TDP likely to field gandi babji against Botsa in Visakha MLC Elections 2024: ఏపీలో విశాఖ రాజకీయం హాట్ టాపిక్ గా మారింది. ఒకవైపు జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక.. మరోవైపు స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికలతో పాలిటిక్స్ హీటెక్కాయి. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు రంగం సిద్ధం అవుతుంది. నేడు ఎన్నికల నోటిఫికేషన్ విడుదల కానుండగా.. 30 తేదీన పోలింగ్ జరగనుంది. వైసీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి బొత్స బరిలోకి దిగుతుండగా.. కూటమి తరపున ఇంకా ఫైనల్ కావలసి ఉంది. అభ్యర్ధి విషయంలో సీఎం చంద్రబాబు నిర్ణయం ఎలా ఉండబోతుంది ? జగన్ బొత్సను రేసుల ఉంచడానికి కారణాలు ఏంటి ? ఎవరికి ఎన్ని ఓట్లు ఉన్నాయి.. గెలుపు ఎవరిదో తెలుసుకోవాలంటే వాచ్ థిస్ స్టోరీ..
ఉమ్మడి విశాఖ జిల్లా స్థానిక సంస్థల ఎన్నికలకు నగారా మోగింది. ఈనెల 30వ తేదీ ఎన్నికల పోలింగ్ జరగనుంది. దీంతో ఓ వైపు అధికారులు ఎన్నికలకు ఏర్పాట్లు చేస్తుంటే.. ఆయా పార్టీలు అభ్యర్ధిపై ఫోకస్ పెట్టాయి. ప్రస్తుత విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ యాదవ్.. స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా వైసీపీ నుంచి గెలిచి ఎన్నికల ముందు జనసేన పార్టీలో జాయిన్ అయ్యారు. దీంతో మండలి చైర్మన్ ఎమ్మెల్సీగా వంశీపై వేటు వేశారు. దాంతో ఎమ్మెల్సీ ఉప ఎన్నిక అనివార్యం కావడంతో.. రాష్ట్ర ఎన్నికల కమిషన్ పోలింగ్ నిర్వహణకు సిద్దమయ్యింది.
స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికకు ఈరోజు నోటిఫికేషన్.. ఆగస్టు 13న నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఆగస్టు 14న నామినేషన్ల పరిశీలన.. 6వ తేదీన నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. ఆగస్టు 30న ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు.. ఉమ్మడి జిల్లాలోని ఎంపీటీసీలు, జడ్పీటీసీలు, కార్పొరేటర్లు, మున్సిపాలిటీల కౌన్సిలర్లు.. ఓటు హక్కు వినియోగించుకుని ఎమ్మెల్సీ అభ్యర్థిని ఎన్నుకోనున్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత జరుగుతున్న మొదటి పోలింగ్ కావడంతో.. కూటమి పార్టీలు, వైసీపీ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఈ క్రమంలోనే ఏఏ పార్టీకి ఎంత బలం ఉందో అని చర్చ జరుగుతోంది.
ఉమ్మడి విశాఖ జిల్లాలో మొత్తం 39 మంది జడ్పీటీసీ స్థానాలు ఉండగా.. వాటిలో మూడు స్థానాలు ఖాళీగా ఉన్నాయి. దాంతో 36 మంది ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. వీరిలో 34 మంది జడ్పీటీసీలు వైసీపీకి.. నర్సీపట్నం జడ్పీటీసీ టీడీపీకి.. అనంతగిరి జడ్పీటీసీ సీపీఎం పార్టీకి ఉన్నారు. ఇక ఎంపీటీసీల విషయానికొస్తే 652 మంది ఎంపీటీసీలకు గాను.. 636 మంది ప్రస్తుతం ఓటర్లుగా ఉన్నారు. 16 ఎంపీటీసీలు ఖాళీగా ఉన్నాయి. అలానే విశాఖ కార్పొరేషన్ నుంచి 98 మంది కార్పొరేటర్లు కూడా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. ప్రస్తుత విశాఖ సౌత్ ఎమ్మెల్యే వంశీకృష్ణ.. కార్పొరేటర్ గా పోటీ చేసి గెలిచి రాజీనామా చేయడంతో ఆ స్థానానికి మళ్లీ ఎన్నిక జరగలేదు. దీంతో 97 మంది కార్పొరేటర్లకు ఓటు హక్కు ఉంది. వీరందరితో పాటుగా ఉమ్మడి విశాఖ జిల్లాలో ఉన్న ఎలమంచిలి మున్సిపల్ కౌన్సిలర్లు 25 మంది.. నర్సీపట్నం మున్సిపల్ కౌన్సిలర్లు 28 మంది కూడా ఓటు వేసేందుకు అర్హులుగా ఉన్నారు.
