తిరుమల గోశాల నిర్వహణపై వైసీపీ తీవ్ర విమర్శలు చేసిన సంగతి తెలిసిందే. టీటీడీపై భూమన ఆరోపణలు బూమరాంగ్ అయినట్టు ఇప్పుడు స్పష్టమవుతోంది. తెలుగుదేశం పార్టీ ఈ వ్యవహారాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టలేదు. పాత ఆధారాలు సైతం వెదికి తీసి వైసీపీకి రివర్స్ లో కౌంటర్లిస్తోంది. ఇప్పటికే టీడీపీ నేతలు ప్రతిస్పందించారు. ఇప్పుడు వీడియోలు అప్ లోడ్ చేస్తూ సోషల్ మీడియాలో వైసీపీని టార్గెట్ చేస్తోంది టీడీపీ.
వైసీపీ ప్రభుత్వ హయాంలో టీటీడీ గోసంరక్షణ శాలల్లో జరిగిన ఘోరాలు అన్నీఇన్నీ కావు…
2024 ఏప్రిల్ 1న, టీటీడీ గోశాలలో విజిలెన్స్ తీసిన ఫోటోలే ఇందుకు నిదర్శనం.
గోవులకు నాసిరకం దాణా, కాలంచెల్లిన మందులు ఇచ్చి నోరులేని మూగజీవాల ప్రాణాలను తీసుకున్నారు.
గోవుల మరణాలతో పాటు, ఈ విజిలెన్స్… pic.twitter.com/27bmdBvV9b— Telugu Desam Party (@JaiTDP) April 16, 2025
లైవ్ లో చూపిస్తాం..
ఇప్పటికే పలువురు నేతలు తిరుమల గోశాలకి వెళ్లి అక్కడి పరిస్థితుల్ని నేరుగా పర్యవేక్షించారు. వారంతా అక్కడ కరుణాకర్ రెడ్డి చెప్పినట్టుగా దారుణ పరిస్థితులు లేవని అంటున్నారు. అంతే కాదు, వీడియో సాక్ష్యాలు కూడా అలాగే ఉన్నాయి. ఇక టీడీపీ నేరుగా వైసీపీకి ఛాలెంజ్ విసిరింది. 17వతేదీ ఉదయం 10 గంటలకు వైసీపీ నేతలెవరైనా అక్కడకు వస్తే లైవ్ లోనే అన్నీ చూడొచ్చని అంటున్నారు. తిరుమలతో పెట్టుకున్నారు కాబట్టి, వారికి కౌంట్ డౌన్ మొదలైనట్టేనని విమర్శిస్తున్నారు.
Countdown Begins⏱️
We challenge Mr. @ysjagan and Mr. Bhumana Karunakar Reddy to show up at Tirumala on April 17th and witness the state of the Gaushala with their own eyes.
🔴LIVE at 10:00 AMకౌంట్‌డౌన్ ప్రారంభం ⏱️
వైఎస్ జగన్‌కి, భూమన కరుణాకర్‌రెడ్డికి ఇదే మా ఛాలెంజ్. ఏప్రిల్…— Telugu Desam Party (@JaiTDP) April 16, 2025
గతంలో ఇలా..
వైసీపీ హయాంలో గోశాలలో జరిగిన దారుణాలు ఇవేనంటూ టీడీపీ కొన్ని వీడియోలను బయటపెట్టింది. తిరుపతి జిల్లా యర్రావారిపాళెం మండలం కమలయ్యగారిపల్లిలో ఆవులు లేకపోయినా.. అక్కడి గోశాలలో దాణాకూ టెండర్లు పిలిచి, అప్పట్లో వైసీపీ నేతలు డబ్బులు కొట్టేశారని అంటున్నారు టీడీపీ ఎమ్మెల్యే పులివర్తి నాని. 2023 ఏప్రిల్ 6న, టీటీడీ గోశాలలోని గోవులకు నాచుపట్టిన నీరు ఇచ్చినట్లు అప్పటి విజిలెన్స్ ఎంక్వయిరీలో తేలిందని, దానికి సాక్ష్యంగా తమ వద్ద వీడియో కూడా ఉందని అంటున్నారు టీడీపీ నేతలు. గోవుల మరణాలతో పాటు, ఆ విజిలెన్స్ రిపోర్ట్ ని జగన్ ఎందుకు దాచి పెట్టారని వారు సూటిగా ప్రశ్నిస్తున్నారు.
ఏది నిజం..?
గోశాలలో జరిగిన దారుణాలు అంటూ ఇటీవల భూమన కరుణాకర్ రెడ్డి కొన్ని ఫొటోలు బయటపెట్టారు. గత 3 నెలల్లో గోవులు చనిపోయిన దృశ్యాలంటూ ఆయన ఫొటోలు విడుదల చేశారు. ఇవన్నీ ఫేక్ అంటోంది టీడీపీ అండ్ టీటీడీ. ఎక్కడో గోవులు చనిపోయిన ఫొటోల్ని తీసి తిరుమల గోశాలకు ముడిపెడుతున్నారని మండిపడ్డారు నేతలు. అదే సమయంలో టీడీపీ మరికొన్ని వీడియోలు బయటపెట్టడం విశేషం. గతంలో విజిలెన్స్ తనిఖీల సమయంలో బయటపడిన వీడియోలు, ఫొటోలు ఇవేనంటూ టీడీపీ కౌంటర్లు మొదలు పెట్టింది. మరి వీటికి వైసీపీ నుంచి ఇంకా సమాధానం రాలేదు. ఒకవేళ ఇవి ఫేక్ అంటే, మరి అవి ఒరిజినల్ ఫొటోలా అని టీడీపీ ప్రశ్నిస్తుంది. మొత్తమ్మీద ఈ ఎపిసోడ్ లో వైసీపీకి పెద్దగా మైలేజీ రాకపోగా.. టీడీపీ విడుదల చేసిన ఫొటోలతో ఆ పార్టీ ఇబ్బందుల్లో పడిందని అంటున్నారు.
ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. సరైన టైమ్ చూసి ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టాలని ప్రతిపక్షం చూస్తోంది. మొదట్లో రెడ్ బుక్ అన్నారు, అక్రమ అరెస్ట్ లు అన్నారు, ఇప్పుడు తిరుమలలో అపచారం అంటున్నారు. కానీ వీటిలో ఏదీ పెద్దగా క్లిక్ కాలేదు. ఏ విషయంలోనూ ప్రభుత్వాన్ని పక్కాగా ఇరుకున పెట్టడం వైసీపీకి సాధ్యం కావడంలేదు. గోశాల విషయంలో బ్రేకింగ్ న్యూస్ అంటూ ప్రచారం చేసి మరీ భూమన ప్రెస్ మీట్ పెట్టినా.. ఇప్పుడు వైసీపీనే ఇరుకునపడేలా కనపడుతోంది.