Big Stories

Chandrababu Speech In Raptadu: ఆ 7 హామీల సంగతేంటి ? జగన్‌కు చంద్రబాబు ప్రశ్నలు..

Chandrababu Speech In Raptadu
Chandrababu Speech In Raptadu

Chandrababu Praja Galam Yatra Updates(AP election updates): టీడీపీ అధినేత నారా చంద్రబాబు చేపట్టిన ప్రజాగళం ప్రచార యాత్ర ఉత్సాహంగా సాగుతోంది. గురువారం రాప్తాడులో యాత్ర సాగించిన టీడీపీ అధినేత.. వైసీపీ సర్కార్ పై విమర్శలు గుప్పించారు. సీఎం వైఎస్ జగన్ పాలనకు ఇక 46 రోజుల సమయం మాత్రమే  ఉందన్నారు. ఆ తర్వాత వచ్చేది టీడీపీ ప్రభుత్వమేనని ధీమా వ్యక్తం చేశారు.

- Advertisement -

2019 ఎన్నికల సమయంలో వైసీపీ అధ్యక్షుడు జగన్ ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రస్తావించారు. 90 శాతం హామీలను అమలు చేశామని జగన్ చెప్పుకుంటున్నారు కానీ.. తాను అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పాలంటూ సవాల్ విసిరారు. ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, సీపీఎస్ రద్దు , ఏటా జాబ్ క్యాలెండర్, మెగా డీఎస్సీ, విద్యుత్ ఛార్జీల తగ్గింపు, పోలవరం ప్రాజెక్టు పూర్తి చేయడం.. ఈ ఏడు హామీల సంగతేంటని జగన్ ను చంద్రబాబు ప్రశ్నించారు.

- Advertisement -

హామీలన్నీ అమలు చేయకపోతే 2024 ఎన్నికల్లో  ఓట్లు అడగనని జగన్ చెప్పారని చంద్రబాబు గుర్తు చేశారు. కానీ ఆ ఏడు హామీలను ఎందుకు అమలు చేయలేదని నిలదీశారు. హామీలను గోదావరిలో ముంచేశారని మండిపడ్డారు. కరెంట్ ఛార్జీలు పెంచుకుంటూ పోతున్నారని జగన్ పై చంద్రబాబు విమర్శలు గుప్పించారు. ప్రతి ఇంటికి నెలకు రూ. 500 అదనంగా కరెంట్ బిల్లు వస్తోందన్నారు. అంతకుముందు ఐదేళ్ల టీడీపీ హయాంలో కరెంట్ ఛార్జీలు ఒక్కసారి కూడా పెంచలేదని గుర్తు చేశారు. జగన్ హయాంలో 9 సార్లు కరెంట్ ఛార్జీలు పెంచారని విమర్శించారు. మోటర్లకు మీటర్లు బిగించి రైతులకు ఉరితాడు వేశారని మండిపడ్డారు.

Also Read: ఏపీలో కంటెయినర్ పంచాయితీ.. ఇంతకీ అసలు కథేంటి?

టీడీపీ ప్రజాగళం సూపర్ హిట్ అయ్యిందని చంద్రబాబు అన్నారు. జగన్ సిద్ధం సభలు మాత్రం అట్టర్ ప్లాప్ షో గా మారాయని విమర్శించారు. డబ్బులు ఇచ్చి బిర్యానీలు పెట్టినా వైసీపీ సభలకు జనం రావట్లేదని సెటైర్లు వేశారు.

వైసీపీ ప్రభుత్వం అక్రమ కేసులు పెట్టినా, బెదిరించినా ఎవరూ భయపడవద్దని ప్రజలకు టీడీపీ అధినేత చంద్రబాబు ధైర్యం చెప్పారు. జగన్ ను గద్దె దించడమే అందిరి లక్ష్యం కావాలని పిలుపునిచ్చారు.
విధ్వంసంతో రాష్ట్రాన్ని జగన్ లూటీ చేశారని ఆరోపించారు.

- Advertisement -

ఇవి కూడా చదవండి

Latest News