BigTV English

TDP vs YCP: ధర్మారెడ్డి, భూమన.. జగన్ బంధువులే, ఇదిగో వంశవృక్షం, ఆ వివరాలన్నీ లీక్!

TDP vs YCP: ధర్మారెడ్డి, భూమన.. జగన్ బంధువులే, ఇదిగో వంశవృక్షం, ఆ వివరాలన్నీ లీక్!

TDP vs YCP: మీ ప్రభుత్వ హయాంలో టీటీడీలో అందరూ మీ బంధువులే ఉన్నారు.. ఇదిగో సాక్ష్యమంటూ టీడీపీ ట్విట్టర్ వేదికగా.. మాజీ సీఎం జగన్ కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చింది. తిరుమల లడ్డు వ్యవహారంపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు పట్ల మాజీ సీఎం జగన్ స్పందించేందుకు.. మీడియా సమావేశం నిర్వహించారు.


ఈ సంధర్భంగా జగన్ మాట్లాడుతూ.. తనపై టీడీపీ ట్విట్టర్ వేదికగా దుష్ప్రచారం చేస్తుందన్నారు. అలాగే టీడీపీ ట్విట్టర్ లో పోస్ట్ చేసిన చిత్రాన్ని ప్రదర్శిస్తూ.. తనకు వరుసకు బావగా ధర్మారెడ్డి, మామగా కరుణాకర్ రెడ్డిలు ఎలా కుటుంబీకులు అవుతారంటూ ప్రశ్నించారు. తన బంధువులందరూ టీటీడీలో ఉండి, పాలన సాగించినట్లు అబద్దపు ఆరోపణలను టీడీపీ చేస్తుందన్నారు. అలాగే అబద్దాన్ని నిజం చేసేందుకు ప్రయత్నించడంలో టీడీపీ విశ్వ ప్రయత్నం చేస్తుందని విమర్శించారు.

Also Read: Minister Satyakumar: జగన్ కు షాక్.. వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి


అయితే జగన్ ప్రెస్ మీట్ లో ఇలా మాట్లాడారో లేదో.. టీడీపీ ట్విట్టర్ వేదికగా స్ట్రాంగ్ కౌంటర్ వేసింది. టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డి, టీటీడీ మాజీ ఛైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి, మరో మాజీ ఛైర్మన్ వైవి సుబ్బారెడ్డిలు ఏవిధంగా జగన్ కు బంధువులు అవుతారో తెలుపుతూ.. వంశ వృక్షాన్ని విడుదల చేసింది.

ఇక టీడీపీ ట్విట్టర్ ద్వారా విడుదల చేసిన వంశ వృక్షం ఆధారంగా.. దివంగత ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్ రెడ్డి మేనల్లుడి కుమారుడే టీటీడీ మాజీ ఈవో ధర్మారెడ్డినని, మాజీ చైర్మన్ కరుణాకర్ రెడ్డి కుమార్తెను వైయస్ రాజశేఖర్ రెడ్డి సోదరుడి కుమారుడికి ఇచ్చి వివాహం చేసినందుకు.. జగన్ కు భూమన మామ అవుతారని ఆ పోస్ట్ లో ఉన్న సారాంశం. అలాగే వైయస్ విజయమ్మ చెల్లెలిని వైవి సుబ్బారెడ్డి వివాహం చేసుకోవడంతో జగన్ కు బాబాయ్ అంటూ వారి చిత్రాలను సైతం అందులో పొందుపరిచింది.

అంతేకాకుండా.. టిటిడిలో అంతా మీ బంధువులను ఏర్పాటు చేసుకొని దోచుకున్నారు అంటూ.. మేము చెప్తుంటే, నీ భాగోతం బయట పెట్టిన, మా మీద పడి ఏడుస్తావా ? అంటూ మరో ట్వీట్ చేసింది టీడీపీ. ఇలా ట్వీట్ ల వర్షంతో మరోమారు టీడీపీ, వైసీపీ మధ్య వార్ ప్రారంభమైందని చెప్పవచ్చు.

ఇప్పటికే తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి కూటమి వర్సెస్ వైసీపీ మధ్య విమర్శలు, ప్రతి విమర్శలు సాగుతుండగా.. ఇప్పుడు సోషల్ మీడియా ద్వారా నేరుగా జగన్ కే టీడీపీ గురి పెట్టిందని చెప్పవచ్చు. మొత్తం మీద టీడీపీ విడుదల చేసిన ఈ వంశవృక్షంలో వాస్తవం ఉందో లేదో కానీ.. సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. అయితే దీనిపై వైసీపీ ఎలా కౌంటర్ ఇస్తుందో వేచి చూడాలి.

Related News

Jagan Fear: తమ్ముడు బాటలో జగన్.. అసలు మేటరేంటి?

Andhra Is Back: ఆంధ్రా ఈజ్ బ్యాక్.. కూటమి కొత్త నినాదం..

Nara Lokesh: ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిస్తామని మాటిచ్చాం.. అందుకే ఇంత కష్టపడుతున్నాం

AP Students: ఏపీ విద్యార్థులకు ఎంజాయ్.. వరుసగా మూడు రోజులు సెలవులు

AP Rain Alert: బిగ్ అలర్ట్.. రెండు రోజులు భారీ వర్షసూచన.. ఆ జిల్లాలలో ఎఫెక్ట్ ఎక్కువే!

AP new bar policy: ఏపీలో కొత్త బార్ పాలసీ.. ఇకపై మందుబాబులకు అక్కడ కూడా కిక్కే!

Big Stories

×