E-Paper
Advertisement

Rajini Vidadala: RRR కేసును తలపించేలా మాజీ మంత్రి విడదల రజినీపై కేసు నమోదు? ఎస్పీకి ఫిర్యాదు చేసిన భాదితులు

Rajini Vidadala: RRR కేసును తలపించేలా మాజీ మంత్రి విడదల రజినీపై కేసు నమోదు? ఎస్పీకి ఫిర్యాదు చేసిన భాదితులు
Advertisement

Rajini Vidadala: ఓ వైపు పోలీసుల దెబ్బలు తగులుతుంటే, మరో వైపు సెల్ ఫోన్ లో ఆ దృశ్యాలు చూసి ఆనందపడ్డారట. ఈ మాటలు విని వెంటనే ఉండి ఎమ్మేల్యే రఘురామ కృష్ణంరాజు కేసు గుర్తుకు వచ్చింది కదా.. ఔను అదే తరహాలో వైసీపీకి చెందిన మహిళా నేత, మాజీ మంత్రి కూడా టీడీపీ కార్యకర్తలను పోలీసులు కొడుతుండగా, సెల్ ఫోన్ ద్వారా లైవ్ దృశ్యాలను చూస్తూ పరవశించి పోయారట. ఇంతకు ఆ మాజీ మంత్రి ఎవరంటే విడదల రజిని. ఈ ఆరోపణలు చేసింది ఎవరంటే టీడీపీ కార్యకర్త పిల్లి కోటి.

అంతా సేమ్ టు సేమ్. సీన్ టు సీన్ అంతా ఒకటే. కానీ రఘురామకృష్ణం రాజు కేసును పోలినట్లే. తనను పోలీసులు అరెస్ట్ చేసిన సమయంలో, ముసుగులు ధరించిన వ్యక్తులు వచ్చి తనను కొట్టారని, అయితే తనను కొడుతున్న దృశ్యాలను సెల్ ఫోన్ ద్వారా ఎవరో పెద్దాయన చూసి పరవశించి పోయాడంటూ ఉండి ఎమ్మెల్యే త్రిబుల్ ఆర్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ కేసు అంతు తేల్చే పనిలో పోలీసులు కూడా స్పీడ్ పెంచారు. ఇదే తరహాలో తనను కూడా కొట్టారంటూ చిలుకలూరిపేటకు చెందిన టీడీపీ కార్యకర్తలు తాజాగా పల్నాడు ఎస్పీ కి ఫిర్యాదు చేశారు.

Advertisement

చిలుకలూరిపేటకు చెందిన పిల్లి కోటి, పలువురు టీడీపీ శ్రేణులు బుధవారం పల్నాడు ఎస్పీని కలిశారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో మాజీ మంత్రి విడదల రజిని, టీడీపీ కార్యకర్తలను ఎన్నో ఇబ్బందులకు గురి చేసినట్లు బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. తమను చిత్రహితులకు గురి చేస్తున్న దృశ్యాలను లైవ్ లో చూస్తూ విడదల రజిని పైశాచిక ఆనందం పొందినట్లు టీడీపీ శ్రేణులు ఆరోపించారు.

Also Read: Lady Aghori: రోడ్డు మీద శవం.. అఘోరీ మాత ఎంటర్.. అలా చేస్తారని మీరు ఊహించరు కూడా..

Advertisement

తెలుగుదేశం పార్టీ కోసం పనిచేస్తే చంపేస్తామని నాడు బెదిరింపులకు దిగారని, రామకృష్ణ, ఫణీంద్ర, అప్పటి చిలకలూరిపేట సీఐ సూర్యనారాయణ, రజిని పీఎ లపై చట్టరీత్యా చర్యలు తీసుకోవాలని వారు పల్నాడు ఎస్పీ శ్రీనివాసరావును కోరారు. ఇటీవల వైసీపీ సోషల్ మీడియా యాక్టివిస్టుల అరెస్టుల పర్వం ఏపీలో సాగుతుండగా, మాజీ మంత్రి విడదల రజిని, పలువురిపై టీడీపీ నేతలు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది. మరి ఈ కేసును పోలీసులు ఏ రీతిలో దర్యాప్తు చేస్తారో తేలాల్సి ఉంది.

Related News

మాజా డ్రింక్‌లో పురుగు.. నాలుగేళ్ల బాలుడికి తప్పిన ప్రమాదం, వీడియో వైరల్..!

తెలంగాణలో దంచికొడుతున్న వానలు.. రేపు ఆ 11 జిల్లాలకు భారీ వర్ష సూచన!

కేంద్రంపై ఒత్తిడి తేవాల్సిందే.. సీఎం చంద్రబాబుకు వైఎస్ షర్మిల 2 పేజీల లేఖ!

Registration Centres: ఏపీ రిజిస్ట్రేషన్ శాఖలో కీలక సంస్కరణలు.. RSK పేరుతో సేవలు..!

ఆక్వా కల్చర్‌ను ఆదుకోండి.. ముగ్గురు కేంద్ర మంత్రులకు సీఎం చంద్రబాబు లేఖలు!

Gym Trainer: అమరావతిలో ఘోరం.. యువతి పై జిమ్ ట్రైనర్ లైంగిక దాడి కలకం

Galla Madhavi Vs Ambati: రాబందుల మాదిరిగా.. అంబటిపై పరువు నష్టం దావా- ఎమ్మెల్యే గళ్ళా మాధవి

భోగాపురం ఎయిర్‌పోర్టు అంతా రెడీ.. 100 ఏసీ బస్సులు, విశాఖకు చేరుకున్న బస్సులు

Big Stories

Advertisement
×