BigTV English

AP CM Warning: ఎమ్మెల్యేలకు బాబు స్ట్రాంగ్ వార్నింగ్.. అందులో వేలు పెట్టారో.. ఒప్పుకోనంటూ హెచ్చరిక

AP CM Warning: ఎమ్మెల్యేలకు బాబు స్ట్రాంగ్ వార్నింగ్.. అందులో వేలు పెట్టారో.. ఒప్పుకోనంటూ హెచ్చరిక

AP CM Warning: ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడి వంద రోజులు పూర్తి చేసుకున్న అనంతరం తొలిసారిగా సీఎం చంద్రబాబు నాయుడు, పార్టీ ఎమ్మెల్యేలతో సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశం పూర్తిగా ఎమ్మెల్యేలకు స్ట్రాంగ్ వార్నింగ్ లతోనే సాగినట్లుగా భావించవచ్చు. ఎవరైనా గీత దాటితే చర్యలు తప్పమంటూ హెచ్చరించిన చంద్రబాబు.. తనదైన శైలిలో ప్రసంగాన్ని ఇచ్చారు.


మంగళగిరిలోని పార్టీ కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఎమ్మెల్యేల భేటీ సమావేశానికి సీఎం చంద్రబాబు హాజరై మొదటగా దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యేలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ.. దేశంలో ఎవరికి రాణి మెజారిటీ కూటమికి దక్కిందని, విజయాన్ని సాధించాం కాబట్టి రిలాక్స్ కావద్దంటూ సూచించారు. నేతల మధ్య భేదాభిప్రాయాలు ఉండడం సహజమని, కానీ హద్దులు దాటితే మాత్రం చర్యలు ఖచ్చితంగా ఉంటాయన్నారు.

వైసీపీ చేసిన తప్పులు చేయవద్దు..
గత ప్రభుత్వం చేసిన తప్పులను మనం చేయవద్దంటూ ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు. వైసీపీ ప్రభుత్వ హయాంలో అరాచక పాలన కొనసాగింది కాబట్టే ఎన్నికల ఫలితాలు కూడా వారికి షాకిచ్చాయన్నారు. రాష్ట్రంలో 85 లక్షల మెట్రిక్ టన్నుల చెత్తను అలానే వదిలి వేశారని, అంతేకాకుండా చెత్త పన్ను వసూలు చేసిన వైసిపి ప్రభుత్వంకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారన్నారు.


Also Read: YS Sharmila: ఆర్టీసీ బస్సెక్కిన వైయస్ షర్మిళ.. కండక్టర్ కు ప్రశ్నల వర్షం.. అంత మాట అనేశారేంటి ?

ప్రధాని మోడీని ప్రశంసించిన చంద్రబాబు
టిడిపి ఎమ్మెల్యేల భేటీలో ప్రధాని నరేంద్ర మోడీని సీఎం చంద్రబాబు ప్రశంసలతో ముంచెత్తారు. మోడీ పట్టుదల వల్లే మూడోసారి కూడా విజయాన్ని అందుకున్నారని, కేంద్రంలో ఎన్డీఏ అధికారంలో ఉండడం తమ అదృష్టంగా భావిస్తున్నట్లు తెలిపారు. ప్రధానిని చూసి పరిపాలనలో ఏ విధంగా పట్టు సాధించాలో ప్రతి ఒక్కరు నేర్చుకోవాలని సూచించారు.

మద్యం వ్యాపారంలో వేలు పెట్టారో..
మద్యం వ్యాపారంలో ఎవరైనా జోక్యం చేసుకున్నట్లు తెలిస్తే సహించను అంటూ చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. ఎమ్మెల్యేలతో సీఎం మాట్లాడుతూ.. ఇప్పటికే ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డి మద్యం వ్యాపారంలో ఉన్నారని, మిగిలిన వారు ఎవరూ కూడా ఆదాయం కోసం ఈ వ్యాపారంలోకి వెళ్లవద్దన్నారు. ఇటీవల మద్యం నూతన విధానం అమలు సమయంలో.. పలు ఆరోపణలు ఎదుర్కొన్న ఎమ్మేల్యేలను దృష్టిలో ఉంచుకొని సీఎం ఈ మాట చెప్పినట్లుగా టీడీపీ క్యాడర్ భావిస్తోంది.

వరద సాయం అడగకుండానే..
విజయవాడ వరదల సమయంలో తమపై ఉన్న నమ్మకంతో రూ.450 కోట్లు విరాళాలుగా వచ్చినట్లు సీఎం చంద్రబాబు అన్నారు. ప్రజలు మనల్ని నమ్మి ఎంతో భాద్యతను అప్పగించారని, అయితే అధికారంలోకి రాగానే సమస్యలు పరిష్కారం కావన్నారు. గత పాలకులపై కేంద్రానికి నమ్మకం లేని స్థితి ఉండేదని, ఎక్కడ చూసినా అవినీతిమయం చేసిందంటూ వైసీపీని ఉద్దేశించి బాబు అన్నారు. వరదల సమయంలో ప్రజలకు ఆర్థిక సాయం అందించి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు.

సూపర్ సిక్స్ అమలుపై సీఎం మాట ఇదే..
ఎన్నికల సమయంలో సీఎం చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాల అమలుపై ప్రజలకు హామీ ఇచ్చారు. ఎమ్మెల్యేల సమావేశంలో సీఎం మాట్లాడుతూ.. ఇచ్చిన ప్రతి హామీ అమలుచేయడమే తమ ముందున్న లక్ష్యమన్నారు. ఇప్పటికే తాము డీఎస్సీ నోటిఫికేషన్, ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దు వంటి అంశాలపై తొలిసంతకం చేశామన్నారు. అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టే ప్రతి పథకం అర్హులకు అందేలా చూడాలన్నారు. అధికారంలోకి వచ్చేందుకు ప్రతి కార్యకర్త శ్రమించారని, పార్టీ క్యాడర్ కాపాడుకొని రావాలన్నారు. ఇలా సీఎం చంద్రబాబు ప్రసంగం సాగినంతసేపు.. ఎమ్మెల్యేలు సైలెంట్ గా ఉండిపోయారు. మొత్తం మీద ఎమ్మేల్యేల భేటీలో సీఎం కాస్త సీరియస్ గానే ప్రసంగించారని చెప్పవచ్చు.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×