BigTV English

Ramgopal Challange to Jagan: జగన్ నీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రా..: రాంగోపాల్

Ramgopal Challange to Jagan: జగన్ నీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రా..: రాంగోపాల్

TDP MLC Ramgopal Reddy Challange to Jagan: వైసీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిపై ఏపీ టీడీపీ ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. చర్చకు రావాలంటూ ఆయన జగన్ కు సవాల్ కూడా విసిరారు. సోమవారం టీడీపీ ఆఫీసులో ఆయన మీడియాతో జగన్ పై మండిపడ్డారు. వైసీపీ హయాంలో అంతా అవినీతే జరిగిందన్నారు. పులివెందులలో సుందీకరణ పేరుతో రూ. వందల కోట్ల అవినీతికి పాల్పడ్డారన్నారు. పులివెందులలో జరిగిన కుంభకోణాలపై బహిరంగ చర్చకు జగన్ సిద్ధమా?.. జగన్ నీకు దమ్ముంటే బహిరంగ చర్చకు రా..’ అంటూ ఆయన సవాల్ విసిరారు.


Also Read: జగన్ అబద్ధాలు ఆడొద్దు.. మేం నీ సెక్యూరిటీని తగ్గించామా..? నిజం చెప్పు: అనిత

ఇదిలా ఉంటే.. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసు విచారణ వేగంగా కొనసాగుతోందంటూ మంత్రి అనగాని సత్యప్రసాద్ పేర్కొన్నారు. సోమవారం తిరుపతి వకుళామాతను ఆయనతోపాటు మంత్రి గొట్టిపాటు రవికుమార్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి అనగాని మాట్లాడుతూ.. పెద్దరెడ్డి అనుచరుల ఇళ్లల్లో భూముల అక్రమాలకు సంబంధించినటువంటి వందల ఫైళ్లు దొరికాయన్నారు. మదనపల్లె ఫైళ్ల దగ్ధం కేసులో ఎంతటి వారున్నా కూడా వదిలేదన్నారు. పెద్దిరెడ్డి బాధితుల సంఖ్య వేలల్లో ఉందన్నారు. ఆ కుటుంబం చేసిన వందల ఎకరాల భూకబ్జాలకు ప్రభుత్వం వద్ద ఆధారాలున్నాయన్నారు. తిరుపతి, రాజంపేట, చిత్తూరు నియోజకవర్గంలో బాధితులు అధికంగా ఉన్నారని ఆయన పేర్కొన్నారు. వైసీపీ హయాంలో జరిగిన అన్ని కుంభకోణాలను బయటపెడుతామన్నారు.


Tags

Related News

Pulivendula Slips: బ్యాలెట్ బాక్స్ లో ఓటుతోపాటు స్లిప్పులు కూడా.. పులివెందుల ఓటర్ల మనోగతం ఏంటంటే?

AP Heavy Rains: ఏపీని ముంచెత్తిన భారీ వరదలు.. కంట్రోల్ రూమ్‌లు ఏర్పాటు

Polavaram: పోలవరంపై కీలక అప్ డేట్.. మంత్రి లోకేష్ ఆసక్తికర ట్వీట్

Fact Check AP: అడ్డంగా ఇరుక్కున్న అంబటి? బిగ్ షాకిచ్చిన fact check!

AP Heavy rain alert: అల్పపీడనం ఆగ్రహం.. మూడు రోజులు భీకర గాలులు, జోరు వర్షాలు.. ఎక్కడంటే?

Pulivendula Victory: జగన్‌కు మరిన్ని షాకులు.. పులివెందుల విక్టరీపై సీఎం చంద్రబాబు రియాక్షన్

Big Stories

×