మొత్తంగా ఇప్పుడు 822 మంది ఓటర్లుగా ఉన్నారు. గత ప్రభుత్వం హయాంలో స్థానిక సంస్థల ఎన్నికలు ఏకపక్షంగా జరగడంతో 90 శాతానికి పైగా స్థానాలు వైసీపీ గెలుచుకుంది. గత ఎన్నికల్లో పోటీ చేయకపోయినా టీడీపీ, జనసేన అభ్యర్థులు.. 123 మంది ఇండిపెండెంట్ లుగా పోటీ చేసి గెలిచారు. రీసెంట్ గానే 12 మంది విశాఖ కార్పొరేటర్లు.. టీడీపీలో, జనసేనలో జాయిన్ అయ్యారు. ప్రస్తుతం వైసీపీ మీద ఉన్న వ్యతిరేకతతో మరొక 102 మందికి పైనే టీడీపీలో చేరే అవకాశం ఉందని అంటున్నారు. దీంతో మొత్తంగా వైసీపీకి 585 మంది.. టీడీపీ కూటమికి 237 మంది ఓటర్లు ఉన్నారు. కూటమి పార్టీలు అధికారంలో ఉండడంతో.. మరో 200 మందిని తమ వైపునకు తెచ్చుకునే ఛాన్స్ ఉందని భావిస్తున్నారు. దీంతో కచ్చితంగా వైసీపీ, టీడీపీ కూటమి క్యాంపు రాజకీయాలకు తెరలేపే అవకాశం కనిపిస్తుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
ఘోర పరాభవం తర్వాతహ జరుగుతున్న ఎన్నిక కావడంతో ఈ పోటీని ఇరు వర్గాలు పోటాపోటీగా తీసుకున్నాయి. వైసీపీ తరపున మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ బరిలో ఉన్నారు. బొత్స అయితే ఉత్తరాంధ్ర మొత్తానికి పట్టున్న నాయకుడిగా పేరు ఉండడం.. చాలామంది ఎంపీటీసీ, జడ్పీటీసీలు బొత్స అండతోనే సీట్లు సంపాదించి గెలుపొందడం ఆయనకు కలిసొచ్చే అంశాలుగా భావిస్తున్నారు. ఆలయం ఏపార్టీ మారాలనుకునే నేతలను కూడా బొత్స ఆపగలరని జగన్ భావిస్తున్నారట. మరోవైపు గత కొన్ని రోజులుగా బొత్స.. పార్టీ మారతారనే ప్రచారం జోరుగా జరుగుతోంది. ఈ సమయంలోనే ఎమ్మెల్సీ స్థానాన్ని ప్రకటిస్తే.. పార్టీ మారాకుండా కూడా ఆపవచ్చని ఈ రకంగా జగన్ వ్యవహరించినట్టు టాక్ నడుస్తోంది.
Also Read: వైసీపీలో ప్రక్షాళన.. జగన్ కీలక నిర్ణయం
ఈ క్రమం లోనే వైసీపీ కార్పొరేటర్లతో వైవీ సుబ్బారెడ్డి సమావేశమయ్యారు. జీవీఎంసీ స్టాండింగ్ కమిటీ ఎన్నిక నేపథ్యంలో నేతలకు దిశానిర్దేశం చేశారు. అలానే స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికపైనా చర్చించారు. కొంత మంది కార్పొరేటర్లు పార్టీ మారినప్పటికీ.. తమ ప్రణాళిక తమలకు ఉందని వ్యాఖ్యానించారు. 80 శాతం కన్నా ఎక్కువ మంది వైసీపీకి మద్దతుగా ఉంటే.. టీడీపీ కూడా పోటీకి రావడం చూస్తుంటే వారు ఏ స్థాయిలో రజకీయం చేస్తున్నారో అర్ధం అవుతుందని వైవీ సుబ్బారెడ్డి అన్నారు.
ఇక వైసీపీ అభ్యర్ధిగా బొత్స పేరు ప్రకటించడంతో.. కూటమి డైలమాలో పడింది. టీడీపీ కూటమికి ఇప్పుడున్న 237 ఓట్లకు.. మరొక 200 ఓట్లు అవసరం కావడంతో అందరికీ తెలిసిన వ్యక్తితో పాటు ఆర్థికంగా బలమైన వ్యక్తిని బరిలో నిలపాలని సీఎం చంద్రబాబు ఆలోచిస్తున్నారట. ఇప్పటికే విశాఖ సౌత్ సీటు వదులుకున్న గండి బాబ్జి, అనకాపల్లి సీటు త్యాగం చేసిన పీలా గోవిందు.. భీమిలిలో గంట గెలుపులో కీలకంగా ఉన్న కోరాడ రాజబాబు పేర్లు పరిశీలనలో ఉన్నట్టు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. విశాఖ సౌత్ నుంచి వంశీకృష్ణని ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించిన వెంటనే.. బాబ్జీ టీడీపీకి రాజీనామా చేశారు. కానీ బాబు బుజ్జగింపులతో మళ్లీ పార్టీలో కొనసాగారు. దాంతో గండి బాబ్జిని ప్రకటించడం ఖాయమని భావిస్తున్నారు. చంద్రబాబుతో పాటు పవన్ ఆశీస్సులు కూడా తనకే ఉన్నాయని.. దాంతో గెలుపు పట్ల బాబ్జీ సైతం ధీమా వ్యక్తం చేస్తున్నారని అనుకుంటున్నారు.
ప్రస్తుతం బలాబలగాల నేపధ్యంలో ఈజీ విక్టరీ అని వైసీపీ భావిస్తుంటే.. మరో 200 మంది తమ పార్టీలో జాయిన్ అయితే ఎమ్మెల్సీ స్థానాన్ని గెలుచుకోవడం ఈజీ అని టీడీపీ అభిప్రాయపడుతోంది. మరి ఇప్పటికే వైసీపీ తరపున బొత్స పోటీలో ఉండగా.. టీడీపీ ఎవరిని బరిలోకి దింపుతోంది. తమ అభ్యర్ధిని గెలిపించుకునేందుకు చంద్రబాబు ఏం ప్లాన్ చేస్తున్నారని సర్వత్రా చర్చ జరుగుతోంది.