TDP on YS Jagan: మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని పరామర్శించిన జగన్ చేసిన కామెంట్స్ కి టీడీపీ కౌంటర్ ఇస్తూ సంచలన వీడియో రిలీజ్ చేసింది. ఈ వీడియోకు జగన్ ఏం చెప్తారంటూ మంత్రి కొల్లు రవీంద్ర ప్రశ్నించారు. మరి టీడీపీ కౌంటర్ కు జగన్ రియాక్షన్ ఎలా ఉంటుందో కానీ, దిమ్మతిరిగే కౌంటర్ అంటూ టీడీపీ సోషల్ మీడియా ప్రచారం సాగిస్తోంది. అలాగే జగన్ కామెంట్స్ పై నారా లోకేష్ కూడా ట్వీట్ చేశారు.
విజయవాడలోని జైలులో వల్లభనేని వంశీని జగన్ మంగళవారం పరామర్శించిన విషయం తెల్సిందే. ఈ సంధర్భంగా జగన్ సంచలన ఆరోపణలు చేశారు. ఎల్లకాలం టీడీపీ అధికారంలో ఉండదని, ఇబ్బందులకు గురి చేసిన అధికారులను, నాయకులను బట్టలూడదీసి కొడతామని జగన్ హెచ్చరించారు. అన్యాయంగా వైసీపీ నాయకులపై కేసులు పెడుతూ ఇబ్బందులు పెడుతున్నారని జగన్ ఆరోపించారు. జగన్ చేసిన ఆరోపణలకు మంత్రులు నారా లోకేష్, కొల్లు రవీంద్ర కౌంటర్ ఇచ్చారు.
లోకేష్ చేసిన ట్వీట్ ఆధారంగా.. నిజం చెబితే తల వెయ్యి ముక్కలు అవుతుందనే శాపం మీకేమైనా ఉందా జగన్ రెడ్డి గారు? పచ్చి అబద్దాలను కాన్ఫిడెంట్ గా చెప్పడంలో మీరు పీహెచ్డీ చేసినట్టు ఉన్నారు. మీరు ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనే భ్రమలోంచి ఇకనైనా బయటకు రండి అంటూ లోకేష్ అన్నారు.100 మందికి పైగా వైసీపీ రౌడీలు తెలుగుదేశం పార్టీ కార్యాలయం పై దాడి చేయడం కోట్లాది ప్రజలు కళ్లారా చూసారు. కక్ష సాధింపు, కుట్రలు, కుతంత్రాలు మీ బ్రాండ్ జగన్ రెడ్డి అంటూ, అధికారం ఉన్నప్పుడు యథేచ్చగా చట్టాలను తుంగలో తొక్కి… ఇప్పుడు ప్రజాస్వామ్యం, పద్ధతులు అంటూ మీరు లెక్చర్ ఇవ్వడం వింతగా ఉందని లోకేష్ అభిప్రాయపడ్డారు.
ఇక మీడియా సమావేశం నిర్వహించిన మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. దళిత యువకుడు సత్యవర్ధన్‌ను కిడ్నాప్ చేసి వంశీ హైదరాబాద్ తీసుకెళ్లారా లేదా అంటూ ప్రశ్నించారు. ఈ సంధర్భంగా మీడియా ముఖ్యంగా సీసీ కెమెరా దృశ్యాలను మంత్రి కొల్లు రవీంద్ర విడుదల చేశారు. ఈనెల 11న హైదరాబాద్ మై హోమ్ బుజాలోని సీసీ కెమెరా దృశ్యాలని మంత్రి అన్నారు. సత్యవర్ధన్ ను కిడ్నాప్ చేసి బెదిరించి, ఏకంగా కేసును వాపస్ తీసుకొనేలా వంశీ చేశారో లేదో జగన్ సమాధానం చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. టీడీపీ విడుదల చేసిన సీసీ ఫుటేజ్ లో వంశీతో పాటు, పలువురు వ్యక్తులు, సత్యవర్ధన్ ఉన్నట్లు రవీంద్ర ఆరోపించారు.
Also Read: Selfie with YS Jagan: జగనన్నా అంటూ చిన్నారి భావోద్వేగం.. ఆ ఒక్క సెల్ఫీతో జనం మనసు గెలిచేశాడుగా!
ఉదయం జగన్ విమర్శలు, సాయంత్రం టీడీపీ కౌంటర్ విమర్శలు చేస్తుండగా, ఏపీ రాజకీయం హీటెక్కింది. దీనితో ఇరు పార్టీల సోషల్ మీడియా ఖాతాలు ఫుల్ బిజీ అయ్యాయని చెప్పవచ్చు. మొత్తం మీద వంశీ అరెస్ట్ తర్వాత టీడీపీ వర్సెస్ వైసీపీ మధ్య మాటల యుద్దం పెరిగిందని చెప్పవచ్చు. మరోవైపు జగన్ లక్ష్యంగా గన్నవరం ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకటరావు విమర్శల స్పీడ్ పెంచారు. బూతుల సంస్కృతిని వైసీపీ కొనసాగిస్తుందని, బూతులు మాట్లాడే వారినే జగన్ ప్రోత్సహిస్తున్నారన్నారు. నాడు వంశీ మట్టి బకాసురుడని జగన్ అన్నారని, ఇప్పుడు జైలుకు వెళ్లి ఎలా పరామర్శిస్తారంటూ ఎమ్మెల్యే ప్రశ్నించారు.
వంశీ అరెస్ట్ విషయంలో చట్ట ప్రకారంగానే చర్యలు
తీసుకుంటున్నారన్న టీడీపీ నేతలుపక్కా ఆధారాలతోనే వల్లభనేని వంశీ అరెస్ట్ జరిగిందంటున్న టీడీపీ నాయకులు
సత్యవర్ధన్ కిడ్నాప్ వీడియోను రిలీజ్ చేసిన టీడీపీ నేతలు
వీడియోలో సత్యవర్దన్ ను తీసుకెళ్తున్న వంశీ అనుచరులు pic.twitter.com/IRGLVvxWLD
— BIG TV Breaking News (@bigtvtelugu) February 18, 2025