TDP Mahanadu 2025: తెలుగుదేశం పార్టీ కీలక నేత, మాజీ ఎమ్మెల్యే జలీల్ ఖాన్ అస్వస్థతకు గురయ్యార. గురువారం కడపలో జరుగుతున్న మహానాడు సమావేశాల్లో ఆయనకు అస్వస్థత కలగడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. సభ మధ్యలో ఆయనకు ఒక్కసారిగా అసౌకర్యంగా అనిపించడంతో పార్టీ శ్రేణులు వెంటనే స్పందించారు. పక్కనే ఉన్న నేతలు, కార్యకర్తలు వెంటనే ఆయనను మద్దతుగా తీసుకొని సభ ప్రాంగణం వెలుపలికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ప్రాథమిక పరీక్షలు నిర్వహించి, అతని ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వెల్లడించారు. అధిక ఉష్ణోగ్రత, దాహం, అలసట కారణంగా తల తిరగడం జరిగిందని ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. ఈ సంఘటన నేపథ్యంలో కొంతసేపు సభలో కలవరం నెలకొనింది. అయితే తర్వాత మళ్లీ సభ సాధారణ స్థితికి వచ్చింది. జలీల్ ఖాన్ త్వరలోనే కోలుకుని తిరిగి సమావేశాల్లో పాల్గొంటారని టీడీపీ వర్గాలు ఆశాభావం వ్యక్తం చేశాయి. జలీల్ ఖాన్ ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు స్పష్టం చేశారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు.