E-Paper
Advertisement

Hyderabad Crime: రెండు నెలల పసికందు సజీవ దహనం.. ఆ తల్లి చేసిన పనికి కంగుతిన్న పోలీసులు!

Hyderabad Crime: రెండు నెలల పసికందు సజీవ దహనం.. ఆ తల్లి చేసిన పనికి కంగుతిన్న పోలీసులు!
Advertisement

Hyderabad Crime: హైదరాబాద్ శివారులోని దుండిగల్ పరిధి బౌరంపేటలో అత్యంత దారుణమైన ఘటన చోటుచేసుకుంది. కన్నతల్లే కాలయముడుగా మారి, తన రెండు నెలల పసికందును సజీవ దహనం చేసిన ఉదంతం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పేగు తెంచుకుని పుట్టిన బిడ్డ అని కూడా చూడకుండా.. ఆ తల్లి చేసిన పని స్థానికంగా తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.

పోలీసుల సమాచారం ప్రకారం.. బీహార్ రాష్ట్రానికి చెందిన ఒక వలస కుటుంబం బౌరంపేటలోని ఒక అపార్ట్‌మెంట్‌లో పని చేస్తూ అక్కడే నివసిస్తోంది. ఆ దంపతులకు రెండు నెలల మగ శిశువు ఉన్నాడు. అయితే.. ఆ పసికందు నిరంతరాయంగా ఏడుస్తూ ఇబ్బంది పెడుతున్నాడని ఆ తల్లి కోపం పెంచుకుంది. ఆ కోపం కట్టలు తెంచుకోవడంతో.. పసివాడని కూడా చూడకుండా అత్యంత క్రూరంగా ప్రవర్తించింది.

Advertisement

బిడ్డ ఏడుపు ఆపడం లేదన్న కోపంతో.. ఆ తల్లి పసికందు చేతులు, కాళ్లు కట్టేసింది. బిడ్డ అరుపులు బయటకు రాకుండా నోట్లో గుడ్డలు కుక్కింది. అంతటితో ఆగకుండా.. మండుతున్న కట్టెల పొయ్యిలోకి ఆ చిన్నారిని విసిరేసింది. ఆ మంటల్లో పసికందు సగం కాలిపోయి.. తీవ్ర గాయాలతో అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది.

సమాచారం అందుకున్న దుండిగల్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని నిందితురాలిని అదుపులోకి తీసుకున్నారు. పోస్ట్‌మార్టం నిమిత్తం మృతదేహాన్ని గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఘటన స్థలాన్ని ఏసీపీ శంకర్ రెడ్డి పరిశీలించి..కేసు నమోదు చేసి దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు.

Advertisement

Also Read: అప్పు ఇచ్చారని ఇంత రాక్షసత్వమా? కాలువలో దూకి మహిళ ఆత్మహత్య!

Related News

ఇరుముడి ఎఫెక్ట్.. ‘తులాభారం’ కోసం రవితేజ భారీ రెమ్యూనరేషన్..

సాయికృష్ణ మిస్టరీ కేసు సంఘటన.. మళయాల క్రైం థ్రిల్లర్‌ మూవీలో ప్రధాన కథనం..! ఇన్విస్టిగేషన్‌ ఆఫీసర్‌ని బురిడీ కొట్టించే సీన్లు..!

‘కంచె చేను మేస్తున్న’ దారుణ హత్యలు! పని మనుషుల ముసుగులో నరరూప హంతకులు!

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

Big Stories

Advertisement
×