BigTV English
Advertisement

Prodduturu TDP : వైసీపీ కంచుకోటపై టీడీపీ ఫోకస్.. ప్రొద్దుటూరు టికెట్ కోసం తమ్ముళ్ల ఫైట్..

Prodduturu TDP : కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజకీయం రోజురోజుకి రంజుగా మారుతోంది. జిల్లా లో ఎక్కడా లేని విధంగా ఆ నియోజకవర్గం రోజుకో వివాదంతో వార్తల్లో ఉంటోంది. అక్కడ వైసీపీ, టీడీపీలు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నాయి. వైసీపీ ఖాతాలో ఉన్న ఆ సెగ్మెంట్లో ఎలాగైనా పాగా వేయాలని టీడీపీ పట్టుదలతో ఉంది .. అయితే టీడీపీ ప్రొద్దుటూరు ఇన్‌చార్జ్‌గా ఉన్న ప్రవీణ్‌కి రాజకీయ అనుభవం లేకపోవడం.. పార్టీలో కొనసాగుతున్న టికెట్ వార్ తమ్ముళ్లను గందరగోళ పరుస్తోందంట.

Prodduturu TDP : వైసీపీ కంచుకోటపై టీడీపీ ఫోకస్.. ప్రొద్దుటూరు టికెట్ కోసం తమ్ముళ్ల ఫైట్..

Prodduturu TDP : కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గం రాజకీయం రోజురోజుకి రంజుగా మారుతోంది. జిల్లా లో ఎక్కడా లేని విధంగా ఆ నియోజకవర్గం రోజుకో వివాదంతో వార్తల్లో ఉంటోంది. అక్కడ వైసీపీ, టీడీపీలు ఢీ అంటే ఢీ అన్నట్లు తలపడుతున్నాయి. వైసీపీ ఖాతాలో ఉన్న ఆ సెగ్మెంట్లో ఎలాగైనా పాగా వేయాలని టీడీపీ పట్టుదలతో ఉంది .. అయితే టీడీపీ ప్రొద్దుటూరు ఇన్‌చార్జ్‌గా ఉన్న ప్రవీణ్‌కి రాజకీయ అనుభవం లేకపోవడం.. పార్టీలో కొనసాగుతున్న టికెట్ వార్ తమ్ముళ్లను గందరగోళ పరుస్తోందంట.


ప్రొద్దుటూరు.. కడప జిల్లాలోని కీలక నియోజకవర్గం.. వైఎస్ హయాంలో కాంగ్రెస్‌కి.. తర్వాత వైసీపీకి కంచుకోటగా ఉంటూ వస్తోంది. ఈ నియోజకవర్గంలో తెలుగుదేశం గతంలో రెండు సార్లు గెలిచినా.. ఆ పట్టు నిలబెట్టుకోలేకపోయింది. వచ్చే ఎన్నికల్లో అయినా ప్రొద్దుటూరులో టీడీపీ సత్తా చాటుతానంటూ దూకుడు ప్రదర్శిస్తున్నారు పార్టీ ఇన్చార్జ్ ప్రవీణ్‌కుమార్ రెడ్డి.

ప్రొద్దుటూరు నుంచి 2014, 2019 ఎన్నికల్లో గెలిచిన వైసీపీ ఎమ్యెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి హ్యాట్రిక్ విజయంపై ధీమా వ్యక్తం చేస్తున్నారు. రాచమల్లును వచ్చే ఎన్నికల్లో ఓడించి తీరతామంటూ.. టీడీపీ ఇన్చార్జ్ ప్రవీణ్‌తో పాటు ఇతర నేతలు ఎప్పటి నుంచో గ్రౌండ్ వర్క్ మొదలుపెట్టారు. ఆక్రమంలో వారు రాచమల్లు అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలతో చేస్తున్న నిరసనలు.. ప్రొద్దుటూరులో చర్చనీయాంశంగా మారుతున్నాయి.


ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి మధ్య పొలిటికల్ వార్ రోజు రోజుకి ఉద్రిక్తంగా మారుతోంది. గతంలో ఎవరు చేయని అభివృద్ధి తాను చేశానని.. ప్రొద్దుటూరు అన్ని రకాలుగా అభివృద్ధి చేశానని రాచమల్లు చెబుతుంటే.. అవినీతి అక్రమాలు చేసి రాచమల్లు వేల కోట్లకు పడగలెత్తారని టీడీపీ ఆరోపిస్తోంది.

