E-Paper
Advertisement

శెట్టిపల్లి ప్రజలకు గుడ్ న్యూస్.. జగన్ అరాచకాలపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు!

శెట్టిపల్లి ప్రజలకు గుడ్ న్యూస్.. జగన్ అరాచకాలపై మంత్రి అనగాని సంచలన వ్యాఖ్యలు!
Advertisement

Shettipalli Lands: తిరుపతి పరిధిలోని శెట్టిపల్లి భూ సమస్యకు ఎట్టకేలకు శాశ్వత పరిష్కారం లభించింది. 70 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న శెట్టిపల్లి నివాసితుల కలను ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సాకారం చేశారు. ఈ సందర్భంగా మంత్రులు పి. నారాయణ, అనగాని సత్యప్రసాద్ లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేసి, శెట్టిపల్లి అభివృద్ధిపై కీలక ప్రకటనలు చేశారు.

శెట్టిపల్లి ప్రజల 70 ఏళ్ల కల సాకారం

Advertisement

తిరుపతి శెట్టిపల్లి భూ బాధితుల సమస్య పరిష్కారం కావడంపై మంత్రి నారాయణ హర్షం వ్యక్తం చేశారు. దాదాపు ఏడు దశాబ్దాలుగా నలుగుతున్న ఈ వివాదానికి సీఎం చంద్రబాబు చొరవతో ముగింపు పడిందని చెప్పారు. అర్హులైన లబ్ధిదారులందరికీ త్వరితగతిన, పూర్తిస్థాయిలో పట్టాలు అందించాలని రెవెన్యూ మంత్రిని సీఎం ఆదేశించినట్లు తెలిపారు. ఈ క్రమంలోనే మొత్తం 2,048 మంది లబ్ధిదారులకు పట్టాలు పంపిణీ చేశామని, వారికి ఆర్థిక భారం పడకుండా రూ.17 కోట్ల 50 లక్షల రిజిస్ట్రేషన్ ఫీజులను ప్రభుత్వం పూర్తిగా మాఫీ చేసిందని మంత్రి వెల్లడించారు. రాష్ట్రంలో ఎక్కడ ఇలాంటి భూ సమస్యలు ఉన్నా వాటిని పరిష్కరించేందుకు ముఖ్యమంత్రి స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని, శెట్టిపల్లిని అన్నివిధాలా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు.

రాష్ట్రానికే రోల్ మోడల్‌గా శెట్టిపల్లి అభివృద్ధి

Advertisement

రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. శెట్టిపల్లిని రాష్ట్రంలోనే ఎక్కడా లేని విధంగా, ఒక మోడల్ గ్రామంగా తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి ఆకాంక్షిస్తున్నారని తెలిపారు. మొత్తం 380 ఎకరాల వివాదాస్పద భూమిలో, 225 ఎకరాలను శెట్టిపల్లి ప్రజలకే కేటాయించామని స్పష్టం చేశారు. ఈ సమస్యను పరిష్కరించడంలో కృషి చేసిన రెవెన్యూ యంత్రాంగానికి, జిల్లా కలెక్టర్‌కు ఆయన అభినందనలు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రత్యేక నిధులు రప్పించి శెట్టిపల్లిలో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్‌తో పాటు ఆధునిక ప్రాజెక్టులను నిర్మిస్తామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా పేద ప్రజలందరికీ సొంత ఇంటి కలను నెరవేర్చే దిశగా కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందని మంత్రి పేర్కొన్నారు.

గత ప్రభుత్వ అరాచకాలు.. చంద్రబాబు 2047 విజన్

గత వైసీపీ ప్రభుత్వంపై మంత్రులు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2019 నుంచి 2024 వరకు సాగిన జగన్ పాలన అరాచకానికి కేరాఫ్ అడ్రస్‌గా మారిందని, శెట్టిపల్లి భూములను కూడా లాక్కోవాలని చూశారని మండిపడ్డారు. గతంలో తాము చేసిన అభివృద్ధిని కూడా జగన్ నిలిపివేశారని ఆరోపించారు. కానీ, చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం శెట్టిపల్లి ప్రజల భూములను వారికే దక్కేలా చేశారన్నారు.

ప్రస్తుతం ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోందని, చంద్రబాబు ‘2047 విజన్’తో రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తుంటే, ఐటీ శాఖ మంత్రి లోకేష్ కృషితో భారీగా పెట్టుబడులు వస్తున్నాయని చెప్పారు. అంతర్జాతీయంగా యుద్ధాల కారణంగా పెట్రోల్ ధరలు పెరుగుతుంటే, దానిపై వైసిపి రాజకీయం చేయడం హాస్యాస్పదమన్నారు. కోవిడ్ కన్నా ముంచుకొచ్చే ముప్పులపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తంగా ఉన్నాయని, ప్రజలు మంచి చేసే ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలని కోరారు.

Also Read: ముంబయి హైవేపై ట్రక్కును ఢీకొట్టిన కంటైనర్.. 12 మంది మృతి, పలువురికి తీవ్ర గాయాలు

Related News

ఆడవాళ్లకు రక్షణేది?.. గుంటూరు దారుణంపై మండిపడ్డ జగన్!

Fishermen Death: గోదావరిలో చేపల వేటకు వెళ్లి.. ఐదుగురు మృతి, ఏపీలో విషాదం

మహిళను రోడ్డుపై వివస్త్రను చేస్తారా! గుంటూరు ఘటనపై చంద్రబాబు సీరియస్

ప్రకాశం జిల్లాలో రోడ్డు ప్రమాదం.. ఆర్టీసీ బస్సు బోల్తా.. స్పాట్‌‌లో 60 మంది ప్రయాణికులు!

గుంటూరులో మంటగలిసిన మానవత్వం.. మహిళపై దాడి చేయించిన టీడీపీ నేత, పార్టీ నుంచి సస్పెండ్!

విజయవంతంగా నింగిలోకి దూసుకెళ్లిన విక్రమ్ – 1, ఈ హైదరాబాద్ రాకెట్ ప్రత్యేకత ఇదే..!

ఏపీలో మారిన వాతావరణం.. పలు జిల్లాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షాలు, పిడుగుల హెచ్చరిక!

కరోనా ఈజ్ బ్యాక్.. ఏపీలో 12 కేసులు.. ఆ నలుగురి మరణానికి అసలు కారణం ఇదేనా?

Big Stories

Advertisement
×