BigTV English

Coolie: కూలీ రిలీజ్ డేట్ ఫిక్స్.. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావ్ లోకేష్.. ?

Coolie: కూలీ రిలీజ్ డేట్ ఫిక్స్.. బాగా పకడ్బందీగా ప్లాన్ చేసావ్ లోకేష్.. ?

Coolie: సాధారణంగా ప్రతి సినిమా రిలీజ్ డేట్ లాక్ చేయడం వెనుక చాలా కారణాలు ఉంటాయి. ఆర్థిక లావాదేవీలు ఉంటాయి. బిజినెస్ లెక్కలు ఉంటాయి. వీకెండ్ వస్తుందా.. ? వేరే సినిమాలు పోటీ ఉన్నాయా.. ? హాలీడేస్ ఉన్నాయా.. ? బిజినెస్ ఎంత వస్తుంది.. ? ఇలా చాలా లెక్కలు వేసుకున్నాకే రిలీజ్ డేట్ ను అనౌన్స్ చేస్తారు. ప్రస్తుతం కూలీ సినిమా కూడా ఈ లెక్కలన్నీ బేరీజు వేసుకొని ఒక డేట్ ను లాక్ చేసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.


ప్రస్తుతం ఇండస్ట్రీలో ఈగర్ గా వెయిట్ చేస్తున్న చిత్రం కూలీ. సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాపై అంత హైప్ రావడానికి కారణం.. అన్ని భాషల్లోని హీరోలను లోకీ.. కూలీలో దింపుతున్నాడు.

Satya Sri : సొంతింట్లోకి అడుగుపెట్టిన జబర్దస్త్ బ్యూటీ.. అంత డబ్బుల ఎలా వచ్చాయబ్బా..?


అక్కినేని నాగార్జున, ఉపేంద్ర, శృతి హాసన్, సత్యరాజ్, సౌబిన్ షాహిర్ .. ఇలా స్టార్స్ ను ఈ సినిమాలో భాగం చేయడంతో అన్ని భాషల్లో  కూలీపై ఒక్కసారిగా అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన వీరి పోస్టర్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.

కూలీ చిత్రంలో రజినీ గోల్డ్  స్మగ్లర్ గా కనిపించబోతున్నాడు.  బంగారం అక్రమ రవాణా నేపథ్యంలో సాగే కథగా కూలీ తెరకెక్కుతోందని లోకేష్ చెప్పుకొచ్చాడు.  ఇక  ఈ సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా.. ? అని ఫ్యాన్స్ వెయ్యి కళ్ళతో ఎదురుచూస్తున్నారు. తాజాగా అందుతున్న  సమాచారం ప్రకారం.. లోకేష్ ఒక ఫర్ఫెక్ట్ రిలీజ్ డేట్ ను లాక్ చేసినట్లు తెలుస్తుంది. 2025 మే 1 న కూలీని రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారని కోలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.

VD12: రౌడీ హీరో కోసం రంగంలోకి నందమూరి హీరో.. ఇది అస్సలు ఊహించలేదే..?

మే 1 .. కార్మికుల దినోత్సవం. కూలీ టైటిల్ కు, సినిమా రిలీజ్ కు పర్ఫెక్ట్  సమయమని చెప్పొచ్చు. మేడే ఈసారి గురువారం వచ్చింది. అయినా ఆరోజే రిలీజ్ చేయడానికి సై అంటున్నారట. గురు, శుక్రు, శని, ఆదివారాలు కలిసివస్తాయని, అందుకే ఆ రోజునే లాక్ చేయనున్నట్లు సమాచారం. నిజంగా ఇది మంచి ప్లాన్ అనే చెప్పాలి. మే  మొదటి వారంలో ఎలాంటి పెద్ద సినిమాలు రిలీజ్ కు లేవు.

ఎలాగో తమిళ్ లో రజినీకి, తెలుగులో నాగ్ కి ఎంత ఇమేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అది కూడా నాగ్ – రజినీ కాంబో అంటే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అందరికి తెల్సిందే. ఎలాగూ నాలుగురోజులు సెలవులే కాబట్టి.. ఇంకో సినిమాలు కూడా పోటీకి లేవు కాబట్టి  కలక్షన్స్ మంచిగా వస్తాయని.. లోకేష్ ఈ డేట్ నే ఫిక్స్ చేసాడట.  ఏదిఏమైనా లోకేష్ బాగా పకడ్బందీగా ప్లాన్ చేసాడు. మరి ఈ ప్లాన్ వర్క్ అవుట్ అవుతుందో లేదో చూడాలి.

Related News

Alekhya sisters: ఇదేంట్రా బాబూ.. కుక్కలకు, నక్కలకు జీవితం అంకితం అంటోంది?

Movie Tickets : బుక్ మై షోలో లేని టికెట్స్ డిస్ట్రిక్ట్ యాప్‌లో ఎలా వస్తున్నాయి ?

Save the Tigers 3 : ‘సేవ్ ది టైగర్స్’ మళ్లీ వచ్చేస్తుంది.. ఎమ్మెల్యే గా ఘంటా రవి..

BIG TV Kissik talk Show: ఆ డైరెక్టర్ వల్లే నా కెరీర్ మొత్తం నాశనం.. మండిపడ్డ నటి రాశి

BIG TV Kissik talk Show : పదేళ్లుగా పిల్లలు పుట్టలేదు, చివరికి నా ప్రాణాలు ఫణంగా పెట్టి.. రాశి భావోద్వేగం

Sydney Sweeney: సిడ్నీ స్వీని బాలీవుడ్ ఎంట్రీ.. ఏకంగా రూ.530 కోట్లు ఆఫర్.. కళ్లు తేలేసిన నటి!

BIG TV Kissik talk Show : అతడితో పెళ్లి.. ఇంట్లో చాలా పెద్ద గొడవలు అయ్యాయి – కిస్సిక్ టాక్‌లో రాశి కామెంట్స్

Priyanka Jain: ప్రియాంకకు హ్యాండిచ్చి.. శోభశెట్టితో పులిహోర కలిపిన శివ్, అడ్డంగా బుక్కయ్యాడుగా!

Big Stories

×