Niranjan Reddy: దర్శకులకు, హీరోలకు, హీరోయిన్స్‌కు మాత్రమే కాదు.. మంచి హిట్ సినిమాల వల్ల నిర్మాతలకు కూడా పేరొస్తుంది. ప్రేక్షకులు కూడా వారిని ఫలానా సినిమాల నిర్మాతలు అనే గుర్తుపెట్టుకుంటారు. అలా తాజాగా ‘హనుమాన్’ సినిమాను నిర్మించడం వల్ల ప్రేక్షకులకు గుర్తుండిపోయాడు నిరంజన్ రెడ్డి. ప్రశాంత్ వర్మ, తేజ సజ్జా కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘హనుమాన్’ మినిమమ్ బడ్జెట్‌తో తెరకెక్కినా అది క్రియేట్ చేసిన సెన్సేషన్ ఏ రేంజ్‌లో ఉందో తెలుగు ప్రేక్షకులు అందరికీ తెలుసు. అలాంటి సినిమాను నిర్మించడానికి ప్రశాంత్ వర్మకు సహాయపడిన నిరంజన్ రెడ్డిని కూడా ఆడియన్స్ ప్రశంసించారు. అలాంటి నిర్మాత.. తనకు హిట్ ఇచ్చిన దర్శకుడే మోసం చేశాడంటూ చాంబర్‌కెక్కాడు.
ఆ ముగ్గురిపై ఫిర్యాదు
‘బాయ్‌ఫ్రెండ్ ఫర్ హైర్’ అనే రొమాంటిక్ డ్రామాను నిర్మించిన తర్వాత ‘హనుమాన్’తో నిరంజన్ రెడ్డికి బ్రేక్ వచ్చింది. ఆ తర్వాత ప్రియదర్శి హీరోగా తెరకెక్కిన ‘డార్లింగ్’ మూవీని నిర్మించినా అందరూ తనను ‘హనుమాన్’ నిర్మాత అనే గుర్తుపెట్టుకోవడం మొదలుపెట్టారు. అలా నిర్మాతగానే కాకుండా డిస్ట్రిబ్యూషన్‌లో కూడా అడుగుపెట్టాడు నిరంజన్ రెడ్డి (Niranjan Reddy). పూరీ జగన్నాధ్, రామ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను డిస్ట్రిబ్యూట్ చేశారు. ఈ విషయం చాలామందికి తెలియకపోయినా ఈ సినిమా డిస్ట్రిబ్యూషన్ వల్ల ఆయనకు నష్టమే మిగిలింది. అందుకే ప్రశాంత్ వర్మ, పూరీ జగన్నాధ్, ఛార్మీపై ఫిర్యాదు చేస్తూ నిరంజన్ రెడ్డి చాంబర్‌కెక్కారు.
సీక్వెల్ విషయంలో మోసం
‘హనుమాన్’ (Hanuman) సక్సెస్ అయితే ఒక సినిమాటిక్ యూనివర్స్‌ను క్రియేట్ చేస్తానని దర్శకుడు ప్రశాంత్ వర్మ ముందే ప్రకటించాడు. అనుకున్నట్టుగానే ఆ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయ్యింది. అంతే కాకుండా ఈ సినిమాటిక్ యూనివర్స్‌లో ముందుగా ‘హనుమాన్’కు సీక్వెల్ తెరకెక్కిస్తానని అన్నాడు. కానీ అలా జరగడం లేదు. ఇప్పుడు ప్రశాంత్ వర్మ కూడా పలు ప్రాజెక్ట్స్‌ను ఒకేసారి హ్యాండిల్ చేస్తూ బిజీగా ఉన్నాడు. అలా సీక్వెల్ విషయంలో తనను ప్రశాంత్ వర్మ (Prasanth Varma) మోసం చేశాడంటూ ఆరోపిస్తూ చాంబర్‌కెక్కాడు నిరంజన్ రెడ్డి. అంతే కాకుండా ‘డబుల్ ఇస్మార్ట్’ డిస్ట్రబ్యూషన్ వల్ల తను నష్టపోయానంటూ పూరీ, ఛార్మీలపై కూడా ఫిర్యాదు చేశాడు.
Also Read: ఒక్క రూపాయి రెమ్యునరేషన్ ఇచ్చి బాలీవుడ్ స్టార్‌తో సినిమా.. కట్ చేస్తే మూవీ సూపర్ హిట్
భారీగా నష్టం
‘డబుల్ ఇస్మార్ట్’ సినిమాను పూరీ జగన్నాధ్ డైరెక్ట్ చేయడం మాత్రమే కాకుండా ఛార్మీతో కలిసి తనే నిర్మించాడు. అయితే దీని థియేటర్ రైట్స్‌ను రూ.40 కోట్లకు కొనుగోలు చేశాడు నిరంజన్ రెడ్డి. దానివల్ల తనకు రూ.30 కోట్ల నష్టం వచ్చింది. ఈ నష్టాన్ని పూరీ, ఛార్మీ తీరుస్తారని నిరంజన్ రెడ్డి భావించాడు. కానీ వారి నుండి తనకు ఎలాంటి సాయం అందలేదు. పైగా వారి తరువాతి సినిమా నిర్మాణ బాధ్యతలు తనకు ఇస్తారని ఆశించినా అది కూడా నిజం కాలేదు. అలా ‘హనుమాన్’ సీక్వెల్ విషయంలో ప్రశాంత్ వర్మ, ‘డబుల్ ఇస్మార్ట్’ డిస్ట్రిబ్యూషన్ విషయంలో పూరీ జగన్నాధ్, ఛార్మీ తనను మోసం చేశారని నిరంజన్ రెడ్డి చాంబర్‌లో ఫిర్యాదు చేశారు.