BigTV English

Minister Satyakumar: జగన్ కు షాక్.. వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి

Minister Satyakumar: జగన్ కు షాక్.. వైఎస్సార్ జిల్లా పేరు మార్చాలంటూ సీఎంకు లేఖ రాసిన మంత్రి

Minister Satyakumar Yadav: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఏపీకి చెందిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ షాకిచ్చారనే చెప్పవచ్చు. మాజీ సీఎం వైయస్ జగన్ సొంత జిల్లా పేరును మార్చాలని సీఎం చంద్రబాబుకు మంత్రి సత్య కుమార్ లేఖ రాశారు. కడప జిల్లా చరిత్రపై అవగాహన లేని జగన్ .. నాడు తన పరిపాలన సమయంలో కడప జిల్లా పేరును వైఎస్సార్ జిల్లా గా మార్చారని మంత్రి లేఖలో పేర్కొన్నారు.


కలియుగ వేంకటేశ్వరుడి సన్నిధికి చేరేందుకు తొలి గడప కడప అని, అటువంటి కడప పేరును యధాతథంగా మార్చాలని డిమాండ్ చేశారు. ఎంతో గొప్ప ఆధ్యాత్మిక ప్రాశస్త్యం గల కడప పేరు మార్పుపై నాడు.. శ్రీవారి భక్తులు భయంతో తమ అభిప్రాయాలను నాటి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళలేదన్నారు. కడప జిల్లా అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డి పాటు పడిన విషయం ఎవ్వరూ కాదనలేని సత్యమని సత్యకుమార్ అన్నారు.

కడప జిల్లా చరిత్రను లేఖలో ఇలా వర్ణించారు
రాయలసీమలోని కడప జిల్లాలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం దేవుని కడప. ఆదిమధ్యాంతరహితుడైన శ్రీనివాసుడు వెలసియున్న గొప్ప పుణ్యక్షేత్రం. ఈ ఆలయంలో శ్రీవారు శ్రీలక్ష్మీ వెంకటేశ్వర స్వామిగా అవతరించి ఉన్నారు. ప్రధానంగా ఈ ఆలయం హనుమత్ క్షేత్రంగా ప్రసిద్ధి చెందింది. పూర్వం ఈ ప్రాంతమంతా రాక్షస నిలయంగా ఉండేది. రాక్షసాంతకుడైన హనుమంతుడు ఈ ప్రాంత వాసులకు దానవ పీడ తొలగించడానికి మశ్చ్యావతారంగా ఆవిర్భవించాడని ప్రసిద్ధి. ఆ తరువాత కృపాచార్యుల వారు తీర్థయాత్రలు చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చి హనుమత్ క్షేత్రమైన ఈ క్షేత్రంలో బస చేశారు. అక్కడ నుండి వారు తిరుమల వెళ్లి శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించాలని సంకల్పించారు. కానీ కొన్ని పరిస్థితుల వలన వారు ముందుకు సాగలేకపోయారు. శ్రీవారి దర్శనాభిలాషతో కృపాచార్యులు తపించి పోయారు. శ్రీవారి కరుణను పొందారు, స్వామి సాక్షాత్కారాన్ని పొంది కృతార్థులైనారు. శ్రీవారి కృప పొందిన ప్రదేశం కనుక వారు ఈ ప్రాంతాన్ని కృపావతిగా నామకరణం చేశారు. ఆ కృపావతి కురుపగా, కుడపగా క్రమేపి కడపగా ప్రసిద్ధి చెందింది. శ్రీవారి దర్శనాన్ని పొందిన కృపాచార్యులు తన వలే తిరుమల క్షేత్రానికి వెళ్లలేని నిస్సహాయుల కొరకు తిరుమల శ్రీవారి ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రతిష్టించారు. శ్రీవారి ఆదేశానుసారం హనుమంతుడి విగ్రహం ముందు ప్రతిష్ఠించబడిన శ్రీ వెంకటేశ్వర స్వామి భక్త వత్సలుడై ఇక్కడ పూజలు అందుకుంటున్నాడు. నాటి నుంచి తిరుమల శ్రీవారిని దర్శించడానికి వెళ్లే భక్తులు ముందుగా దేవుని కడప శ్రీవారిని దర్శించి తిరుమలకు వెళ్లడం ఆచారంగా మారిపోయింది.


ఇంతటి ఘన చరిత్ర కలిగిన కడప పేరును మార్పు చేయడం సబబు కాదని, ఇప్పటికైనా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించి… కడప పేరును యదాతథంగా మార్చాలని మంత్రి డిమాండ్ చేశారు. మరి ఈ విషయంపై జగన్ ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాలి.

Related News

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Big Stories

×