E-Paper
Advertisement

Nothing Phone (2a) New Edition : నథింగ్ (2a) నుంచి న్యూ ఎడిషన్.. ఛేంజెస్ ఇవే!

Nothing Phone (2a) New Edition : నథింగ్ (2a) నుంచి న్యూ ఎడిషన్.. ఛేంజెస్ ఇవే!
Advertisement

Nothing Phone (2a) New Edition : టెక్ కంపెనీ నథింగ్ ఇటీవలే స్మార్ట్‌ఫోన్ (2a)ను మిడ్ రేంజ్ సెగ్మెంట్‌లో విడుదల చేసింది. దేశీయ మార్కెట్‌లో ఈ ఫోన్‌ను ఆఫర్డ్‌‌బుల్ ప్రై‌జ్‌లో అనేక లేటెస్ట్ ఫీచర్లను కంపెనీ అందించింది. అయితే ఇప్పుడు ఈ ఫోన్‌ను కొత్త ఎడిషన్‌లో తీసుకురావాలని కంపెనీ ప్లాన్ చేస్తోంది. త్వరలో విడుదల కాబోతున్న ఫోన్ టీజర్‌ను నథింగ్ విడుదల చేసింది. ఈ టీజర్‌లో మొబైల్ డిజైన్ కూడా చూడొచ్చు. ఈ ఫోన్‌లో ఎటువంటి ప్రత్యేక ఫీచర్లు ఉంటాయో ఇప్పుడు తెలుసుకోండి.

నథింగ్ విడుదల చేసిన టీజర్ ప్రకారం PacManPro కోడ్‌నేమ్, A142P మోడల్ నంబర్‌తో ఫోన్‌ను గుర్తించవచ్చు. ఇది చూడటానికి 2a ప్రో లేదా ప్లస్ వేరియంట్‌ను పోలి ఉంటుంది. ప్రముఖ ఈ కామర్స్ ప్లాట్‌ఫామ్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో ఫోన్ తీసుకొస్తున్నట్లు వెల్లడించారు. ఫోన్ ఈ సైట్‌లోనే లైవ్ కూడా అవుతుంది. ఈ ఫోన్ ఫీచర్లు, స్పెసిఫికేషన్లను ఇక్కడ చూడొచ్చు.

Advertisement

Also Read : అదిరిందయ్యా.. రెడ్‌మీ నుంచి 200 MP కెమెరా ఫోన్! 

అయితే దాని వివరాలు కొన్ని ఇక్కడ వెల్లడించలేదు. ఫోన్ (2a) అల్టిమేట్ వెర్షన్ కోసం గత నెలలో కమ్యూనిటీ ఎడిషన్ ప్రాజెక్ట్‌ను ఏమీ ప్రారంభించలేదు. దాని మొదటి వేరియంట్ సేల్ పూర్తయిన తర్వాత కంపెనీ (2a) న్యూ వెర్షన్ హార్డ్‌వేర్ డిజైన్‌ను వెల్లడించింది. ఫాస్ఫరస్ కాన్సెప్ట్ అది ఫాస్ఫోరేసెంట్ మెటీరియల్ ఫినిషింగ్‌ను కలిగి ఉంటుందని సూచిస్తుంది.

Advertisement

నథింగ్ ఫోన్ (2a) స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే ఇందులో 6.7 ఇంచెస్ ఫుల్ హెచ్‌‌డీ ప్లస్ సూపర్ అమోలెడ్ డిస్‌ప్లే ఉంటుంది.ఇది 120 Hz రిఫ్రెష్ రేట్‌కు సప్టోర్ట్ చేస్తుంది. డిస్‌ప్లేకి కోరింగ్ గొరిల్లా గ్లాస్ 5.10 బిట్ ప్రొటెక్షన్ ఉంటుంది. ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆపరేటింగ్ సిస్టమ్‌పై రన్ అవుతుంది. మెడిటెక్ Dimensity 7200 Pro ఆక్టాకోర్ ప్రాసెసర్ ఉంది. ఇది ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 5000mAh బ్యాటరీని కలిగి ఉంది. వెనుక ప్యానెల్‌లో ఆకర్షణీయమైన డిజైన్‌తో 50MP ప్రైమరీ కెమెరా చూడొచ్చు. దీని 8 GB RAM+ 128 GB వేరియంట్ ధర రూ. 23,999గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ నుంచి దీన్ని కొనుగోలు చేయవచ్చు.

Tags

Related News

iPhone 18 Pro కొనేముందు ఈ ఒక్క విషయం తెలుసుకోండి.. లేదంటే లబోదిబోమనాల్సిందే!

రూ.1,699కే బెస్ట్ పోర్టబుల్ స్పీకర్ ఇదే! ఇల్లు దద్దరిల్లే సౌండ్ గ్యారంటీ

బెస్ట్ విండోస్ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఈ మోడల్‌పై ఓ లుక్కేయండి

మెడలో వేసుకుంటే చాలు.. మన మైండ్‌లో ఏముందో చెప్పేసే ఏఐ రోబోట్ వచ్చేసింది!

బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్‌టాప్ కోసం చూస్తున్నారా? ఆఫీస్, స్టూడెంట్స్‌కు పర్ఫెక్ట్

రూ.9,490కే ఫ్రిజ్..సింగిల్ రూమ్స్, బ్యాచిలర్స్‌కు బెస్ట్!

తక్కువ ధరలో బెస్ట్ బ్రాండెడ్ వాచ్.. రెడ్‌మీ నుంచి మార్కెట్‌ను షేక్ చేసే కొత్త మోడల్!

Huawei Watch GT 7 సిరీస్ లాంచ్.. 21 రోజుల బ్యాటరీ, అద్భుతమైన ఫీచర్లు!

Big Stories

Advertisement
×