ఇలాంటి పరిస్థితుల మధ్య ప్రవీణ్‌కుమార్‌రెడ్డి ని 50 రోజులు జైల్లో పెట్టించడం.. ప్రొద్దుటూరులో రాజకీయంగా దుమారం రేపింది. టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ స్వయంగా వెళ్లి కడప సబ్ జైల్లో ప్రవీణ్‌ని పరామర్శించి.. ప్రొద్దుటూరు టికెట్ కన్ఫార్మ్ చేయడంతో రాజకీయం మరింత రంజుగా మారింది. అయితే ఏమాత్రం రాజకీయ అనుభవం లేని ప్రవీణ్ రాచమల్లును రాజకీయంగా ఎదుర్కోలేక.. వివాదాస్పద వ్యాఖ్యలతో కలకలం రేపుతున్నారని వైసీపీ శ్రేణులు అంటున్నాయి.

జిల్లాలో ఎక్కడా లేని విధంగా ప్రొద్దుటూరులో చోటు చేసుకుంటున్న రాజకీయ వివాదాలు ఏ పార్టీకి మేలు చేస్తాయో అర్థం కాకుండా తయరైందంటున్నారు. ప్రవీణ్ కుమార్ రెడ్డి అరెస్టు ఎపిసోడ్ ప్లస్ అవుతుందని టీడీపీ భావిస్తుంటే.. వైసీపీ నేతలు మాత్రం ప్రవీణ్ వ్యవహారాన్ని లైట్ తీసుకుంటున్నారంట. ఆ క్రమంలో తనకు టీడీపీ టికెట్ ఇస్తే.. రాచమల్లు ను ఓడిస్తానంటున్నారు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి.. మరోవైపు పార్టీ కోసం రెండు సార్లు జైలుకెళ్లి వచ్చిన తనకే టికెట్ ఖరారైందంటూ ప్రచారం మొదలెట్టేశారు ప్రవీణ్‌కుమార్.

జిల్లా పార్టీ అధ్యక్షుడిగా ఉన్నమాజీ ఎమ్మెల్యే లింగారెడ్డి.. వారిద్దరని పక్కకి నెట్టేస్తూ తానే ప్రొద్దుటూరు నుంచి పోటీ చేయబోతున్నట్లు ప్రకటించేసుకుంటున్నారు. వీరు చాలదన్నట్టు ప్రొద్దుటూరులో అన్న క్యాంటీన్ పెట్టి.. గత 6 నెలలుగా ఉచితంగా మధ్యాహ్నం భోజనం పెడుతున్నారు సీఎం సురేష్ నాయుడు.. ప్రస్తుతం బీజేపీలో ఉన్న రాజ్యసభ ఎంపీ సీఎం రమేష్ సోదరుడే ఈ సురేష్‌నాయుడు.. అధిష్టానం ఆదేశాల మేరకు అన్న క్యాంటీన్ ఏర్పాటు చేశానని సురేష్ నాయుడు చెప్పుకోవడం.. ఇప్పటికే ఉన్నవారితో తలలు పట్టుకుంటున్న టీడీపీ కార్యకర్తలను మరింత అయోమయానికి గురిచేస్తోంది. మరి ఈ నాలుగుస్థంభాలాట ఎటు దారి తీస్తుందో చూడాలి.

Related News

VSKP-MBNR Train: విశాఖ-మహబూబ్‌నగర్ రైలుకు తప్పిన ముప్పు.. మార్గ మధ్యలో నిలుపువేత, ఏం జరిగింది?

TTD Chairman BR Naidu: మూడు గంటల్లోనే శ్రీవారి దర్శనం కల్పిస్తున్నాం: బీఆర్ నాయుడు

Vallabhaneni Vamsi: రాజకీయాల్లోకి రీ ఎంట్రీ.. జగన్‌ పర్యటనలో వల్లభనేని

Pawan Kalyan: పంట నష్టం అంచనాలను వేగంగా పూర్తి చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆదేశాలు

Kolikapudi Srinivasa Rao: కొలికపూడికి చంద్రబాబు స్ట్రాంగ్ వార్నింగ్

Nara Lokesh: ఏపీ ప్రభుత్వ కీలక నిర్ణయం.. సింగపూర్‌కు ప్రభుత్వ ఉపాధ్యాయులు!

Gollapalli Surya Rao: మాజీ మంత్రి, వైసీపీ నేత సూర్యారావుకు గుండెపోటు

Botsa Satyanarayana: వైసీపీ వాళ్లను ఎలా ఇరికించాలి అని మాత్రమే ప్రభుత్వం ఆలోచిస్తోంది.. బొత్స విమర్శలు

Big Stories

×