Movies in June: సినిమాలో రిలీజ్ విషయంలో దర్శక నిర్మాతలు ఎంతో ఆలోచించి వారి సినిమాలను రిలీజ్ చేస్తుంటారు. అయితే కొన్నిసార్లు మాత్రం సినిమాలో విడుదల విషయంలో ఉంటే అతివృష్టి లేదంటే అనావృష్టిగా మారిపోతుంది. ఒక్కోసారి స్టార్ హీరోలందరి సినిమాలు వరుసగా విడుదలవుతూ బాక్సాఫీస్ వద్ద పెద్ద ఎత్తున పోటీ పడుతూ ఉంటాయి. లేదంటే థియేటర్లన్నీ కూడా ఖాళీగానే దర్శనమిస్తాయి. ఇక జూన్(June) నెలలో పెద్ద ఎత్తున స్టార్ హీరోల సినిమాలు వారం వ్యవధిలోగా వరుసగా విడుదలకు సిద్ధమవుతున్నాయి.
కలెక్షన్లపై ప్రభావం తప్పదు…
ఇలా స్టార్ హీరోల సినిమాలన్నీ వరుసగా విడుదల అయితే పెద్ద ఎత్తున చిక్కులు ఏర్పడతాయి. సినిమా రిలీజ్ అయిన తర్వాత పాజిటివ్ టాక్ తెచ్చుకుంటే ప్రేక్షకులు కుదిరినప్పుడు సినిమాలకు వెళ్లి చూసి వస్తారు .అలా కాకుండా హిట్ టాక్ సొంతం చేసుకుంటే థియేటర్లు సర్దుబాటు కాక కలెక్షన్ల పై పూర్తిస్థాయిలో ప్రభావాన్ని చూపుతుంది. ఇలా ఎన్నో హిట్ సినిమాలు ఈ విధమైనటువంటి సమస్యలను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. సాధారణంగా స్టార్ హీరోలు అందరూ కూడా వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ తమ సినిమాలను విడుదల చేస్తారు.
జూన్ నెలను టార్గెట్ చేసిన స్టార్స్…
ఈ ఏడాది వేసవి సెలవులను టార్గెట్ చేస్తూ ఏ ఒక్క హీరో కూడా తమ సినిమాను విడుదల చేయలేదు. నేటి వరకు థియేటర్లని ఖాళీగానే ఉన్నాయి అయితే మే 30వ తేదీ భైరవం, షష్టిపూర్తి సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఈ సినిమాలతో పాటు మహేష్ బాబు హీరోగా నటించిన ఖలేజా సినిమాని కూడా తిరిగి విడుదల చేస్తున్నారు. ఈ సినిమాకు భారి స్థాయిలోనే స్పందన వస్తోంది. ఇక విడుదల తర్వాత ఎలాంటి కలెక్షన్స్ రాబడుతుందో తెలియాల్సి ఉంది. ఇలా మే నెలను ఈ సినిమాలు పూర్తి చేయగా జూన్ నెలలో మాత్రం కమల్ హాసన్, పవన్ కళ్యాణ్, మంచు విష్ణు, ధనుష్ ఈ నలుగురు హీరోలు పోటీ పడబోతున్నారు.
కమల్ హాసన్(Kamal Hassan) హీరోగా నటించిన థగ్ లైఫ్ చిత్రం జూన్ 5వ తేదీ వివిధ భాషలలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక పవన్ కళ్యాణ్ (Pawan Kalyan)నటించిన హరిహర వీరమల్లు సినిమా కూడా జూన్ 12వ తేదీ భారీ స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న నేపథ్యంలో ఈ సినిమాపై కూడా అదే స్థాయిలో అంచనాలు ఉన్నాయి. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయిన తర్వాత విడుదల కాబోతున్న చిత్రం కావడంతో ఈ సినిమాలపై అభిమానులు భారీ అంచనాలను పెంచుకున్నారు. ఇక వీరితోపాటు మంచు విష్ణు(Manchu Vishnu) తన డ్రీం ప్రాజెక్ట్ అయిన కన్నప్ప సినిమా ద్వారా రాబోతున్నారు. ఈ సినిమా జూన్ 27వ తేదీ పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ధనుష్ (Danush) సైతం జూన్ 20వ తేదీ కుబేర సినిమా ద్వారా రాబోతున్నారు. ఇలా ఈ నలుగురు స్టార్ హీరోలు ఒకే నెలలో వారం వ్యవధిలోగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ నాలుగు సినిమాలలో ఏ ఒక్క సినిమా హిట్ టాక్ సొంతం చేసుకున్న మిగిలిన హీరోల సినిమాలపై పూర్తిస్థాయిలో ప్రభావం పడుతుంది. మరి ఈ పోటీలో సక్సెస్ అందుకునే హీరో ఎవరు? ఎవరి స్టామినా ఎంత అనే విషయం తెలియాలి అంటే వెయిట్ చేయాల్సిందే.