TTD News: తిరుమల తిరుపతి దేవస్థానం సీరియస్ గా కీలక ప్రకటన జారీ చేసింది. ఎవరైనా ఇలాంటి చర్యలకు మున్ముందు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని టీటీడీ హెచ్చరించింది. తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లే విధంగా ఎవరు ప్రవర్తించినా సహించే ప్రసక్తి లేదని, ఇటువంటి చర్యలకు పాల్పడేవారు తస్మాత్ జాగ్రత్త అంటూ టీటీడీ అధికారిక ప్రకటన విడుదల చేయడం విశేషం.
అసలేం జరిగిందంటే..
తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రజా సంబంధాల అధికారినిగా నిష్కా బేగం పని చేసినట్లు, ఇంటిపై ఈడీ దాడులు చేసిందని, అక్కడ తిరుమల కు సంబంధించిన నగలను స్వాధీనం చేసుకున్నట్లు సామాజిక మాధ్యమాలలో పలు ఫోటోలు వైరల్ గా మారాయి. గత ప్రభుత్వ హయాంలో ప్రజా సంబంధాల అధికారినిగా పనిచేసిన నిష్కా బేగంకు సంబంధించి సోషల్ మీడియాలో వార్తలు వైరల్ కావడంతో టీటీడీ స్పందించింది.
తిరుమల తిరుపతి దేవస్థానంలో అటువంటి వ్యక్తి ప్రజా సంబంధాల అధికారిగా అసలు పని చేయలేదని, అంతేకాకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న పోస్టులో గతంలో ఎక్కడో జరిగిన ఫోటోలను జతపరిచి తిరుమల తిరుపతి దేవస్థానం పేరును ఉపయోగించడం పై టీటీడీ సీరియస్ గా ఖండించింది. వైరల్ గా మారిన పోస్టులో గల అధికారి ఎప్పుడు టీటీడీలో పనిచేయలేదని, ఇటువంటి వాటిని ప్రచారం చేయడం తగదంటూ టీటీడీ సూచించింది.
Also Read: AP Intermediate Exams: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఆ పరీక్షలు ఇక లేవట!
తిరుమల పవిత్రతకు భంగం వాటిల్లేలా ఇటువంటి చర్యలకు పాల్పడే వారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు సైతం జారీ చేసింది. అవాస్తవ వార్తలు ప్రచారం చేయడం తో భక్తులను తప్పుదోవ పట్టించినట్లుగా ఉంటుందని, అంతేకాకుండా భక్తుల మనోభావాలను దెబ్బతీసే విధంగా ఇటువంటి చర్యలకు పాల్పడడం తగదని మరో మారు టీటీడీ సూచించింది. తిరుమల తిరుపతి దేవస్థానం కు సంబంధించి ఏ విషయమైనా పూర్తిగా నిర్ధారించుకోవాల్సిన అవసరం ఉందని, కోట్ల మంది భక్తుల మనోభావాలను గౌరవించి ఇటువంటి వాటిని ప్రచారం చేయడం తగదంటూ టీటీడీ ప్రకటించింది.
ఆ వార్తలు పూర్తిగా అవాస్తవం.. క్లారిటీ ఇచ్చిన తిరుమల తిరుపతి దేవస్థానం
గత ప్రభుత్వ హయాంలో టీటీడీలో ప్రజా సంబంధాల అధికారిణిగా పని చేసిన నిష్కా బేగం ఇంటిపై ఈడీ దాడులు చేసిందని, ఆ నగలను స్వాధీనం చేసుకున్నట్లు కొన్ని ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్
ఆ ఫోటోలకు సంబంధించిన వార్త పూర్తిగా… pic.twitter.com/S1MpgppKbY
— BIG TV Breaking News (@bigtvtelugu) January 8, 2025