BigTV English

Minister Kandula Durgesh: కూటమిలో అప్పుడే.. మంత్రి దుర్గేష్‌ను నిలదీసిన టీడీపీ నేతలు, ఎందుకు?

Minister Kandula Durgesh: కూటమిలో అప్పుడే.. మంత్రి దుర్గేష్‌ను నిలదీసిన టీడీపీ నేతలు, ఎందుకు?

Minister Kandula Durgesh: కూటమి ప్రభుత్వంలో ఏం జరుగుతోంది? మంత్రులు, ఎమ్మెల్యేలు నియోజకవర్గాలకు వెళ్లడం లేదా? టీడీపీ కేడర్ ఆగ్రహంతో రగిలిపోతోందా? కూటమిలో లుకలుకలు మొదలయ్యాయా? పల్లె పండుగ కార్యక్రమంలో ఏం జరిగింది? మంత్రి కందుల దుర్గేష్‌ను ఎందుకు టీడీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు? కార్యకర్తల ఆందోళనకు నష్ట నివారణ చర్యలుంటాయా?


సోమవారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పల్లె పండుగ కార్యక్రమానికి చంద్రబాబు సర్కార్ శ్రీకారం చుట్టింది. పల్లె పండుగ-పంచాయితీ వారోత్సవాలను కూటమి సర్కార్ సీరియస్‌గా తీసుకొంది. మంత్రులు, ఎమ్మెల్యేలు వివిధ కార్యక్రమాలకు గ్రామాల్లోకి వెళ్లారు.

ఇందులో భాగంగా మంత్రి కందుల దుర్గేష్ తన నియోజవర్గం నిడదవోలులోని కంసాలిపాలెం గ్రామానికి వెళ్లారు. ఈ కార్యక్రమానికి సంబంధించి తమకు ఎలాంటి సమాచారం ఇవ్వలేదని నిరసన తెలిపారు తెలుగు తమ్ముళ్లు. అధికారం‌లోకి వచ్చిన నుంచి తమను పట్టించుకోలేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు.


టీడీపీ నాయకులు, కార్యకర్తలు మద్దతు ఇవ్వకపోతే పరిస్థితి ఎలా ఉండేదో ఒక్కసారి ఆలోచించు కోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. కూటమి అభ్యర్థి గెలుపు కోసం అహర్నిశలు శ్రమించామని, గెలచిన తర్వాత సమస్యలు మాట్లాడుతుంటే.. కడియం నుంచి వచ్చిన మంత్రి అనుచరులు దుర్భాషలాడుతున్నారంటూ మండిపడుతున్నారు.

ALSO READ: మళ్లీ వార్తల్లో ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం, కలకలం రేపుతున్న ఆడియో టేప్‌లు

పరిస్థితి గమనించిన మంత్రి కందుల దుర్గేష్.. టీడీపీ కార్యకర్తలను కూల్ చేసే ప్రయత్నం చేశారు. కార్యకర్తల మాటలకు మంత్రి సైలెంట్ అయిపోయారు. చాలా ప్రాంతాల్లో ఇదే సమస్య వుందన్నది కొందరి నేతల మాట. కూటమి అధికారంలోకి వచ్చి 100 రోజుల సందర్భంగా మంత్రులు, ఎమ్మెల్యేల రిపోర్టుపై ప్రభుత్వం చర్చించింది. కొందర్ని సముదాయించారు ముఖ్యమైన నేతలు. అయినా కొందరు ఎమ్మెల్యేలు, మంత్రుల్లో ఎలాంటి మార్పు రాలేదని అంటున్నారు.

 

 

Related News

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Tirumala devotees: తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ.. దర్శనానికి పట్టే సమయం ఎంతంటే?

CM Chandrababu: సిఎం చంద్రబాబు పై అభిమానం… 108 ఆలయాల్లో ఆ అభిమాని ఏం చేశారంటే?

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

Big Stories

×