Pawan Kalyan: ప్రపంచంలోనే అతిపెద్దదైన ఆధ్యాత్మిక వేడుక మహా కుంభమేళా మరో 8 రోజుల్లో ముగియనుంది. దీంతో భక్తులు మహా కుంభమేళాకు పోటెత్తుతున్నారు. 144 ఏళ్ళ తరువాత వచ్చిన వేడుక కావడంతో ప్రయాగ్‌రాజ్‌కు భక్తుల తాకిడి బాగా పెరుగుతోంది. చిన్నా పెద్ద, ముసలి ముతకా.. సెలబ్రిటీలు సైతంప్రయాగ్ రాజ్ కు పయనమవుతున్నారు. అక్కడ పుణ్యస్నానాన్నీ ఆచరించి తమ పాపాలను కడిగేసుకుంటున్నారు. ఇప్పటివరకు సినీ, రాజకీయ ప్రముఖులు చాలామంది మహా కుంభమేళాలో మెరిశారు.
తాజాగా ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్.. నేడు మహా కుంభమేళాలో సందడి చేశారు. గత కొన్నిరోజులుగా ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న పవన్.. నేడు కుటుంబ సమేతంగా మహా కుంభమేళాకు చేరుకొని పవిత్ర స్నానాన్ని ఆచరించారు. పవన్ .. ఆయన భార్య అన్నా లెజినావో, కొడుకు అకీరా నందన్.. త్రివేణి సంగమంలో పవిత్ర స్నానాలు ఆచరించి గంగాదేవికి పూజలు నిర్వహించారు. వీరితో పాటు డైరెక్టర్ త్రివిక్రమ్ కూడా పవిత్ర స్నానాన్ని ఆచరించాడు. ఇందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
ఇక ఆధ్యాత్మిక పర్యటనలో ఉన్న పవన్ తో పాటు అకీరా నందన్ కూడా ఉన్నాడు. ఇప్పటివరకు అకీరా.. తండ్రితో కలిసి తిరిగింది చాలా తక్కువ. ఎప్పుడైతే పవన్ డిప్యూటీ సీఎం గా మారారో.. అప్పటినుంచి అకీరాను పక్కనే ఉంచుకుంటున్నాడు. ఎక్కడకు వెళ్లినా.. అకీరా తండ్రి పక్కనే నిలబడుతున్నాడు. ఇప్పటివరకు అకీరా ఎప్పుడెప్పుడు సినిమాల్లోకి వస్తాడా.. ? అని ఎదురుచూసిన అభిమానులకు అతని లుక్ చూసి.. కన్ఫర్మ్ గా తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకుంటాడు అని నమ్మకం వచ్చేసింది.
Supritha: థాయ్ లాండ్ లో తల్లీకూతుళ్లు అందాల ఆరబోత.. అన్ని చూపిస్తూ.. ఛీఛీ..?
పవన్ మాజీ భార్య రేణు దేశాయ్.. భర్త నుంచి విడిపోయినా కూడా బిడ్డలను మాత్రం తండ్రికి దూరం కానివ్వలేదు. ఈ మధ్యనే తల్లి, చెల్లితో కలిసి కాశీ యాత్రకు వెళ్లిన అకీరా.. ఇప్పుడు తండ్రితో కలిసి.. ఆధ్యాత్మిక పర్యటనలో భాగమయ్యాడు. ఇక తండ్రీకొడుకులిద్దరిని ఇలా చూస్తుంటే మెగా ఫ్యాన్స్ సంతోషంతో గెంతులు వేస్తున్నారు. పవన్ తరువాత ఆయన లెగసీని కాపాడేది అకీరా అని పొగిడేస్తున్నారు.
ఇక అకీరా టాలీవుడ్ ఎంట్రీ త్వరలోనే ఉండొచ్చు అని టాక్ నడుస్తోంది. అకీరా హీరో అవ్వాలనుకుంటే తనకేమి అభ్యంతరం లేదని రేణు ఎన్నోసార్లు చెప్పుకొచ్చింది. అయితే ఇప్పటివరకు అకీరాకు మ్యూజిక్ పై తప్ప యాక్టింగ్ పై అంత ఇంట్రెస్ట్ లేదని రేణు చెప్పుకొచ్చింది. ఇప్పటివరకు అకీరా ఫోటోలు కూడా చాలా రేర్ గా బయటకు వచ్చేవి. కానీ, ఈ ఆధ్యాత్మిక పర్యటన కారణంగా పవన్ వారసుడును రోజూ కనిపిస్తుండడంతో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. తండ్రిని డామినేట్ చేస్తున్నాడు.. త్వరగా ఇండస్ట్రీకి వస్తే బ్రేక్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని ఫ్యాన్స్ కామెంట్స్ పెడుతున్నారు. మరి పవన్ వారసుడును ఇండస్ట్రీకి పరిచయం చేసే డైరెక్టర్ ఎవరో చూడాలి.
మహకుంభమేళాలో కుటుంబ సమేతంగా పుణ్యస్నానం ఆచరించిన పవన్ కళ్యాణ్#PawanKalyan #KumbhMela2025 #Familty #BigtvCinema pic.twitter.com/ZccuhSvnuQ
— BIG TV Cinema (@BigtvCinema) February 18, 2025