Harish Shankar : టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ (Harish Shankar) పరిస్థితి ముందు నుయ్యి వెనక గొయ్యి అన్నట్టుగా ఉంది. చాలాకాలంగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కోసం వెయిట్ చేస్తున్న ఈ డైరెక్టర్ కి ఇప్పుడు కంప్లీట్ గా బ్యాడ్ టైమ్ నడుస్తోంది. ఇలాంటి టైంలో డైరెక్టర్ హరీష్ శంకర్ కి బాలయ్య (Balakrishna) గోల్డెన్ ఛాన్స్ ఇచ్చినట్టుగా బజ్ నడుస్తోంది. ప్రస్తుతం బాలయ్య వరస హిట్ లతో ఫుల్ జోష్ లో ఉన్నారు. అఖండ, వీర సింహారెడ్డి, భగవంత్ కేసరి వంటి సినిమాలతో హ్యాట్రిక్ హిట్స్ అందుకున్న బాలయ్య ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ సినిమాతో తెరపైకి రాబోతున్నారు.
ఇక మరోవైపు హరీష్ శంకర్ (Harish Shankar) చేతిలో సినిమా లేక అల్లాడిపోతున్నాడు. రీసెంట్ గా రవితేజతో ఆయన తీసిన ‘మిస్టర్ బచ్చన్’ మూవీ రవితేజ కెరీర్ లోనే భారీ డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. మరోవైపు పవన్ కళ్యాణ్ తో ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాను ప్రకటించినప్పటికీ, అసలు ఆ సినిమా ఎప్పుడు పట్టాలెక్కుతుందో కూడా తెలియని పరిస్థితి. అంతలోపే యంగ్ హీరో రామ్ పోతినేని హీరోగా హరీష్ శంకర్ మరో సినిమాను చేయబోతున్నాడని ప్రచారం జరిగింది. అయితే అసలు ఆ కాంబో కూడా వర్కౌట్ కాకపోవడంతో ప్రస్తుతం హరీష్ శంకర్ డీలా పడినట్టు తెలుస్తోంది.
అయితే రీమేక్ సినిమాలను తెరకెక్కించడంలో మంచి డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న ఈ హరీష్ శంకర్ (Harish Shankar) త్వరలోనే బాలయ్యతో మరో రీమేక్ సినిమాను రూపొందించబోతున్నారని అంటున్నారు. టాలీవుడ్ లో ప్రస్తుతం నడుస్తున్న టాక్ ప్రకారం… గత ఏడాది మలయాళంలో రిలీజై బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న ‘ఆవేశం’ మూవీని తెలుగులో రీమేక్ చేయాలనుకుంటున్నారు హరిష్ శంకర్. ‘ఆవేశం’ (Aavesham) మూవీలో మలయాళం లో ఫాహద్ ఫాజిల్ హీరోగా నటించగా, ఇప్పుడు అదే పాత్రను బాలయ్యతో చేయించాలని హరీష్ శంకర్ అనుకున్నట్టుగా టాక్ నడుస్తోంది.
తెలుగు నేటివిటికి తగ్గట్టుగా ఆ సినిమాలో మార్పులు చేర్పులు చేసి, బాలయ్యతో ఎలాగైనా సరే హిట్ కొట్టాలనేది హరిష్ శంకర్ ప్లాన్. ఇక ఈ సినిమాను నిర్మాత నాగ వంశీ నిర్మిస్తారని, సినిమాకు సంబంధించిన స్క్రిప్ వరకు పూర్తయ్యాకే హరిష్ బాలయ్యని వెళ్లి కలుస్తారని అంటున్నారు. కానీ అసలు ఈ రీమేక్ ఆలోచన ఎంతవరకు వర్కౌట్ అవుతుంది అనేది ఇప్పుడు ప్రశ్న.
ప్రస్తుతం ఫ్యాన్ ఇండియా రేంజ్ లో ఏ సినిమా రిలీజ్ అయిన 45 రోజుల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్నాయి. అలా ఓటిటిలో అడుగుపెట్టే సినిమాలు అన్ని భాషల్లోనూ అందుబాటులో ఉంటున్నాయి. ఒకవేళ అలాంటి అవకాశం లేకపోతే ఇంగ్లీష్ సబ్ టైటిల్స్ ఉండనే ఉన్నాయి. ఇవన్నీ కాదనుకుని రీమేక్ చేస్తే రీసెంట్ గా ‘రైడ్’ రీమేక్ ‘మిస్టర్ బచ్చన్’, ‘తేరి’ రీమేక్ ‘బేబీ జాన్’లాగా బొక్క బోర్లా పడడం ఖాయం. ఇలాంటి టైంలో హరిష్ శంకర్ మళ్లీ రీమేక్ పట్టుకొని బాలయ్య దగ్గరికి వెళ్లడం అంటే ఆలోచించాల్సిన విషయమే.