మా అమ్మ కొడుతుందని భయంగా ఉంది. ఈ గొడవలో ఎక్కువగా నలిగిపోయింది మా అమ్మ” అంటూ చెప్పుకొచ్చారు.
దుబాయ్ కి జంప్…
ఇదే ఇంటర్వ్యూలో “మీరు దుబాయ్ లో సెటిల్ అవ్వబోతున్నారని, అందుకే మనోజ్ ఇలా గొడవ చేస్తున్నారని అంటున్నారు?” అనే ప్రశ్నకి మంచు విష్ణు (Manchu Vishnu) స్పందిస్తూ “పిల్లలను దుబాయ్ లో చదివించాలని అనుకుంటున్నాను అంతే. నేను ఎవరికీ భయపడను, ఎక్కడికి వెళ్ళను” అంటూ సమాధానం ఇచ్చారు. ఇక మరికొన్ని ప్రశ్నలకు ఐ డోంట్ ఆన్సర్ దిస్ క్వస్చన్ అంటూ ఎప్పటిలాగే సమాధానాన్ని దాట వేశారు మంచు విష్ణు.