E-Paper
Advertisement

ప‌సికూన‌ల‌పై గెల‌వ‌డం కాదు, ద‌మ్ముంటే పాకిస్తాన్ ను ఓడించండి!

ప‌సికూన‌ల‌పై గెల‌వ‌డం కాదు, ద‌మ్ముంటే పాకిస్తాన్ ను ఓడించండి!
Advertisement

Tanveer Ahmed On IND VS ZIM: పాకిస్తాన్ మాజీ క్రికెటర్లు పొద్దున లేస్తే చాలు ఇండియా పై విషం కక్కుతున్నారు. టీమిండియా గెలిస్తే ఫిక్సింగ్ అంటున్నారు. ఓడిపోతే ఫ్లాట్ మైదానాలపై ఆడి గెలిచారని ట్రోల్ చేస్తున్నారు. ఇక లేటెస్ట్ గా జింబాబ్వేపై మహిళల టీమిండియా వన్డే, టీ20 సిరీస్ గెలిచిన నేపథ్యంలో తన్వీర్ అహ్మద్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. పసికూనలపై గెలిచి టీమిండియాకు సంబరాలు చేసుకోవడం అలవాటే అయిందని చురకలు అంటించాడు. చిన్న జ‌ట్ల‌పై ఆడి గెల‌వ‌డం గొప్ప విష‌యం కాదంటూ చుర‌క‌లు అంటించాడు. దమ్ముంటే పాకిస్తాన్ తో తలపడాలని.. తమ దేశానికి వచ్చి గెలిచి చూపించాలంటూ సవాల్ విసిరాడు. అప్పుడే టీమిండియా మహిళల జట్టును మెచ్చుకుంటానని వెల్లడించాడు. దీంతో టీమిండియా మహిళలు జట్టుపై తన్వీర్ అహ్మద్ చేసిన వ్యాఖ్యలు వైరల్ గా మారాయి.

జింబాబ్వేపై రెండు సిరీస్ లు గెలిచిన టీమిండియా

టీమిండియా వర్సెస్ జింబాబ్వే మధ్య మొన్నటి వరకు 3 టీ20లతో పాటు మూడు వన్డేలు జరిగాయి. హర్మన్ ప్రీత్ కౌర్ కెప్టెన్సీ నుంచి వైదొలిగిన తర్వాత జరిగిన తొలిసారి స్మృతి మందాన ఆధ్వర్యంలోని టీమిండియా జింబాబ్వేతో తలపడింది. అది కూడా స్వదేశంలోనే జరగడంతో అవలీలగా స్మృతి మందాన సేన రెండు సిరీస్ లు కైవసం చేసుకుంది. మొదట జరిగిన టి20 సిరీస్ ను క్లీన్ స్వీప్ చేసిన టీమిండియా… లేటెస్ట్ గా 3 వ‌న్డేల‌ సిరీస్ కూడా కైవసం చేసుకుంది. దీంతో స్మృతి మందాన కెప్టెన్సీ పై ప్రశంసల వర్షం కురుస్తోంది.

Advertisement

Harbhajan Singh Reaction On Ricky Ponting smashes World Cup-winning ton vs India: 2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

ప‌సికూన‌ల‌పై గెల‌వ‌డం కాదు, ద‌మ్ముంటే పాకిస్తాన్ ను ఓడించండి!

జింబాబ్వే లాంటి పసికూన జట్టుపై టీమిండియా వన్డేలతో పాటు టీ20 గెలవడంపై పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ తన్వీర్ అహ్మద్ రియాక్ట్ అయ్యారు. ప్రతిసారి బలహీనమైన జట్లతో సిరీస్ లు ఆడి టీమిండియా ట్రోఫీలు గెలిచి సంబరాలు చేసుకుంటుందని విమర్శలు చేశారు. కానీ తమ పాకిస్తాన్ జట్టు ఎల్లప్పుడూ ప్రమాదకరమైన జట్లతోనే తలపడుతుందని వ్యాఖ్యానించారు. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, ఇంగ్లాండ్ లాంటి పెద్ద జట్లు కూడా తమ మహిళల పాకిస్తాన్ జట్టుతో ఆడాలంటే వణికిపోతున్నాయని షాకింగ్ కామెంట్స్ చేశారు. కానీ, టీమిండియా మాత్రం నమీబియా, జింబాబ్వే, బంగ్లాదేశ్ లాంటి పసికూనలతో ఆడి ప్రతాపం చూపిస్తుందని పరువు తీశారు. టీమిండియా మహిళల జట్టులో అంత దమ్ముంటే, పాకిస్తాన్ గడ్డపై పర్యటించి తమ జట్టును ఓడించాలని సవాల్ విసిరారు. లేదా తటస్థ వేదికలో వన్డేలతో పాటు టీ20లో ఆడి గెలిచి చూపించాలని చాలెంజ్ చేశారు తన్వీర్ అహ్మ‌ద్.

Advertisement

Pakistan Team Former Captain Shahid Afridi Shocking Comments On Abhishek Sharma Goes Viral  నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

 

 

 

 

 

Related News

హెచ్ కోచ్ ప‌ద‌వి వ‌దిలేస్తే కోట్లు కుమ్మ‌రిస్తాం..గంభీర్ కు 4 ఐపీఎల్ జ‌ట్ల ఓన‌ర్ల ఆఫ‌ర్లు!

SRHలోకి హార్దిక్ పాండ్యా..ఆ రూ. 20 కోట్ల ప్లేయర్‌ను గెంటేసిన కావ్య పాప ?

నా కంటే అభిషేక్ భయంకరంగా ఆడుతున్నారు..ప్రతీ సిక్సర్ స్టేడియం బయటే పడుతోంది

టెస్ట్ క్రికెట్ కు బుమ్రా ప‌నికిరాడు..గాయాలే అత‌డి కొంప‌ముంచుతున్నాయ్!

నువ్వు స్లాగ‌ర్ కాదు, రియ‌ల్ హీరో…అభిషేక్ శ‌ర్మ‌కు పాక్ బౌల‌ర్ క్ష‌మాప‌ణ‌లు

అభిషేక్, తిల‌క్ డేంజ‌ర‌స్ బ్యాట‌ర్లు..వాళ్లే లేక‌పోతే, టీమిండియా చిత్తుగా ఓడిపోతుంది

2003 వ‌ర‌ల్డ్ క‌ప్ లో పాంటింగ్ ను క్లీన్ బౌల్డ్ చేసేవాడిని…కానీ గంగూలే ప్లాన్ చెడ‌దొబ్బాడు

Big Stories

Advertisement
×