BigTV English

Tesla In Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌కు టెస్లా కార్ల కంపెనీ – ఆ జిల్లాకి కొలువుల పండుగే!

Tesla In Andhra Pradesh : ఆంధ్రప్రదేశ్‌కు టెస్లా కార్ల కంపెనీ – ఆ జిల్లాకి కొలువుల పండుగే!

Tesla In Andhra Pradesh : అంతర్జాతీయం ఈవీ దిగ్గజం టెస్లా సంస్థ భారత్ లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమైందన్న వార్తల నేపథ్యంలో.. అన్ని రాష్ట్రాలు లాబియింగ్ ప్రారంభించాయి. కార్ల తయారీలో మంచి గుర్తింపు ఉన్న టెస్లా పెట్టుబడులు పెడితే.. భవిష్యత్ లో మరిన్ని సంస్థలు వస్తాయనే ఆలోచనతో అనేక రాష్ట్రాలు పోటీ పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలతో పాటు ఉత్తర్ ప్రదేశ్, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, గుజరాత్ రాష్ట్రాలు.. టెస్లా కోసం అనేక ప్రోత్సహకాలు ఇచ్చేందుకు సిద్ధం అవుతున్నాయి. ఈ సమయంలోనే ఏపీ సీఎం చంద్రబాబు టెస్లాను రాష్ట్రానికి తీసుకువచ్చేందుకు తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.


గతంలో ఏపీ సీఎం గా పని చేసినప్పుడు రాష్ట్రానికి కియా పరిశ్రమను తీసుకువచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు సైతం అలాగే బ్రాండెడ్ సంస్థల్ని ఆకర్షించాలని ప్రయత్నిస్తున్నారు. దేశీయ మార్కెట్ సామర్థ్యం భారీగా ఉండడంతో పాటు ఇక్కడి నుంచి ఇతర సమీప దేశాలకు కార్లను ఎగుమతి చేయాలని ప్రణాళికలు రచిస్తున్న టెస్లా.. దేశంలో భారీ పరిశ్రమను నెలకొల్పే అవకాశం ఉంది. దీంతో.. ప్రత్యక్ష, పరోక్ష ఉపాధీ పెరిగేందుకు అవకాశం ఉంది. ఈ కారణంగానే చాలా రాష్ట్రాలు పోటీలు ముందున్నట్లు తెలుస్తోంది.

ఏపీలోని కూటమి ప్రభుత్వంలోని చంద్రబాబు, పవన్ కళ్యాణ్.. యువత, ఉపాధీ అవకాశాల్ని మెరుగుపరుస్తామని మొదటి నుంచి చెబుతూ వస్తున్నారు. అందుకు తగ్గట్టే.. ఇక్కడి వనరుల్ని, సౌకర్యాల్ని టెస్లా ప్రతినిధులకు వివరించడంతో పాటు.. అవసరమైన భూముల్ని కేటాయించేందుకు సైతం సిద్ధంగా ఉన్నట్లు తెలపనున్నారు. పైగా.. ఏపీకి సుదీర్ఘ సముద్ర తీరం ఉండడంతో.. ఇక్కడి నుంచి విదేశాలకు సైతం కార్లను సులువుగా తరలించే అవకాశాల్ని పరిశీలించమని కోరే అవకాశాలున్నాయి. ఈ బాధ్యతల్ని AP ప్రభుత్వ ఆర్థిక అభివృద్ధి బోర్డు (EDB) తీసుకున్నట్లుగా అధికారులు తెలుపుతున్నారు.


