Big Stories

Chandrababu: నేరాలు, ఘోరాలు చేయడంలో జగన్ పీహెచ్‌డీ చేశారు: చంద్రబాబు

Chandrababu: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన జగన్ చేతులెత్తేశారని టీడీపీ అధినేత చంద్రబాబు విమర్శించారు. వైసీపీ మేనిఫెస్టోతో పోల్చితే.. టీడీపీ మేనిఫెస్టో సూపర్ సక్సెస్ అని తెలిపారు. కూటమి అధికారంలోకి రాగానే అంగన్వాడీలు, హోంగార్డులు, ఉపాధ్యాయులకు న్యాయం చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు.

- Advertisement -

సీఎం జగన్ గతంలో ఇచ్చిన హామీల్లో ఒక్కటైనా నెరవేర్చారా అంటూ నెల్లూరు జిల్లా ఆత్మకూరులో నిర్వహించిన ప్రజాగళం సభలో చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ రూ.14 లక్షల కోట్లు అప్పు చేశారని వెల్లడించారు. గోదావరి పూర్తి చేస్తామని చెప్పి.. ఆ మాటలను గోదావరిలోనే కలిపేశారంటూ విమర్శించారు.

- Advertisement -

గులకరాయితో హత్యాయత్నం చేశారంటూ తనపై వైసీపీ నిందలు వేసిందని అన్నారు. గతంలో కూడా కోడి కత్తి కేసులోనూ ఇలాంటి తప్పుడు ఆరోపణలు తనపై చేశారని వెల్లడించారు. బ్యాండేజ్ తీయకుండా డ్రామాలు చేద్దామని జగన్ అనుకోగా.. ప్రజలు హేళన చేయడంతో ఇవాళ బ్యాండేజ్ తీశారని అన్నారు. అయితే జగన్ బ్యాండేజ్ తీసిన తర్వాత గాయం గుర్తులు ఎవరికైనా కనిపించాయా అంటూ ఎద్దేవా చేశారు.

అధికారంలోకి వచ్చిన వారం రోజుల్లోనే సీపీఎస్ రద్దు చేస్తామన్న హమీ ఇప్పుడు ఏమైందన్నారు. రాష్ట్రంలో ఉత్తరకొరియా పరిస్థితి ఏర్పడిందని ఎద్దేవా చేశారు. ఉద్యోగాలు ఇస్తామనే హామీ వైసీపీ మేనిఫెస్టోలో లేదని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం రాగానే తొలి సంతకం డీఎస్సీపైనే చేస్తామని మరోసారి స్పష్టం చేశారు.

రాష్ట్రాన్ని టీడీపీ అభివృద్ధి భాటలో నడిపిస్తే.. వైసీపీ దాన్ని అరాచకంగా మారస్తోందని చంద్రబాబు విమర్శించారు. తమ పాలన స్వర్ణయుగం లాంటిదని.. అదే వైసీపీ పాలన రాతియుగంతో సమానమైనదని ఎద్దేవా చేశారు. సీఎం జగన్ ఈరోజు చేతులెత్తేశారని చంద్రబాబు ఆరోపించారు. వైసీపీ మేనిఫెస్టోతో పోల్చితే.. టీడీపీ మేనిఫెస్టో సూపర్ సక్సెస్ అని అన్నారు.

Also Read: ‘ఆ ఒక్క మాటివ్వండి అన్నా’.. జగన్‌కు వైఎస్ షర్మిల బహిరంగ లేఖ

జగన్ నేరాలు, ఘోరాలు చేయడంలో పీహెచ్‌డీ చేశారని విమర్శించారు. వైసీపీ మేనిఫెస్టోలో రైతులకోసం ఒక్క హామీ కూడా ఇవ్వలేదన్నారు. జగన్ తన స్వార్థం కోసం మహిళల తాళిబొట్టు కూడా తెంపేసిన వ్యక్తి అని ఆరోపించారు. జగన్ నవరత్నాలు.. నవమోసాలు అయ్యాయని విమర్శించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News