BigTV English

Road : రాజా..! ఆ ఒక్క రోడ్డు .. ప్లీజ్..! మంత్రిని వేడుకున్న ఎమ్మెల్యే..

Road : రాజా..! ఆ ఒక్క రోడ్డు .. ప్లీజ్..! మంత్రిని వేడుకున్న ఎమ్మెల్యే..

Road : ఏపీలో రోడ్లు బాగాలేవని ఎప్పటి నుంచో విమర్శలు వస్తున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా రహదారులు గుంతలమయంగా మారిపోయాయని ప్రతిపక్ష పార్టీలు దుమ్మెత్తి పోస్తున్నాయి. ప్రయాణం నరకప్రాయంగా ఉందని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. బస్సుల్లో, ఆటోల్లో వెళ్లాలంటే భయపడే పరిస్థితి ఉందంటున్నారు. గుంతల రోడ్లలో ప్రయాణిస్తుంటే ఒళ్లు నొప్పుల బారిన పడుతున్నామనేది జనం మాట. రాష్ట్రంలో జాతీయ రహదారులు బాగానే ఉన్నా గ్రామాలను అనుసంధానించే రోడ్లు అధ్వానంగా ఉన్నాయని మండిపడుతున్నారు.


తాజాగా ఒక రోడ్డు కోసం అధికార పార్టీ ఎమ్మెల్యే మంత్రిని వేడుకున్నారు. అచ్యుతాపురం-అనకాపల్లి రోడ్డు అత్యంత ప్రమాదకరంగా మారిందని ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు.. రోడ్లు, భవనాలశాఖ మంత్రి దాడిశెట్టి రాజా దృష్టికి తీసుకొచ్చారు. ఈ రోడ్డు వేయించి పుణ్యం కట్టుకోవాలని ఫోన్ లో మంత్రిని కోరారు. ఈ ఒక్క పని చేయిస్తే చాలని.. మరో సాయం అడగని విజ్ఞప్తి చేశారు. అచ్యుతాపురం వచ్చిన ఎమ్మెల్యే దృష్టికి స్థానిక నేతలు రోడ్డు సమస్యను తీసుకొచ్చారు. వెంటనే కన్నబాబు రాజు ఈ విషయంపై మంత్రి దాడిశెట్టి రాజాతో మాట్లాడారు.

ఆర్ అండ్ బీ అధికారులను పంపిస్తానని మంత్రి రాజా ఎమ్మెల్యేతో చెప్పారు. అయితే కన్నబాబురాజు మాత్రం తన వద్దకు అధికారులను పంప వద్దని స్పష్టం చేశారు. రోడ్డు పనులు చేయిస్తే చాలు అన్నారు. గుంతల రోడ్డుపై ప్రయాణించలేక ప్రజలు శాపనార్ధాలు పెడుతుంటే వినలేకపోతున్నానని మంత్రికి కన్నబాబు రాజు చెప్పారు. దీంతో వెంటనే చర్యలు తీసుకుని మరమ్మతులు చేయిస్తానని మంత్రి దాడిశెట్టి రాజా హామీ ఇచ్చారు.


రోడ్డు మరమ్మతు పనులకు ప్రభుత్వం రూ. 80 లక్షలు విడుదల చేసినా అధికారులు పనులు చేయించట్లేదని మంత్రికి ఎమ్మెల్యే వివరించారు. 8 టన్నుల సామర్థ్యం ఉన్న రోడ్డుపై 60 టన్నుల బరువున్న టిప్పర్లు తిరగడం వల్ల రోడ్డు త్వరగా దెబ్బతింటోందని చెప్పారు. కాసుల వేటలో పడి అధికారులు కేసులు పెట్టడంలేదని ఎమ్మెల్యే కన్నబాబు రాజు ఆరోపించారు. ఇలా అధికార పార్టీ ఎమ్మెల్యేనే రోడ్డు సమస్యను మంత్రి దృష్టికి తీసుకెళ్లడం ఆసక్తిగా మారింది. మరి అచ్చుతాపురం-అనకాపల్లి రోడ్డుకు మోక్షం లభిస్తుందా..?

Related News

ZPTC Fightings: భగ్గుమన్న పులివెందుల.. మంత్రి ఎదుటే కొట్టుకున్న టీడీపీ, వైసీపీ కార్యకర్తలు

Pulivendula ZPTC: పులివెందుల, ఒంటమిట్టలో ముగిసిన పోలింగ్

AP Free Bus Scheme: ఆగస్ట్ 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం – స్త్రీశక్తి పథకంపై సీఎం సమీక్ష

AP Asha Workers: ఆశా వర్కర్లకు ఏపీ సర్కార్ బంపర్ ఆఫర్.. ఆరోగ్యం, భవిష్యత్తు భరోసా!

Pulivendula ZPTC: ఏపీ పాలిటిక్స్ @ పులివెందుల

Vontimitta By Election: ఓంటిమిట్ట ఉప ఎన్నికల్లో ఉద్రిక్తత.. చిన్నకొత్తపల్లి బూత్‌లో ఘర్షణ

Big Stories

×