రాష్ట్రంలో ఉన్న సదుపాయాలతో పాటు భారత్లో అత్యధికంగా విద్యుత్ కార్లు (EV) దక్షిణాధి రాష్ట్రాల్లోనే ఎక్కువనే విషయాన్ని ప్రస్తావిస్తున్నారు. విద్యుత్ వాహనాల అమ్మకాల గణాంకాలను పరిశీలిస్తే.. దేశంలోని దాదాపు 60% విద్యుత్ కార్ల అమ్మకాలు కేరళ, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకలోనే జరుగుతున్నట్లు అధికారులు తెలుపుతున్నారు. ఈ కోణంలో చూసినా కూడా.. టెస్లా సంస్థకు ఆంధ్రప్రదేశ్‌ ఉత్తమ ఎంపిక అంటున్నారు. అయితే.. 2024 అక్టోబర్‌లో ఏర్పాటైన టీడీపీ-జనసేనా-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వం టెస్లాతో చర్చలు ప్రారంభించింది. ఇప్పుడే కాదు.. గతంలోనూ ఐటీ మంత్రి నారా లోకేష్ తన అమెరికా పర్యటన సందర్భంగా టెస్లా సంస్థ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వైభవ్ తనేజాను కలిసి, రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. అయితే.. ఇటీవల అమెరికాలో పర్యాటించిన ప్రధాని మోదీతో ఎలాన్ మస్క్ భేటీ తర్వాత టెస్లా.. తన వాహనాల్ని విక్రయించేందు, ఉద్యోగ నియామకాలు సైతం చేపట్టింది.

Also Read : Health Insurance In AP : ఏపీలో అదిరిపోయే స్కీమ్ – ప్రతీ కుటుంబానికి రూ.25 లక్షల బీమా

ఏపీలో విస్తారంగా అందుబాటులో ఉన్న భూములతో పాటు, కొత్త రాష్ట్రంలో అధిక ప్రోత్సహకాలు లభించనున్నట్లు తెలుపుతున్నారు. అలాగే.. కియాను విజయవంతంగా రాష్ట్రంలో ప్లాంట్ ఏర్పాటు చేయించిన నేపథ్యంలో.. టెస్లాకు ఈ ప్రాజెక్టునే ఓ కేస్ స్టడీగా వివరించనున్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం టెస్లా ఇక్కడ తయారీ యూనిట్‌ను ప్రారంభించే ముందు ప్రారంభ దశలో కార్లను దిగుమతి చేసుకునేందుకు సైతం అనుమతించాలని రాష్ట్ర సర్కార్ భావిస్తోంది. అయితే.. రాష్ట్ర ప్రభుత్వం టెస్లాతో చర్చించడం ఇదే మొదటిసారి కాదు. 2017 లో చంద్రబాబు నాయుడు.. టెస్లాతో ఒక అవగాహన ఒప్పందంపై సంతకం చేశారు. రాష్ట్రంలో 4 మెగావాట్ల సామర్థ్యంతో రెండు సౌరశక్తి నిల్వ యూనిట్ల ఏర్పాటుకు సాంకేతిక నైపుణ్యాన్ని విస్తరించేందుకు మస్క్ తో ఒప్పందం కుదిరింది.

Related News

AP new rule: ఏపీలో కొత్త రూల్.. పాటించకుంటే జరిమానా తప్పదు!

King cobra sanctuary: ఏపీకి సర్‌ప్రైజ్ గిఫ్ట్.. పెద్ద ఎత్తున కింగ్ కోబ్రాలు వచ్చేస్తున్నాయ్!

Visakha: విశాఖ దుర్ఘటనపై ఎన్నో అనుమానాలు.. గ్యాస్ బండ కాదా, మరేంటి?

Pulivendula: పులివెందులలో హై టెన్షన్.. వివేకానంద పుట్టిన రోజు, సునీత సంచలన వ్యాఖ్యలు

Nara Lokesh: రప్పా రప్పా అంటే రఫ్ఫాడిస్తారు జాగ్రత్త.. లోకేష్ పవర్ ఫుల్ పంచ్

Vizag Harbour News: విశాఖలో ఫిషింగ్ హార్బర్ వద్ద ఘోర ప్రమాదం.. ఐదుగురు అక్కడికక్కడే మృతి!

Big Stories

×