BigTV English

Telangana High Court : వైఎస్ జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు..

Telangana High Court :  వైఎస్ జగన్ కు తెలంగాణ హైకోర్టు నోటీసులు..

Telangana High Court : ఏపీ సీఎం వైఎస్ జగన్‌ మోహన్‌ రెడ్డికి తెలంగాణ హైకోర్టు నోటీసులు ఇచ్చింది.‌ వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై సీజే జస్టిస్‌ అలోక్‌ అరాధే, జస్టిస్‌ ఎన్వీ శ్రావణ్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిల్ గా పరిగణించేందుకు రిజిస్ట్రీ పేర్కొన్న అభ్యంతరాలపై విచారణ చేసింది. పిల్ లో సవరణలను పరిగణలోకి తీసుకుంది. హరిరామ జోగయ్య తరఫు న్యాయవాది పోలిశెట్టి రాధాకృష్ణ వాదనలతో ఏకీభవించింది.


ప్రజా ప్రయోజన వ్యాజ్యంగా పరిగణించేందుకు హైకోర్టు ధర్మాసనం అంగీకారం తెలిపింది. హరిరామ జోగయ్య పిల్ కు నెంబరు కేటాయించాలని రిజిస్ట్రీకి హైకోర్టు ఆదేశించింది. ప్రతివాదులుగా ఏపీ సీఎం వైఎస్ జగన్‌, సీబీఐ, సీబీఐ కోర్టుకు నోటీసులు పంపింది. సీబీఐ కోర్టులో జగన్ కేసుల విచారణ వేగంగా పూర్తయ్యేలా ఆదేశించాలని హరిరామ జోగయ్య పిటిషన్ లో కోరారు. 2024 అసెంబ్లీ ఎన్నికల్లోపే కేసులు తేల్చేలా ఆదేశాలివ్వాలని విజ్ఞప్తి చేశారు.

మరోవైపు ఇప్పటికే ఏపీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులపైనా సుప్రీంకోర్టులో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుల్లో విచారణను తెలంగాణ నుంచి మరో రాష్ట్రానికి బదిలీ చేయాలని ఆ పిటిషన్‌లో విజ్ఞప్తి చేశారు. జగన్ అక్రమాస్తుల కేసులపై తెలంగాణ సీబీఐ కోర్టులో తీవ్ర జాప్యం జరుగుతోందని పేర్కొన్నారు. ఈ కేసులను సీబీఐ కోర్టు 3,071 సార్లు వాయిదా వేసిందని వివరించారు. ఈ కేసు విచారణకు సీఎం వైఎస్ జగన్ ప్రత్యక్షంగా హాజరుకాకుండా సీబీఐ కోర్టు మినహాయింపు ఇచ్చిందన్నారు. వందల డిశ్చార్జ్ పిటిషన్లు వేసి కేసు విచారణ జాప్యం జరిగే చేశారని రఘురామకృష్ణరాజు తన పిటిషన్‌లో ఆరోపించారు.ఈ పిటిషన్‌పై జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ భట్టి ధర్మాసనం విచారణ చేపట్టనుంది.


అలాగే జగన్ ప్రభుత్వంలో జరిగిన అవినీతిపై సీబీఐ విచారణ చేయాలని కోరుతూ ఏపీ హైకోర్టులో ప్రజా ప్రయోజన పిటిషన్ వేశారు రఘురామకృష్ణరాజు. సీఎం వైఎస్ జగన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆ పిటిషన్ లో పేర్కొన్నారు. ప్రజాధనానికి నష్టం కలిగేలా ఏపీ ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుందని ఆరోపించారు. ఏ ఏ శాఖలో ఎలా అవినీతి జరిగిందో ఆ పిటిషన్ వివరించారు.

అలా అటు సుప్రీంకోర్టు, హైకోర్టుల్లో పిటిషన్లు వేసి సీఎం జగన్ ను టార్గెట్ చేశారు ఆ పార్టీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు. మరోవైపు ఇప్పుడు హరిరామ జోగయ్య పిటిషన్ పై తెలంగాణ హైకోర్టు జగన్ కు నోటీసులు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది. ఈ పిటిషన్ల వ్యవహారం ఏపీలో పొలిటికల్ హీట్ ను మరింత పెంచుతోంది. ఒకవైపు టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసులు నడుస్తుండగా జగన్ కేసుల వ్యవహారాలు తెరపైకి రా

Related News

Tirumala News: బుక్కైన జగన్ మామ, టీటీడీ కేసు నమోదు? అసలు ఏం జరిగింది?

YS Jagan: ఉప ఎన్నికల వేళ జగన్ 8 ప్రశ్నలు.. ఓటమిని ముందే ఒప్పుకున్నారా..?

Pulivendula Campaign: ఖైదీల వేషధారణలో ఎన్నికల ప్రచారం.. వైసీపీ పరువు తీసేశారుగా!

Nara Lokesh: ర్యాగింగ్ ఘటనపై లోకేష్ ఘాటు రియాక్షన్

Visakhapatnam 2050: విశాఖ నగరం 2050లో.. ఇలా ఉంటుందా? అసలు ఊహించలేం కదా!

Araku Coffee: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. అరకులో ఇకపై అందరూ లక్షాధికారులే!

Big Stories

×